ఇప్పటికే ఎంతో మంది హీరోలను టాలీవుడ్‌కు అందించిన మెగా కాంపౌండ్ నుంచి ఇండస్ట్రీకి పరిచయం అవుతున్న తాజా వ్యక్తి పంజా వైష్ణవ్ తేజ్. ఇతను చిరంజీవి మేనల్లుడు. సాయి ధరమ్ తేజ్‌కు తమ్ముడు. అతను హీరోగా నటించిన తొలి చిత్రం ‘ఉప్పెన’. వైష్ణవ్ సరసన హీరోయిన్‌గా కృతి శెట్టి నటించింది. కన్నడ అగ్ర నటుడు విజయ్ సేతుపతి కీలక పాత్ర పోషించాడు. బుచ్చిబాబు సాన దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని సుకుమార్ రైటింగ్స్, మైత్రీ మూవీ మేకర్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మించాయి. దేవీశ్రీప్రసాద్ సంగీతం అందించిన ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకొని ఫస్ట్ కాపీతో విడుదలకు సిద్దంగా ఉంది. మెగా కాంపౌండ్ హీరో, సుకుమార్ కథ అందించడంతో ఈ మూవీపై ఇప్పటికే ఆసక్తి పెరిగింది. పైగా, ఈ చిత్రం ఫస్ట్ లిరికల్ వీడియో సాంగ్ ‘నీకల్లు నీలి సముద్రం’ యూ ట్యూబ్‌లో హల్‌చల్ చేస్తోంది.
Also Read: ‘ఆచార్య’ మోషన్ పోస్టర్ పై వివాదం
పలు పెద్ద చిత్రాలు ఇప్పుడు ఓటీటీ బాట పడుతుండడంతో ఈ చిత్రం కూడా డిజిటల్ రిలీజ్ అవుతుందని ఆ మధ్య వార్తలు వచ్చాయి. కానీ, ఓటీటీలో విడుదలకు హీరో వైష్ణవ్‌తో పాటు చిత్రబృందం ఆసక్తి కనబరచడం లేదు. ఈ చిత్రాన్ని దాదాపు 22 కోట్ల భారీ బడ్జెట్‌తో నిర్మించారు. ఈ మధ్య భారీ డీల్‌ను చిత్ర బృందం తిరస్కరించింది. ఓ ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ ఉప్పెన డిజిటల్ రిలీజ్ రైట్స్ కోసం రూ. 13 కోట్లు ఆఫర్ చేసినట్టు సమాచారం. కానీ, వైష్ణవ్, నిర్మాతలు ఆ ఆఫర్ను రిజెక్ట్ చేశారట. ఈ సినిమాను థియేటర్లలోనే రిలీజ్ చేయాలని భావిస్తున్నారట. చిన్న సినిమాకు 13 కోట్ల ఆఫర్ పెద్దదే అయినప్పటికీ నేరుగా రిలీజ్ చేస్తే పెద్ద మొత్తం వస్తుందని నిర్మాతలు ఆశిస్తున్నారు. అలాగే, మెగా కాంపౌండ్ నుంచి అరంగేట్రం చేస్తున్న హీరో వైష్ణవ్‌కు తగిన గుర్తింపు రావాలంటే థియేటర్ రిలీజ్ ఒక్కటే మార్గం అని డిసైడయ్యారట. షూటింగ్‌కు అనుమతులు వచ్చిన నేపథ్యంలో ఇంకొంత కాలం వేచి చూస్తే సినిమా హాళ్లు కూడా తెరుచుకుంటాయని భావిస్తున్నారు. దాంతో ఇంకో రెండు, మూడు నెలలైనా వేచి చూసేందుకు రెడీగా ఉన్నారని టాలీవుడ్ వర్గాల సమాచారం. కాగా, వైష్ణవ్ ఇప్పటికే తన రెండో సినిమాతో బిజీ అయ్యాడు. స్టార్ డైరెక్టర్ క్రిష్ తీస్తున్న ఈ చిత్రం ఈ మధ్యే మొదలైంది. వైష్ణవ్ సరసన రకుల్ ప్రీత్ హీరోయిన్‌గా నటిస్తోంది.