https://oktelugu.com/

AP Cabinet Expansion: మంత్రివర్గ విస్తరణ: జగన్ కేబినెట్ లో ఎవరు ఇన్..? ఎవరు ఔట్?

AP Cabinet Expansion: రాష్ట్రంలో మంత్రివర్గ విస్తరణ ఊహాగానాల నేపథ్యంలో అమాత్యుల పదవిలో ఉండేదెవరో? ఊడేదెవరో? అన్న చర్చలు సర్వత్రా చోటుచేసుకుంటున్నాయి. ప్రధానంగా ఉత్తరాంధ్రలో చోటుదక్కేదవరికి? పదవులు ఊడేదవరికి? అన్న లోతైన చర్చ అధికార పక్షంలో సాగుతోంది. సీనియర్లలో ఉద్వాసన ఎవరికి? కొత్తవారికి చోటిస్తే ఎవరికి మంత్రి పదవులు దక్కుతాయి అని భేరీజు వెసుకుంటున్నారు. ఉగాది నుంచి కొత్త జిల్లాల పాలన నేపథ్యంలో సమీకరణలు మారనున్నాయి. జిల్లాల ప్రతిపాదికగా తీసుకొని మంత్రివర్గ విస్తరణ ఉంటుందన్న ఊహాగానాలు నడుస్తున్నాయి. […]

Written By:
  • Admin
  • , Updated On : March 25, 2022 / 11:24 AM IST
    Follow us on

    AP Cabinet Expansion: రాష్ట్రంలో మంత్రివర్గ విస్తరణ ఊహాగానాల నేపథ్యంలో అమాత్యుల పదవిలో ఉండేదెవరో? ఊడేదెవరో? అన్న చర్చలు సర్వత్రా చోటుచేసుకుంటున్నాయి. ప్రధానంగా ఉత్తరాంధ్రలో చోటుదక్కేదవరికి? పదవులు ఊడేదవరికి? అన్న లోతైన చర్చ అధికార పక్షంలో సాగుతోంది. సీనియర్లలో ఉద్వాసన ఎవరికి? కొత్తవారికి చోటిస్తే ఎవరికి మంత్రి పదవులు దక్కుతాయి అని భేరీజు వెసుకుంటున్నారు. ఉగాది నుంచి కొత్త జిల్లాల పాలన నేపథ్యంలో సమీకరణలు మారనున్నాయి. జిల్లాల ప్రతిపాదికగా తీసుకొని మంత్రివర్గ విస్తరణ ఉంటుందన్న ఊహాగానాలు నడుస్తున్నాయి. శ్రీకాకుళం జిల్లాకు సంబంధించి ప్రస్తుతం రెవెన్యూ శాఖతో పాటు ఉప ముఖ్యమంత్రిగా ధర్మాన క్రిష్ణదాస్, పశుసంవర్థక శాఖ మంత్రిగా డాక్టర్ సీదిరి అప్పలరాజు వ్యవహరిస్తున్నారు. శాసన సభాపతిగా తమ్మినేని సీతారాం పదవీ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ప్రస్తుతం శ్రీకాకుళం జిల్లా నుంచి పాలకొండ నియోజకవర్గం వేరపడి కొత్తగా ఎర్పడబోయే మన్యం జిల్లాలో కలుస్తుంది. రాజాం నియోజకవర్గం విజయనగరం జిల్లాలో విలీనం కానుంది.

    CM JAGAN

    ఉప ముఖ్యమంత్రి ధర్మాన క్రిష్ణదాస్, మంత్రి అప్పలరాజు, స్పీకర్ తమ్మినేని సీతారాం శ్రీకాకుళం జిల్లా పరిధిలోనే ఉంటారు. దీంతో జిల్లాలకు పదవుల సర్దుబాటులో భాగంగా ఈ ముగ్గురి పదవుల్లో మార్పులు తప్పలా లేవు. ధర్మాన క్రిష్ణదాస్ ను మార్చితే ఆయన సోదరుడు, సీనియర్ నాయకుడు ధర్మాన ప్రసాదరావుకు చోటు దక్కే అవకాశం ఉంది. మరోవైపు స్పీకర్ తమ్మినేని సీతారాం అమాత్య పదవిని కోరుకుంటున్నారు. ఒక వేళ సీతారాంకు అవకాశమిస్తే స్పీకర్ పదవిలో ధర్మాన ప్రసాదరావును కూర్చోబెడతారన్న వాదనా వినిపిస్తోంది. మరోవైపు మంత్రి అప్పలరాజుకు ఉద్వాసన తప్పదనిభావిస్తున్నారు.

