ప్రస్తుతం చంద్రబాబు నాయుడు గురించి మాట్లాడుకోవాల్సి వస్తే 2019 ఎన్నికలకు ముందు 2019 ఎన్నికలకు తరువాత అని మాట్లాడుకోవాల్సి వస్తోంది. తెలంగాణలో ఇప్పటికే తెలుగుదేశం పార్టీ కథ ముగిసిపోగా ఏపీలో కూడా చంద్రబాబు నాయుడు ఒంటరి అవుతున్నాడా…? అనే ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి. 2019 ఎన్నికల్లో ఒంటరిగా బరిలోకి దిగిన టీడీపీ కేవలం 23 స్థానాలతో సరిపెట్టుకుంది.
Also Read : ఒకరి తర్వాత ఒకరు భలే తగులుకున్నారు… ఆర్కే కి ఊపిరి ఆడుతోందా?
అయితే రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ గత ఎన్నికలలో చూపినంత ప్రభావం కూడా చూపదని చెబుతున్నాయి. బాబు పొత్తు పెట్టుకోవాలని ప్రయత్నిస్తున్నా వామపక్షాలు మాత్రమే బాబుతో పొత్తుకు మొగ్గు చూపుతున్నాయి. అయితే ఏపీలో వామపక్షాలతో కలిసి పోటీ చేసినా పెద్దగా ప్రయోజనం ఉండదు. బీజేపీతో పొత్తు పెట్టుకోవాలని టీడీపీ భావిస్తున్నా సోము వీర్రాజు చంద్రబాబుపై విమర్శలు చేస్తున్న నేపథ్యంలో అది జరిగే పని కాదు.
రాష్ట్ర బీజేపీ నేతలు భవిష్యత్తుల్లో టీడీపీ కలిసి పని చేయాలని అనుకోవడం లేదు. ఇప్పటికే బీజేపీ కీలక నేతలంతా చంద్రబాబుపై ఘాటుగా విమర్శలు చేస్తున్నారు. చంద్రబాబు లేదా టీడీపీ నేతలు బీజేపీపై విమర్శలు చేస్తే మాత్రం బీజేపీ టీడీపీకి మధ్య శత్రుత్వం మరింత పెరిగే అవకాశం ఉంటుంది. బీజేపీ అద్యక్ష స్థానంలో మార్పు వచ్చిన నెల రోజుల్లోనే మారుతున్న పరిస్థితులు ఏపీలో చంద్రబాబు ఒంటరి అనే విషయాన్ని గుర్తు చేస్తున్నాయి.
Also Read : ట్రెండ్ సెట్.. వాట్సాప్ గ్రూప్ లో లడ్డూ వేలం..!