Chandrababu Naidu: ఏపీలో సార్వత్రిక ఎన్నికల సందడి అప్పుడే నెలకొంది. వచ్చే ఎన్నికల్లో గెలవాలని రాజకీయా పార్టీల ఇప్పటి నుంచే పావులు కదుపుతున్నారు. ముఖ్యంగా గత ఎన్నికల్లో ఘోర పరాజయం చెందిన టీడీపీ ఈసారి ఆ పరిస్థితి రావొద్దని సమాయత్తమవుతుంది. గత ఎన్నికల్లో చేసిన తప్పేంటి..? మరోసారి అలాంటి తప్పు చేయకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి..? లాంటి విషయాలపై దృష్టి పెట్టింది. ఈ నేపథ్యంలో పార్టీ అంతర్గత విషయాలపై ప్రధానంగా ఫోకస్ చేస్తోంది. ఈ నేపథ్యంలో టీడీపీ అధినేత బాబు అభ్యర్థుల ఎంపిక విషయంలో తగు జాగ్రత్తలు తీసుకునే అవకాశం ఉందని సైకిల్ పార్టీలో చర్చించుకుంటున్నారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో టీడీపీ ఎదగలేకపోతున్నా.. వచ్చే రోజుల్లో మంచిరోజులు వస్తాయని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో టీడీపీ టికెట్ కోసం కొన్ని ఏరియాల్లో పోటీ పడుతున్నారు. దీంతో బాబుకు కొత్త తలనొప్పి మొదలైంది.
అనంతపురం జిల్లాలోని ధర్మవరం నియోజకవర్గం టీడీపీకి కంచుకోట. ఇక్కడ టిక్కెట్ కోసం ఎప్పుడూ పోటీ ఏర్పుడతుంది. అయితే ఈ నియోజకవర్గం నుంచి పోటీ చేసేందుకు పరిటాల శ్రీరామ్ రెడీ అవుతున్నారు. ఇందులో భాగంగా తన ఏరియాలో పట్టు సాధించేందుకు సభలు, సమావేశాలు నిర్వహిస్తూ పార్టీ కార్యకర్తల్లో ఉత్సాహాన్ని నింపుతున్నారు. దీంతో వచ్చే ఎన్నికల్లో గెలుపు ఖాయమే అన్నట్లు సంకేతాలిస్తున్నారు. ఇదిలా ఉండగా ఇక్కడ టికెట్ కోసం వరదాపురం సూరి కూడా పోటీ పడుతున్నారు. అయితే సూరికి ఓటు బ్యాంకు పుష్కలంగా ఉంది. కానీ పరిటాల శ్రీరామ్ పార్టీకి ఎన్నోఏళ్లుగా సేవ చేస్తున్నారు. దీంతో అభ్యర్థుల విషయంలో ఇక్కడ బాబుకు తలనొప్పిగా మారింది.
Also Read: AP Cabinet Expansion: మంత్రివర్గ విస్తరణ: జగన్ కేబినెట్ లో ఎవరు ఇన్..? ఎవరు ఔట్?
అయితే ఇలాంటి పరిస్థితి బాబుకు కొత్తేమీ కాదు. కానీ గత ఎన్నికల్లో అధికారంలో ఉన్న బాబు అభ్యర్థుల విషయంలో కొన్ని మిస్టేక్స్ చేశారు. దీంతో చాలా చోట్ల టీడీపీ అభ్యర్థులను చూసి ఓట్లు పడలేదు. దీంతో ఈసారి అలాంటి తప్పు చేయకుండా జాగ్రత్తపడాలని అనుకుంటున్నారు. అందుకే ఆచి తూచి అభ్యర్థులను ఎంపిక చేయనున్నారని పార్టీలో చర్చించుకుంటున్నారు. ఇదిలా ఉండగా టీడీపీ నేతలో ఆయా నియోజకవర్గాల్లో తమ పట్టును సాధించారు.వచ్చే ఎన్నికల్లో తమకే టికెట్ వస్తుందన్న ధీమాతో ఉన్నారు. ఈ సందర్భంలో అభ్యర్థుల మార్పుతో పార్టీకి తీవ్ర నష్టం జరుగుతుందని భావిస్తున్నారు.
ప్రభుత్వంపై వ్యతిరేకత వస్తుందని అని ప్రెస్ మీట్లలో టీడీపీ నాయకులు చెబుతున్నారు. దీంతో పార్టీక్యాడర్లోనూ కాస్త ఉత్సాహం పెరిగింది. దీంతో వచ్చే ఎన్నికల్లో టీడీపీ అధికారంలోకి వచ్చే సూచనలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. దీంతో పార్టీ టికెట్ కోసం పోటీ తీవ్రమైంది. ఇక గత ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన వారు తమ నియోజకవర్గ ప్రజలను ఆకట్టుకునేందుకు పట్టు సాధిస్తున్నారు. అయితే కర్నూలు జిల్లాలోని డోన్ నియోజకవర్గంలో ఇన్ చార్జీగా ఉన్న ధర్మవరపు సుబ్బారెడ్డిని కే ఈ కుటుంబం వ్యతిరేకిస్తుంది. ఇలాంటి పరిస్థితి మరికొన్ని నియోజకవర్గాల్లో నెలకొంది. దీంతో ఇప్పుడు చంద్రబాబు ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటాడోనన్న ఆసక్తి నెలకొంది.
Also Read:Ram Charan- NTR RRR Movie Review: ఆర్ఆర్ఆర్: ఇది సగటు ప్రేక్షకుడి రివ్యూ
Recommended Video: