https://oktelugu.com/

కుర్రాళ్లతో పోటీ పడలేక సీరియల్స్‌ బాటలోకి హాస్య ‘బ్రహ్మ’!

‘ఏ మందుకైనా ఎక్స్‌పైరీ డేట్‌ అనేది ఒకటి ఉంటుంది’. అత్తారింటికి దారేది సినిమాలో త్రివిక్రమ్ రాసిన డైలాగ్ ఇది. కొంత సినీ నటులకు చక్కగా సరిపోతుంది. కొంత మందిని మినహాస్తే ఎంత గొప్ప నటులైనా.. ఎప్పుడో ఒక్కప్పుడు.. ఎక్కడో ఒక చోట వారి స్టార్డమ్‌ తగ్గిపోతుంది. అవకాశాలు మొహం చాటేస్తాయి. వచ్చిన వాటితోనే సంతృప్తి చెందాల్సి వస్తుంది. టాలీవుడ్‌లో అగ్ర హాస్య నటుడిగా దాదాపు రెండు దశాబ్దాల పాటు ఓ వెలుగు వెలిగిన హాస్య బ్రహ్మ.. బ్రహ్మానందం […]

Written By:
  • admin
  • , Updated On : July 2, 2020 / 06:24 PM IST
    Follow us on


    ‘ఏ మందుకైనా ఎక్స్‌పైరీ డేట్‌ అనేది ఒకటి ఉంటుంది’. అత్తారింటికి దారేది సినిమాలో త్రివిక్రమ్ రాసిన డైలాగ్ ఇది. కొంత సినీ నటులకు చక్కగా సరిపోతుంది. కొంత మందిని మినహాస్తే ఎంత గొప్ప నటులైనా.. ఎప్పుడో ఒక్కప్పుడు.. ఎక్కడో ఒక చోట వారి స్టార్డమ్‌ తగ్గిపోతుంది. అవకాశాలు మొహం చాటేస్తాయి. వచ్చిన వాటితోనే సంతృప్తి చెందాల్సి వస్తుంది. టాలీవుడ్‌లో అగ్ర హాస్య నటుడిగా దాదాపు రెండు దశాబ్దాల పాటు ఓ వెలుగు వెలిగిన హాస్య బ్రహ్మ.. బ్రహ్మానందం పరిస్థితి ఇప్పుడు అలానే ఉంది. ఒకప్పుడు నెలకు పది సినిమాల చొప్పున చేసిన ఆయన చేతుల్లో ఇప్పుడు ఒక్క సినిమా కూడా లేదు. ఒక దశలో బహ్మానందం కాల్షీట్ల కోసం వెంటపడ్డ దర్శకులు ఆయణ్ని పట్టించుకోవడం లేదు. బ్రహ్మీ ఉంటే చాలు సినిమా హిట్టు అనే అనే రోజుల నుంచి బహ్మానందం తెరపై కనిపించిన రోజులు వచ్చేశాయి.

    హైదరాబాద్ లో నో-లాక్‌డౌన్.. కారణాలివే?

    సప్తగిరి, వెన్నెల కిషోర్, ప్రియదర్శి లాంటి ప్రతిభావంతులైన ఆర్టిస్టులతో పాటు జబర్దస్త్‌ స్టాండప్‌ కమెడియన్లతో పోటీ పడలేక అనేకమంది సీనియర్ హాస్య నటులు తెరమరుగయ్యారు. వీరి హవాలో బ్రహ్మీలాంటి లెజెండ్లను కూడా తెలుగు ప్రేక్షకులు మరిచిపోయారు. కుర్రాళ్లతో పోటీలో అవకాశాలు తక్కువైతే.. అనారోగ్య సమస్యల కారణంగా బ్రహ్మానందం వెండితెరకు దూరమయ్యాడు. కొన్ని రోజుల కిందట ఆయనకు హార్ట్‌ సర్జరీ జరిగింది. దాన్నుంచి పూర్తిగా కోలుకున్నప్పటికీ మునుపటి స్థాయిలో అవకాశాలు రావడం లేదు. దాంతో, బ్రహ్మానందం ఓ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. బుల్లితెర పై అరంగేట్రం చేయాలని డిసైడయ్యాడు. ఆ మధ్య ‘ బ్రహ్మి కామెడీ షో’ అనే పేరుతో ఓ రియాలిటీ షో ని చేసినప్పటికీ అది అంతగా సక్సెస్‌ కాలేదు. ఈ నేపథ్యంలో ఓ డైలీ సీరియల్ ద్వారా బుల్లితెర పై కనిపించాలని అనుకుంటున్నాడు సీనియర్ నటుడు. దీనికి సంబంధించి ఇప్పటికే ఓ ఓ ప్రముఖ చానెల్‌తో ఒప్పందం కూడా చేసుకున్నాడని సమాచారం.

    టీడీపీ నేతల దృష్టిలో ఆంబులెన్సులన్నీ గ్రాఫిక్స్ ?

    టాలీవుడ్‌కు బ్రహ్మానందం దూరమైనా ఆయనకు అభిమానులు చాలా మందే ఉన్నారు. ముఖ్యంగా మహిళలు, పెద్ద వయసు వాళ్లు బ్రహ్మానందాన్ని తెగ ఇష్ట పడతారు. ఈ మధ్య సీరియల్స్‌కు మహిళలతో పాటు పురుషులు కూడా అడిక్ట్‌ అయ్యారు. ఈ క్రమంలో బ్రహ్మీ బుల్లితెరపై కనిపిస్తే.. అక్కడా కామిడీ పండిస్తే వాళ్లకు పండగే. అయితే , బ్రహ్మానందం ఎలాంటి సీరియల్‌లో నటిస్తున్నాడు.. ఆయన పాత్ర ఏంటనే విషయంపై ప్రస్తుతానికి సస్పెన్స్‌ కొనసాగుతోంది.