Guntur DCCB Recruitment 2021: గుంటూరు డిస్ట్రిక్ట్ కో ఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్ లిమిటెడ్ నిరుద్యోగులకు తీపికబురు అందించింది. వేర్వేరు ఉద్యోగ ఖాళీల భర్తీ కొరకు ఈ సంస్థ నుంచి జాబ్ నోటిఫికేషన్ రిలీజైంది. వేర్వేరు విభాగాలలో ఈ ఉద్యోగ ఖాళీల భర్తీ జరగనుందని తెలుస్తోంది. ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 67 ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయనున్నారని సమాచారం. ఈ ఉద్యోగ ఖాళీలలో అసిస్టెంట్/ క్లర్కులు (61), అసిస్టెంట్ మేనేజర్లు (06) ఉన్నాయి.
గ్రాడ్యుయేషన్ ఉత్తీర్ణత పొందిన వాళ్లు స్టాఫ్ అసిస్టెంట్/ క్లర్క్ పోస్టుల కొరకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులని చెప్పవచ్చు. స్థానిక భాషలో ప్రొషిషియన్సీ, ఇంగ్లీష్ లో నైపుణ్యం ఉన్నవాళ్లు ఈ ఉద్యోగ ఖాళీల కొరకు దరఖాస్తు చేసుకోవచ్చు. 18 నుంచి 30 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్నవాళ్లు ఈ ఉద్యోగ ఖాళీలకు అర్హులని చెప్పవచ్చు. కనీసం 60 శాతం మార్కులతో గ్రాడ్యుయేషన్/ కామర్స్ గ్రాడ్యుయేషన్‌లో పాసైన వాళ్లు ఈ ఉద్యోగ ఖాళీలకు అర్హులు.
Also Read: ఉద్యోగుల జీతాలను సంస్థలు రహస్యంగా ఎందుకు ఉంచుతాయి?
ఎకనమిక్స్/ స్టాటిస్టిక్స్/ తత్సమాన సబ్జెక్టుల్లో పీజీ చేసిన వాళ్లు ఈ ఉద్యోగ ఖాళీలకు అర్హులని చెప్పవచ్చు. 2021 సంవత్సరం అక్టోబర్ 1 నాటికి 18 నుంచి 30 సంవత్సరాల లోపు వయస్సు ఉన్నవాళ్లు ఈ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ఆన్‌లైన్ విధానంలో అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగ ఖాళీల కొరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆన్‌లైన్ పరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన ఎంపిక ప్రక్రియ జరగనుంది.
ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన ఆన్ లైన్ పరీక్షను 100 మార్కులకు నిర్వహించడం జరుగుతుంది. ఈ పరీక్ష కాల వ్యవధి 60 నిమిషాలు కాగా ప్రతి తప్పు సమాధానానికి 0.25 చొప్పున కోత విధించడం జరుగుతుంది. 2021 సంవత్సరం డిసెంబర్ 3వ తేదీ ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవడానికి చివరితేదీగా ఉంది. నిరుద్యోగులకు ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా ప్రయోజనం చేకూరనుంది. http://gunturdccb.com/ వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.
Also Read: నిరుద్యోగులకు శుభవార్త.. అగ్రికల్చర్ ఇన్సూరెన్స్ కంపెనీలో 31 ఉద్యోగాలు!