spot_img
Homeఆంధ్రప్రదేశ్‌Chandrababu: మంత్రులపై చంద్రబాబు పంచులు మామూలుగా లేవుగా!

Chandrababu: మంత్రులపై చంద్రబాబు పంచులు మామూలుగా లేవుగా!

Chandrababu: చంద్రబాబులో మార్పు స్పష్టంగా కనిపిస్తోంది. జైలుకెళ్లి వచ్చిన తర్వాత చంద్రబాబులో వాడి, వేడి పెరిగింది. ప్రత్యర్థులపై పదునైన విమర్శనాస్త్రాలతో విరుచుకుపడుతున్నారు. మంత్రులపై పంచులతో చెలరేగిపోతున్నారు. అప్ డేటెడ్ పొలిటీషియన్ గా ఎప్పటికప్పుడు ఆయా రాజకీయ పరిస్థితులకు తగ్గట్టు రాజకీయాలు చేయడం చంద్రబాబుకు అలవాటైన విద్య. అవినీతి కేసుల్లో సుదీర్ఘకాలం జైల్లో ఉండేసరికి.. రెట్టించిన ఉత్సాహంతో పని చేయడం ప్రారంభించారు.

రాష్ట్రవ్యాప్తంగా చంద్రబాబు పర్యటనలు జోరుగా సాగుతున్నాయి. ఏడుపదుల వయసులో కూడా ఉత్సాహంగా పనిచేస్తున్నారు. రాజకీయ యాత్రలు మొదలుపెట్టారు.’రా కదలి రా’ భారీ బహిరంగ సభలకు శ్రీకారం చుట్టారు. ప్రజలకు ఎడ్యుకేట్ చేస్తున్నారు. మంత్రులపై ఓ రేంజ్ లో సెటైర్లు పేల్చుతున్నారు.ఆచంట లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో అయితే చంద్రబాబు మంత్రులపై వేసిన పంచులు ఆకట్టుకున్నాయి. “డయా ఫ్రమ్ వాల్ అంటే తెలియని వ్యక్తి ఇరిగేషన్ మంత్రి. ధాన్యానికి సంచులు అందించలేని వ్యక్తి పౌరసరఫరాల శాఖ మంత్రి. పెట్టుబడులంటే కోడిగుడ్డు అనే వ్యక్తి ఐటి మంత్రి. కోర్టు ఫైళ్లు లేపేసేవాడు వ్యవసాయ మంత్రి” అంటూ చంద్రబాబు మాట్లాడే సరికి టిడిపి శ్రేణులు హర్షధ్వనాలు వ్యక్తం చేశాయి.

ఎక్కడా మంత్రుల పేర్లు చెప్పకుండానే చంద్రబాబు విమర్శనాస్త్రాలు సంధించడం విశేషం. గనులు మింగేసేవాడు గనుల శాఖ మంత్రి, క్లబ్బుల్లో డాన్సులు వేసుకునే వ్యక్తి మహిళా సంక్షేమ మంత్రి అంటూ చంద్రబాబు ఘాటు వ్యాఖ్యలు చేశారు. ప్రధానంగా మంత్రి రోజా తీరుపై వీరుచుకుపడ్డారు. ఏ ఒక్కరి పేరు చెప్పకుండా ప్రజలకు అర్థమయ్యేలా బాబు చేసిన ప్రసంగాన్ని చూసి టిడిపి అభిమానులు ఫిదా అయ్యారు. చంద్రబాబుతో రాజకీయం ఇలానే ఉంటుందని.. అదును చూసి దెబ్బ కొట్టడం ఆయన స్టైల్ అని టిడిపి అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. ఇక్కడ నుంచి చంద్రబాబు రాజకీయం ఇలానే కొనసాగుతుందని కూడా చెప్పుకొస్తున్నారు.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.

Related News

Most Popular

Varanasi Movie

Varanasi Movie: వారణాసి అన్ని వేల కోట్లు కలెక్ట్ చేస్తుందా…

Varanasi Movie: రాజమౌళి దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా తెరకెక్కుతున్న 'వారణాసి' సినిమా మీద ప్రేక్షకుల్లో విశేషమైన అంచనాలు ఉన్నాయి. ప్రపంచ స్థాయిలో ఈ సినిమా ఒక పెను సంచలనాన్ని క్రియేట్ చేయబోతుందనే...
Tammineni Family

Tammineni Family: ఒడిస్సాలో చిక్కిన తమ్మినేని ఫ్యామిలీ?!

Tammineni Family: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం కుటుంబంతో సహా పరారీలో ఉన్నారు. తప్పుడు ధ్రువీకరణ పత్రాలతో నాలుగు కోట్ల భూమిని అక్రమంగా కొల్లగొట్టారు అని...
YSRCP

YSRCP: వైసీపీకి ఆ జిల్లాలో భారీ డ్యామేజ్!

YSRCP: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ చిక్కుల్లో పడింది. ఆ పార్టీ నేతలపై వరుసగా కేసులు నమోదవుతున్నాయి. అరెస్టుల పర్వం నడుస్తోంది. ఇప్పటివరకు పాత కేసుల్లో నేతలు అరెస్ట్ అవుతూ వచ్చారు. కానీ ఇప్పుడు...
Operation Prahaar

Operation Prahaar: ఆపరేషన్ ‘ప్రహార్’.. ఉగ్రవాద అంతంపై మోడీ-షా ల అద్భుత వ్యూహమిదీ

Operation Prahaar: భారతదేశంలో ఉగ్రవాదం ఎప్పుడూ కొత్త సవాలు కాదు. కశ్మీర్‌లో దశాబ్దాలుగా సరిహద్దు ఆవలి నుంచి ప్రోత్సాహం పొందుతున్న ఉగ్రవాదం, పంజాబ్‌లో ఖలిస్తానీ కార్యకలాపాలు, దండకారణ్యంలో నక్సలిజం ఇవన్నీ దేశ భద్రతకు...
Chennai Love Story

Chennai Love Story: ‘చెన్నై లవ్ స్టోరీ’ సినిమాను ఆ మూవీ నుంచి కాపీ చేశారా…ఈ సినిమాలో అసలు...

Chennai Love Story: తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇప్పటివరకు కనివిని ఎరుగని రీతిలో ఎన్నో ప్రేమ కథ చిత్రాలు వచ్చాయి. ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తూ సూపర్ సక్సెస్ గా నిలిచాయి. ఇక ఇలాంటి...
Oktelugu Epaper