https://oktelugu.com/

RRR Movie: చంద్రబాబు ఇలాకాలో ఆర్ఆర్ఆర్ లొల్లి.. ఘర్షణ

RRR Movie: ఆర్ఆర్ఆర్ మూవీ నేడు ప్రేక్షకుల ముందుకు రానుంది. భారీ బడ్జెట్ తో రూపొందిన సినిమా కావడంతో ప్రేక్షకుల్లో భారీ అంచనాలు పెరిగిపోయాయి. మెగాపవర్ స్టార్ రాంచరణ్, యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ హీరోలుగా నటించిన సినిమాలో ఎన్నో అద్భుతాలు సృష్టించారని తెలుస్తోంది. స్వాతంత్ర్య సమరయోధుల ఇతివృత్తంగా తీసుకున్న కథ కావడంతో అభిమానుల్లో సందడి నెలకొంది. మొదటి ఆట చూసేందుకే ఇష్టపడుతున్నారు. ఎన్టీఆర్ సరసన హాలీవుడ్ నటి ఒలివియా మోరీస్, రాంచరణ్ సరసన అలియాభట్ నటిస్తున్నారు. […]

Written By:
  • Srinivas
  • , Updated On : March 25, 2022 / 11:39 AM IST
    Follow us on

    RRR Movie: ఆర్ఆర్ఆర్ మూవీ నేడు ప్రేక్షకుల ముందుకు రానుంది. భారీ బడ్జెట్ తో రూపొందిన సినిమా కావడంతో ప్రేక్షకుల్లో భారీ అంచనాలు పెరిగిపోయాయి. మెగాపవర్ స్టార్ రాంచరణ్, యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ హీరోలుగా నటించిన సినిమాలో ఎన్నో అద్భుతాలు సృష్టించారని తెలుస్తోంది. స్వాతంత్ర్య సమరయోధుల ఇతివృత్తంగా తీసుకున్న కథ కావడంతో అభిమానుల్లో సందడి నెలకొంది. మొదటి ఆట చూసేందుకే ఇష్టపడుతున్నారు. ఎన్టీఆర్ సరసన హాలీవుడ్ నటి ఒలివియా మోరీస్, రాంచరణ్ సరసన అలియాభట్ నటిస్తున్నారు.

    RRR Movie

    ట్రిపుల్ ఆర్ సినిమా రాజమౌళి కలల ప్రాజెక్టుగా రూపుదిద్దుకుంది. ఇద్దరు అగ్రహీరోలను పెట్టి సినిమా నిర్మించడం అంటే మాటలు కాదు. అందుకు చాలా రిస్క్ ఉంటుంది. వారి ఇమేజ్ దృష్ట్యా పాత్రలకు తగిన విధంగా చిత్రీకరణ చేసి వారిని తమ అభిమానుల ఆశలు నెరవేర్చేలా తీర్చిదిద్దినట్లు తెలుస్తోంది. దీంతో సినిమాపై అందరిలో ఓ రేంజ్ లో అంచనాలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆర్ఆర్ఆర్ మూవీని వెంటనే చూడాలని ఉవ్విళ్లూరుతున్నారు.

    Also Read: AP Cabinet Expansion: మంత్రివర్గ విస్తరణ: జగన్ కేబినెట్ లో ఎవరు ఇన్..? ఎవరు ఔట్?

    సినిమా ప్రపంచ వ్యాప్తంగా నేడు విడుదల అవుతున్న సందర్భంలో పలు చోట్ల ఫ్యాన్స్ తమ అభిమాన హీరో సినిమా చూసేందుకు థియేటర్ల నుంచి టికెట్లు తీసుకుంటున్నారు. కుప్పంలో ట్రిపుల్ ఆర్ సినిమా మూడు థియేటర్లలో విడుదల అవుతోంది. దీంతో అభిమానులు మూడు వేల టికెట్లు తీసుకునేందుకు రెడీ అయ్యారు. కానీ టికెట్ల మీద కొంతమంది అభిమాన సంఘం నేతల పేర్లు, ఫోన్ నెంబర్లు ఉండటంతో అభిమానులు ఆగలేకపోయారు.

    Charan, Tarak

    చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పంలోని బీసీయన్ సినీ కాంప్లెక్స్ వద్ద మెగా, నందమూరి అభిమానుల మధ్య గొడవ మొదలైంది. ఈ నేపథ్యంలో ట్రిపుల్ ఆర్ మూవీతో ఇంకా ఎన్ని ఘర్షణలు జరుగుతాయో తెలియడం లేదు. మొత్తానికి ఇద్దరు హీరోల అభిమానుల మధ్య గొడవలతో వివాదం ఎక్కడికి వెళ్తుందో తెలియడం లేదు. ఇద్దరు హీరోలు కలిసి నటిస్తే ఆనందించాల్సిందిపోయి అనవసరంగా గొడవలకు కారణమవుతుండటం వివాదాస్పదమవుతోంది. చంద్రబాబు ఇలాఖాలో సినిమాపై గొడవ రావడంతో అభిమానుల్లో కాస్త అసంతృప్తి నెలకొంది.

    Also Read:  Mahesh Rajamouli Movie: మహేష్ తో రాజమౌళి మూవీ కథ అలా ఉంటుందట.. ఓపెన్ అయిన విజయేంద్రప్రసాద్

    Recommended Video:

    Recommended Video:

    Tags