https://oktelugu.com/

సీక్రెట్: ‘హన్సిక బ్యాగ్’లో ఏముందో మీకు తెలుసా?

హీరోయిన్లకు సంబంధించిన ప్రతి విషయం అభిమానులకు ఆసక్తికరమే. హీరోయిన్ల హ్యాండ్ బ్యాగ్ లో ఉండే వస్తువుల గురించి తెలుసుకోవాలనే ఆసక్తి అభిమానుల్లో ఉంటుంది. ఇప్పటికే కొంతమంది హీరోయిన్లు తమ హ్యాండ్ బ్యాగ్ లలో దాచుకునే వస్తువుల గురించి అభిమానులతో షేర్ చేసుకున్నారు. తాజాగా హన్సిక కూడా అభిమానులతో ఈ వివరాలను పంచుకుంది. తన హ్యాండ్ బ్యాగ్ లో ఎప్పుడూ ఒకే తరహా వస్తువులు ఉంటాయని అయితే హ్యాండ్ బ్యాగ్ మాత్రం ఎప్పటికప్పుడు మారుస్తూ ఉంటానని హన్సిక చెప్పింది. […]

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : August 25, 2020 / 03:00 PM IST
    Follow us on

    హీరోయిన్లకు సంబంధించిన ప్రతి విషయం అభిమానులకు ఆసక్తికరమే. హీరోయిన్ల హ్యాండ్ బ్యాగ్ లో ఉండే వస్తువుల గురించి తెలుసుకోవాలనే ఆసక్తి అభిమానుల్లో ఉంటుంది. ఇప్పటికే కొంతమంది హీరోయిన్లు తమ హ్యాండ్ బ్యాగ్ లలో దాచుకునే వస్తువుల గురించి అభిమానులతో షేర్ చేసుకున్నారు. తాజాగా హన్సిక కూడా అభిమానులతో ఈ వివరాలను పంచుకుంది. తన హ్యాండ్ బ్యాగ్ లో ఎప్పుడూ ఒకే తరహా వస్తువులు ఉంటాయని అయితే హ్యాండ్ బ్యాగ్ మాత్రం ఎప్పటికప్పుడు మారుస్తూ ఉంటానని హన్సిక చెప్పింది.

    Also Read : నిర్మాణంలో చరణ్ కి కొత్త భాగస్వామ్యం !

    తాను ప్రతి సోమవారం హ్యాండ్ బ్యాగ్ మారుస్తానని… తన దగ్గర చాలా హ్యాండ్ బ్యాగ్స్ ఉన్నాయని… వాటికి ప్రపంచాన్ని చూసే అవకాశాన్ని తాను కల్పిస్తానని అన్నారు. అందరూ పెంచుకునే పిల్లులు, కుక్కలకు ముద్దు పేర్లు పెట్టుకుంటూ ఉంటారని తాను మాత్రం తనకు ఎంతో ఇష్టమైన హ్యాండ్ బ్యాగ్స్ కు ముద్దు పేర్లు పెట్టుకుంటానని హన్సిక చెబుతున్నారు. ముద్దుపేర్లతో హ్యాండ్ బ్యాగ్స్ ను పిలవడం తనకు ఎంతో ఇష్టమని చెప్పారు.

    తన హ్యాండ్ బ్యాగ్ లో ఏఏ వస్తువులు ఉంటాయో ఆ విషయాలను కూడా హన్సిక వెల్లడించారు. బ్యాగులో మాస్కులు, శానిటైజర్ తప్పక పెట్టుకుంటానని ఆమె చెప్పారు. ప్రస్తుతం తన హ్యాండ్ బ్యాగ్ లో మాస్కులు, శానిటైజర్ ఉంటున్నాయని 5 రకాల పెర్ఫ్యూమ్స్, మినీ మేకప్ కిట్, పర్స్ హ్యాండ్ బ్యాగ్ లో ఉంటాయని… మరో రకంగా చెప్పాలంటే తన హ్యాండ్ బ్యాగ్ లో ఉంటుందని… అయితే ఆహార పదార్థాలను మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ హ్యాండ్ బ్యాగ్ లో పెట్టనని హన్సిక చెబుతున్నారు.

    Also Read : ‘ఆచార్య’ మోషన్ పోస్టర్ పై వివాదం