    Also Read: Ram Charan- NTR RRR Movie Review: ఆర్ఆర్ఆర్: ఇది సగటు ప్రేక్షకుడి రివ్యూ

    కొత్తగా ఏర్పడే మన్యం జిల్లాలో విజయనగరం జిల్లా పార్వతీపురం, సాలూరు, కురుపాం నియోజకవర్గాలతో పాటు శ్రీకాకుళం జిల్లాలోని పాలకొండ నియోజకవర్గం చేరనుంది. మన్యం జిల్లాను ప్రాతిపదికగా తీసుకుంటే కురుపాం ఎమ్మెల్యే పాముల పుష్పశ్రీవాణి గిరిజన సంక్షేమ శాఖతో పాటు ఉప ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపడుతున్నారు. ఒకవేళను ఆమె మార్పు అనివార్యమైతే పాలకొండ ఎమ్మెల్యే విశ్వసరాయి కళావతిని కానీ..సాలూరు ఎమ్మెల్యే రాజన్నదొరకు కానీ అవకాశం దక్కనుంది. మరోవైపు విజయనగరం జిల్లాకు చెందిన సీనియర్ నాయకుడు బొత్స సత్యనారాయణ మంత్రివర్గం నుంచి తప్పిస్తే ఆయన సోదరుడు, గజపతినగరం ఎమ్మెల్యే బొత్స అప్పలనరసయ్యకు అవకాశం దక్కనుంది. బొత్స సత్యనారాయణ సేవలను పార్టీకి వినియోగించుకుంటారన్న వాదన వినిపిస్తొంది.

    కానీ బొత్స మాత్రం రాజ్యసభను కోరుతున్నట్టు తెలుస్తోంది. ఒక వేళ సామాజిక సమతుల్యంలో భాగంగా బొత్సకు బదులు శ్రీకాకుళం జిల్లా పాతపట్నం ఎమ్మెల్యే రెడ్డి శాంతికి అవకాశమిస్తారన్న వాదన వినిపిస్తోంది. తూర్పుకాపు కావడంతో అటు బీసీ, ఇటు మహిళకు పదవి ఇచ్చినట్టవుతుందన్నది అధిష్టానం భావనగా చెబుతున్నారు. మరోవైపు విజయనగరం ఎమ్మెల్యే కోలగట్ల వీరభద్రస్వామి కూడా మంత్రి పదవి ఆశిస్తున్నారు. ఈయన వైశ్య సామాజికవర్గానికి చెందిన వారు. మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ ను తప్పిస్తే ఆ కోటాలో కోలగట్లకు పదవిని అప్పగిస్తారన్న ప్రచారం ఉంది. విశాఖ జిల్లాలో ప్రస్తుతం ముత్తంశెట్టి శ్రీనివాస్ కేబినెట్లో ఉన్నారు. ఇక్కడ ఆశావహుల సంఖ్య అధికంగా ఉంది. విశాఖ నుంచి అనకాపల్లి, పాడేరు జిల్లాలు వేరుపడడమే ఇందుకు కారణం. అనకాపల్లి నుంచి స్థానికి ఎమ్మెల్యే గుడివాడ అమరనాథ్ మంత్రి పదవి ఆశిస్తున్నారు. వైసీపీ ఆవిర్భావం నుంచి పార్టీలో కొనసాగుతున్నారు. చోడవరం ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ కూడా పోటీదారుడిగా ఉన్నారు. వీరిద్దరూ కాపు సామాజికవర్గానికి చెందిన వారే కావడం విశేషం. అలాగే పెందుర్తి ఎమ్మెల్యే అదీప్ రాజు, మాడుగుల ఎమ్మెల్యే ముత్యాల నాయుడులు సైతం పదవిపై ఆశలు పెట్టుకున్నారు. వీరిద్దరూ వెలమ సామాజికవర్గానికి చెందిన వారు.

    Y S Jagan

    కొత్తగా ఏర్పడిన పాడేరు జిల్లాలో ఆశావహుల సంఖ్య అధికంగా ఉంది. పాడేరు ఎమ్మెల్యే కొత్తగుల్లు భాగ్యం, అరకు ఎమ్మేల్యే చెట్టి ఫాల్గుణ సైతం మంత్రిని ఆశీస్తున్నారు. వీరిద్దరూ ఎస్టీ సామాజికవర్గానికి చెందిన వారు. కానీ ఇప్పటికే పక్కనే ఉన్న మన్యం జిల్లాకు చెందిన పాముల పుష్పశ్రీవాణి అదే సామాజికవర్గానికి చెందిన వారు కావడం .. పాలకొండ ఎమ్మెల్యే కళావతి, సాలూరు ఎమ్మెల్యే రాజన్నదొర సైతం పోటీలో ఉండడంతో ఎవరికి పదవి వరిస్తుందో చూడాలి. ఇక రాజాం నియోజకవర్గం నుంచి కంబాల జోగులు, పార్వతీపురం నియోజకవర్గం నుంచి అలజంగి జోగారావు, పాయకరావుపేట నుంచి గొల్ల బాబూరావు ఎస్సీ ఎమ్మెల్యేలుగా కొనసాగుతున్నారు. ఎస్సీ కోటాలో మంత్రి పదవిని ఆశిస్తున్నారు. సామాజిక సమతూకంలో భాగంగా అదిష్టానం ఎవరి వైపు మొగ్గు చూపుతుందో చూడాలి మరీ.

    Also Read: Russia Ukraine War: ఉక్రెయిన్ కు మద్దతుగా నాటో.. మూడో ప్రపంచ యుద్ధం మొదలైనట్టేనా?

     

    Tags