Homeజాతీయ వార్తలుGas Charge in Restaurant Bill: వార్‌ ఎఫెక్ట్‌.. టిఫిన్‌ ధరలకు రెక్కలు.. గ్యాస్‌ చార్జీ...

Gas Charge in Restaurant Bill: వార్‌ ఎఫెక్ట్‌.. టిఫిన్‌ ధరలకు రెక్కలు.. గ్యాస్‌ చార్జీ అదనం!

Gas Charge in Restaurant Bill: ఇరాన్‌ యుద్ధం కారణంగా ఆయిల్‌ సంక్షోభం వైపు ప్రపంచం పయనిస్తోంది. ఇప్పటికే శ్రీలంక, పాకిస్తాన్, చైనా, బంగ్లాదేశ్, జపాన్‌లో ఆయిల్‌ నిల్వలు అడుగంటాయి. భారత్‌లో కూడా వంటగ్యాస్‌ నిల్వలు తగ్గిపోతున్నాయి. దీంతో కేంద్రం గ్యాస్‌« ధరలు పెంచించింది. మరోవైపు యుద్దం ఇప్పటల్లో ముగిసే అవకాశం కనిపించడం లేదు. దీంతో కస్టమర్లు గ్యాస్‌ బుకింగ్‌ పెంచారు. దీంతో కొరత డిమాండ్‌కు తగినట్లుగా సప్లయ్‌ జరగడం లేదు. ఈ నేపథ్యంలో దేశంలోని మెట్రో […]

Gas Charge in Restaurant Bill: ఇరాన్‌ యుద్ధం కారణంగా ఆయిల్‌ సంక్షోభం వైపు ప్రపంచం పయనిస్తోంది. ఇప్పటికే శ్రీలంక, పాకిస్తాన్, చైనా, బంగ్లాదేశ్, జపాన్‌లో ఆయిల్‌ నిల్వలు అడుగంటాయి. భారత్‌లో కూడా వంటగ్యాస్‌ నిల్వలు తగ్గిపోతున్నాయి. దీంతో కేంద్రం గ్యాస్‌« ధరలు పెంచించింది. మరోవైపు యుద్దం ఇప్పటల్లో ముగిసే అవకాశం కనిపించడం లేదు. దీంతో కస్టమర్లు గ్యాస్‌ బుకింగ్‌ పెంచారు. దీంతో కొరత డిమాండ్‌కు తగినట్లుగా సప్లయ్‌ జరగడం లేదు. ఈ నేపథ్యంలో దేశంలోని మెట్రో నగరాలు అయిన ముంబై, కోల్‌కతా, చెన్నై, హైదరాబాద్, ఢిల్లీ వంటి నగరాల్లో హోటళ్లు మూతపడుతున్నాయి. చాలా మంది గ్యాస్‌ కొరత కారణంగా దోశ, వడ, పరోటా వంటి టిఫిన్లు నిలిపివేశాయి. దీంతో వినియోగదారులు ఇబ్బంది పడుతున్నారు.

సంక్షోభ ఇలా..
ఇజ్రాయెల్‌–ఇరాన్‌ ఘర్షణలు హార్ముజ్‌ జలసంధి మార్గాన్ని ప్రభావితం చేశాయి. భారతదేశంలో వంట గ్యాస్‌ సాధారణంగా లభిస్తున్నా, కమర్షియల్‌ ఎల్‌పీజీ 30% కొరత పడింది. కేంద్రం కూడా గృహావసరాలకే ప్రాధాన్యం ఇస్తోంది. దీంతో చెన్నై, బెంగళూరు, హైదరాబాద్, మదురైలో చిన్న హోటళ్లు మూతలు పడ్డాయి. ప్రభుత్వం ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా దిగుమతులు పెంచి, ఉత్పత్తి 25% ఎక్కువ చేసినా తాత్కాలిక ఇబ్బందులు కొనసాగుతున్నాయి.

హోటళ్లలో గ్యాస్‌ చార్జీలు..
గ్యాస్‌ కొరత కారణంగా కొందరు హోటల్‌ నిర్వాహకులు కమర్షియల్‌ గ్యాస్‌ సిలిండర్లను బ్లాక్‌లో కొనుగోలు చేస్తున్నారు. ఒక్కో సిలిండర్‌కు రూ.6 వేల నుంచి రూ.7 వేలకు కొనుగోలు చేసి టిఫిన్లు తయారు చేస్తున్నారు. బ్లాక్‌ సిలిండర్‌ భారం కావడంతో హోటళ్ల నిర్వామకులు కస్టమర్లపై ఆ భారం వేస్తున్నారు. టిఫిన్‌ చార్జీతోపాటు అదనంగా గ్యాస్‌ చార్జి కలిపి బిల్లు ఇస్తున్నారు. సాధారణంగా ఇడ్లీ ప్లేట్‌ రూ.20–50, దోసలకు రూ.30, చికెన్‌ కర్రీలకు రూ.40–60 ’గ్యాస్‌ సర్చార్జ్‌’ జోడిస్తున్నారు. బిల్లు ఫోటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి.

కల్టెలకు డిమాండ్‌..
గ్యాస్‌ కొరత కారణంగా కట్టెలు(వంటచెరుకు)కు డిమాండ్‌ పెరిగింది. హాస్టళ్లు, హోటళ్లు, ఫంక్షన్లకు వంటచెరుపై వంట చేస్తున్నారు. దీంతో కట్టెల ధరలు రెట్టింపు అయ్యాయి. కిలోకు రూ.50 ఉన్న ధరను రూ.100కు పెంచేశారు అమ్మకందారులు. ఇక పెద్ద రెస్టారెంట్లు ఎలక్ట్రిక్‌ కుకింగ్‌కు మారాయి. వినియోగదారులు ఇంటి వంటలు, ఫుడ్‌ డెలివరీలకు షిఫ్ట్‌ అవుతున్నారు. ఆహార ధరలు మరింత పెరిగి మధ్యతరగతి జీవన ఖర్చును పెంచింది.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.

Related News

Most Popular

Oktelugu Epaper