ఇది విన్నారా.. కేసీఆర్ గారు!

తెలంగాణలో సచివాలయం కూల్చివేతపై అన్ని ఆడంకులు తొలిగిపోవడంతో ఆ భవనాల కూల్చివేతకి కేసీఆర్ సర్కార్ సిద్ధపడ్డది. దింతో ఆ భవనాలను కూల్చకుండా కాంగ్రెస్ కొత్త డిమాండ్ తో కేసీఆర్ కి షాక్ ఇచ్చింది. ప్రస్తుతం రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగుతన్న వేళ సచివాలయ భవనాలను కోవిడ్ ఆస్పత్రిగా మారిస్తే ప్రజలకు ఎంతో ఉపయోగపడుతుందని తెలంగాణ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు అనిల్ కుమార్ యాదవ్ డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ మూర్ఖంగా ప్రవర్తించొద్దని సూచించారు. సెక్రటేరియట్ అందరికీ అందుబాటులో […]

Written By: Neelambaram, Updated On : July 2, 2020 6:54 pm
Follow us on

తెలంగాణలో సచివాలయం కూల్చివేతపై అన్ని ఆడంకులు తొలిగిపోవడంతో ఆ భవనాల కూల్చివేతకి కేసీఆర్ సర్కార్ సిద్ధపడ్డది. దింతో ఆ భవనాలను కూల్చకుండా కాంగ్రెస్ కొత్త డిమాండ్ తో కేసీఆర్ కి షాక్ ఇచ్చింది. ప్రస్తుతం రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగుతన్న వేళ సచివాలయ భవనాలను కోవిడ్ ఆస్పత్రిగా మారిస్తే ప్రజలకు ఎంతో ఉపయోగపడుతుందని తెలంగాణ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు అనిల్ కుమార్ యాదవ్ డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ మూర్ఖంగా ప్రవర్తించొద్దని సూచించారు. సెక్రటేరియట్ అందరికీ అందుబాటులో ఉంటుందని, పేదలకు కూడా ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని తెలిపారు. ప్రస్తుతం తెలంగాణలో కరోనా విజృంభిస్తూ ఆందోళనకరంగా మారిందన్నారు. ‘రోగులు పెరుగుతున్నా ముఖ్యమంత్రి పట్టించుకోరా.. సచివాలయాన్ని కోవిడ్ ఆస్పత్రిగా మార్చలేరా? సచివాలయం కూల్చివేత ప్రజా వ్యతిరేకం. 10 వేల పడకల ఆస్పత్రిగా చేయొచ్చు. పేదలకు అండగా నిలవచ్చు.’ అని అనిల్ కుమార్ సూచించారు.

తెలంగాణ ప్రభుత్వం ప్రస్తుతం సచివాలయం ఉన్న ప్రదేశంలోనే కొత్త సెక్రటేరియట్ భవనాన్ని నిర్మించాలని అనుకుంటోంది. ఇటీవల ఇందుకు హైకోర్టు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అందుకే… ప్రస్తుత భవనాన్ని వేగంగా కూల్చేందుకు రెడీ అవుతోంది. ఓ వారంలో ఈ ప్రక్రియ మొదలవ్వనున్నట్లు తెలిసింది. ఏమాత్రం ఆలస్యం కాకుండా ఈ పని వేగంగా జరగాలని సీఎం కేసీఆర్ ఆదేశించినట్లు సమాచారం. దాంతో రాష్ట్ర రహదారులు, భవనాల శాఖ రెడీ అయ్యింది. త్వరలో కేసీఆర్ సమక్షంలో జరిగే కేబినెట్ మీటింగ్‌ లో ఏ రోజు కూల్చివేత మొదలుపెట్టాలో డిసైడ్ చేస్తారు. కూల్చివేత అనేది హంగామా ఏదీ లేకుండా ఫటాఫట్ అయిపోయేలా చెయ్యాలనుకుంటుండటంతో… 10 పెద్ద కంపెనీలు… కూల్చేస్తామని ముందుకొచ్చాయి. ఏ కంపెనీలు ఎలా కూల్చాలనుకుంటున్నాయో తెలిపాయి. అందువల్ల త్వరగా ఇది పూర్తి చేసి… శ్రావణమాసంలో కొత్త సచివాలయ నిర్మాణానికి ప్రభుత్వం సన్నద్ధమవుతున్నట్లు తెలిసింది.