Priyanka-Nick: ఇటీవలే తన సోషల్‌మీడియా ఖాతాలో ప్రియాంక చోప్రా తన పేరు పక్కన తన భర్త నిక్ జోనస్ ఇంటి పేరు తొలగించడం చర్చనీయాంశంగా మారింది. కేవలం ప్రియాంక అనే పేరు మాత్రమే ఉంచి.. చోప్రా, జోనస్ పేర్లను తొలగించింది. ఇది గమనించిన అభిమానులు.. వీరు కూాడా సామ్, చై లాగా త్వరలో విడిపోనున్నారా అని పలు అనుమానాలు వ్యక్తం చేశారు. ఈ క్రమంంలోనే ఈ వార్త నెట్టింట వైరల్‌గా మారింది.

Also Read: ప్రియాంకా చోప్రా విడాకుల వార్తలపై స్పందించిన ఆమె తల్లి…
మరోవైపు, ఇదే స్టైల్లో చై, సామ్ విడిపోవడం.. ఇప్పుడు ప్రియాంక చోప్రా కూడా అలాగే చేయడంతో ఈ రూమర్లకు ఇంకా బలం చేకూరినట్లైంది. కాగా, తాజాగా, ఈ వార్తలపై ప్రియాంక తల్లి మధు చోప్రా స్పందిస్తూ ఖండించింది. ప్రియాంక కూడా ఇందుకు సంబంధించిన ఓ వీడియోను అభిమానులతో పంచుకుంది. దీంతో ఆ వార్తలకు చెక్ పెట్టినట్లు అయ్యింది. కానీ, ఇంకా అక్కడక్కడ ఈ వార్తలు వస్తూనే ఉన్నాయి. ఈ క్రమంలోనే వాటన్నింటికీ చెక్ పెడుతూ.. సోషల్‌మీడియాలో పోస్ట్ చేశారు.
ఇద్దరూ ప్రేమగా ఉన్న ఫొటోను ఇన్స్టాగ్రామ్ వేదికగా పోస్ట్ చేస్తూ.. ఈ రూమర్లకు చరమగీతం పాడారు. దీంతో ఈ కపుల్ అభిమానులు ఊపిరిపీల్చుకున్నారు. వారు విడిపోతున్నారంటూ.. వస్తున్న వార్తలపై నిజం లేదన్నమాట.. అంటూ క్లారిటీ ఇచ్చిన నిక్కు కృతజ్ఞతలు తెలిపారు అభిమానులు. ఎప్పుడూ మీరు హ్యాపీగా ఉండాలి.. క్యూట్ కపుల్ అంటూ నెటిజన్లు కామెంట్స్ చేశారు. నిక్- ప్రియాక 2018 డిసెంబరు 1న వివాహం చేసుకున్నారు. అప్పటి నుంచి ఒకరికొకరు తోడుగా ఉంటూ.. గ్లోబల్ బెస్ట్ కపుల్‌గా పేరు తెచ్చుకున్నారు.
Also Read: త్వరలోనే పెళ్లి పీఠలెక్కనున్న మరో బాలీవుడ్ జంట… ఎవరంటే ?