https://oktelugu.com/

మూడు ప్రాంతాలను ముగ్గురికి పంచిన జగన్?

ఏపీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్ రూటు మార్చాడు. అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే తన పవరేంటో చూపించాడు. ప్రత్యర్థులను జైలుకు పంపాడు. మీడియాకు హెచ్చరిక పంపాడు. అన్ని వ్యవస్థలను చక్కదిద్దాడు. పాలనలోనూ తనదైన ముద్ర వేశాడు. అయితే నర్సాపురం ఎంపీ రఘురామ లాంటి వారి వల్ల పార్టీలో అసమ్మతులు చెలరేగాయి.. ప్రభుత్వ పాలన.. పార్టీ పాలన జగన్ కు కష్టమైపోతోంది. ఎమ్మెల్యేల్లో అసహనం పెరిగిపోతోంది. అందుకే ఇటీవలే ప్రతీ ఎమ్మెల్యేతో భేటికి సీఎం నిర్ణయించారు. అంతేకాదు.. […]

Written By:
  • NARESH
  • , Updated On : July 2, 2020 6:39 pm
    Follow us on


    ఏపీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్ రూటు మార్చాడు. అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే తన పవరేంటో చూపించాడు. ప్రత్యర్థులను జైలుకు పంపాడు. మీడియాకు హెచ్చరిక పంపాడు. అన్ని వ్యవస్థలను చక్కదిద్దాడు. పాలనలోనూ తనదైన ముద్ర వేశాడు. అయితే నర్సాపురం ఎంపీ రఘురామ లాంటి వారి వల్ల పార్టీలో అసమ్మతులు చెలరేగాయి.. ప్రభుత్వ పాలన.. పార్టీ పాలన జగన్ కు కష్టమైపోతోంది. ఎమ్మెల్యేల్లో అసహనం పెరిగిపోతోంది. అందుకే ఇటీవలే ప్రతీ ఎమ్మెల్యేతో భేటికి సీఎం నిర్ణయించారు. అంతేకాదు.. ఇప్పుడు మరో సంస్కరణ చేసి మూడు ప్రాంతాలను ముగ్గురికి జగన్ పంచేశారని పార్టీ వర్గాల ద్వారా తెలుస్తోంది.

    పార్టీని పటిష్టపరచడం.. క్షేత్రస్థాయిలో బలంగా తయారు చేయడం.. నేతలు, ఎమ్మెల్యేల సమస్యలు తీర్చడం.. పార్టీని పటిష్ట పరచడమే లక్ష్యంగా సీఎం జగన్ పెద్ద ఎత్తుగడ వేసినట్టు తెలుస్తోంది.

    టీవీ9 రవిప్రకాష్, ఆ హీరోకు బిగుసుకుంటున్న ఉచ్చు?

    తాజాగా వైసీపీలో ఒక ముఖ్యమైన మార్పు వచ్చిందని పార్టీ వర్గాల ద్వారా తెలిసింది. సీఎం జగన్ పార్టీ వ్యవహారాలను ముగ్గురు ముఖ్య నాయకులకు పంచాడని.. మూడు ప్రాంతాలను ముగ్గురు దిగ్గజ నాయకులకు కీలకమైన సంస్థాగత బాధ్యతలను కేటాయించారని సమాచారం. పార్టీని బలోపేతం చేయడంలో భాగంగానే సీఎం జగన్ ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.

    జగన్ తర్వాత వైసీపీలో నంబర్ 2 అయిన రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డికి తాజాగా ఉత్తరాంధ్ర బాధ్యతలను జగన్ అప్పగించినట్టుగా సమాచారం. ఈయన పరిధిలో శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాల వ్యవహారాలను చూసుకుంటారు.

    ట్రంప్ స్వదేశీ.. బిడెన్ విదేశీ.. అమెరికన్స్ ఎటువైపు?

    ఇక టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డికి జంట గోదావరి జిల్లాలు, కృష్ణ, గుంటూరు,చిత్తూరు జిల్లాల బాధ్యతలను అప్పగించారని తెలిసింది. ఇక రాయలసీమతోపాటు,నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో పార్టీ కార్యకలాపాలను రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి పర్యవేక్షించనున్నట్టు సమాచారం.

    ఇక సజ్జల రామకృష్ణారెడ్డికి అదనంగా కేంద్ర పార్టీ ప్రధాన కార్యాలయానికి చీఫ్ కోఆర్డినేటర్ గా నియమించారు. విజయసాయిరెడ్డిని అనుబంధ సంస్థలందరికీ ఇన్ చార్జిగా బాధ్యతలు ఇచ్చారు.

    ఇలా పార్టీని గాడిన పెట్టడానికి సీఎం జగన్ రాష్ట్రంలోని మూడు ప్రాంతాలను ముగ్గురికి అప్పగించి పార్టీ పటిష్టత కోసం కీలక నిర్ణయం తీసుకున్నారు. గత చంద్రబాబు పాలనను పట్టించుకోని పార్టీని పట్టించుకోక ఓడిపోవడంతో ఈసారి అలాంటి తప్పిదాలు జరగకుండా జగన్ ఈ చర్య తీసుకున్నట్టు తెలుస్తోంది.

    -ఎన్నం