Chandrababu Naidu Jr NTR: ఏపీ ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు ఏడుపు ఎపిసోడ్… వైసీపీ వర్సెస్ టీడీపీగా మొదలై, జూనియర్ ఎన్టీఆర్ వర్సెస్ లోకేష్ అన్నట్లుగా మారింది. టీడీపీ పార్టీలోని ఎన్టీఆర్, లోకేష్ అభిమానుల మధ్య సోషల్ మీడియా వార్ నడుస్తోంది. టీడీపీ సీనియర్ నేత వర్ల రామయ్య జూనియర్ ఎన్టీఆర్ పై చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. సొంత మేనత్త భువనేశ్వరి క్యారెక్టర్ పై కొడాలి నాని, వల్లభనేని వంశీ అనుచిత వ్యాఖ్యలు చేస్తే స్పందించే తీరు ఇదేనా అంటూ ఆయన ప్రశ్నించారు. మేనత్తకు అవమానం జరిగితే, కారణం అయిన వాళ్లపైకి కత్తి ఎత్తుకొని పోవాల్సింది పోయింది, ప్రవచనాలు పలుకుతావా..? కుటుంబం కంటే నీకు సినిమాలు ఎక్కువా? కష్టాల్లో ఉన్నప్పుడు పార్టీ కోసం పోరాడిన వారికి, కష్టపడిన వారికి ప్రాధాన్యం ఉంటుంది.
నా పనులన్నీ చూసుకొని, తీరిక దొరికినప్పుడు వస్తాను, పార్టీ నాకు కావాలి అంటే కుదరదు అంటూ.. ఎన్టీఆర్ పై దారుణమైన వ్యాఖ్యలు చేశారు. వల్లభనేని వంశీ, కొడాలి నానిపై నువ్వు సాఫ్ట్ గా స్పందించావు అంటే.. దీనిలో నీ హస్తం ఏదైనా ఉందా? అన్నట్లు వర్ల రామయ్య స్పీచ్ సాగింది. రామయ్య కామెంట్స్ ఎన్టీఆర్ డై హార్డ్ ఫ్యాన్స్ కోపానికి కారణం అయ్యాయి. వర్ల రామయ్య చేత చంద్రబాబే ఈ కామెంట్స్ చేయించారని వారు గట్టిగా నమ్ముతున్నారు. పార్టీ అధినాయకత్వం విషయంలో లోకేష్ కి పోటీ వస్తున్న జూనియర్ ఎన్టీఆర్ ని టీడీపీ వర్గాల్లో చులకన చేయడానికి, ఆయన క్రెడిబిలిటీ దెబ్బ తీయడానికి, బాబు ఈ సందర్భం వాడుకుంటున్నారని ఎన్టీఆర్ ఫ్యాన్స్ అభిప్రాయం.
వర్ల రామయ్య ఆరోపణలను సీరియస్ గా తీసుకున్న ఎన్టీఆర్ ఫ్యాన్స్ తమ నిరసన గళం విప్పారు. సోషల్ మీడియా వేదికగా .. చంద్రబాబు, నారా లోకేష్ లను టార్గెట్ చేశారు. #CBNShouldApologizeJrNTR అనే ట్యాగ్ లైన్ ట్విట్టర్ లో నేషనల్ వైడ్ ట్రెండ్ చేస్తున్నారు. దాదాపు 80 వేలకు పైగా ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఈ ట్యాగ్ ఉపయోగిస్తూ ట్వీట్ చేశారు. చంద్రబాబుతో పాటు వర్ల రామయ్య ఎన్టీఆర్ కి క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. దీనిపై చంద్రబాబు స్పందించకపోతే పరిణామాలు చాలా దారుణంగా ఉంటాయని హెచ్చరిస్తున్నారు.
లోకేష్ భవిష్యత్తు కోసం ఎన్టీఆర్ ని అనవసరంగా టార్గెట్ చేస్తారా?, అంటూ వాపోతున్నారు. దీని పర్యవసానం వచ్చే ఎన్నికల్లో మీరు చూస్తారని స్ట్రాంగ్ వార్నింగ్ ఇస్తున్నారు. మరోవైపు టీడీపీ పార్టీలోని చంద్రబాబు, లోకేష్ వర్గం కూడా ఏమీ తగ్గడం లేదు. ఎన్టీఆర్ వచ్చి పీకేది ఏమీ లేదంటూ.. కౌంటర్లు ఇస్తున్నారు. ఇక న్యూట్రల్ గా ఉన్న టీడీపీ కార్యకర్తలు వివాదం పెద్దది చేయకుండా పరిష్కరించుకుందాం, లేకుంటే పార్టీ ప్రయోజనాలు దెబ్బతింటాయని అంటున్నారు.
Also Read: AP Cinema Regulation Amendment Bill: చిత్రపరిశ్రమ బతకాలంటే సినీ పెద్దలు ఏం చేయాలి?