
BRS MLA’s allegations : ఆయన ఓ ఎమ్మెల్యే. వయసు 60 ఏళ్లు. కానీ అతడు తనను తాను నవ మన్మధుడిగా ఊహించుకుంటాడు.. కనిపించిన ఆడవాళ్ళందర్నీ గోకుతూ ఉంటాడు.. వరుసతో ఎటువంటి సంబంధం లేదు. ఆడది అయితే చాలు.. తన నియోజకవర్గంలోని ధర్మసాగర్ మండలం జానకిపురం మహిళా సర్పంచ్ కు వలపు వల విసిరాడు.. బంగారం, డబ్బు ఆఫర్ చేశాడు. దీనికోసం ఓ మహిళా ప్రజా ప్రతినిధిని మధ్యవర్తిగా పంపాడు. ఆమె రంగంలోకి దిగినప్పటికీ సదరు మహిళా సర్పంచ్ లొంగిపోలేదు.. పైగా ఎదురు తిరిగింది. అంతే కాదు మీడియాకు ఎక్కింది.. దీంతో ఆ ఎమ్మెల్యే పరువు పోయింది. ప్రస్తుతం అతడి వ్యవహారం రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.
మహిళలు కనిపిస్తే చాలు
ఆ ఎమ్మెల్యేకు మహిళలు కనిపిస్తే చాలు.. ఆగలేరు అనే ప్రచారం ఉంది. ప్రచారం కాదు.. అనేకసార్లు ఆయన చిలిపి చేష్టలు ఆడియోలు నెట్టింట వైరల్ కూడా అయ్యాయి. పుట్టినరోజు వేడుకల్లోనూ ఇలాంటి ఘటనే జరిగింది. ఆయన పెద్ద పదవిలో ఉన్నప్పుడు సాయుధ బలగాల రక్షణ వలయంలో గంటల తరబడి ఓ ఇంట్లో సేద తీరడంతో ఆ ఊరి వారంతా ఇబ్బంది పడ్డారు. చాటింగ్ లకు కేరాఫ్ గా చెప్పుకునే ఈ ఎమ్మెల్యే.. చేసిన ఓ చాటింగ్ మిస్ ఫైర్ అయి పదవి పోయేందుకు కారణమైంది..
గతంలో ఈ ఎమ్మెల్యేకు అధికార పార్టీ లోని మహిళా ప్రజాప్రతినిధితో సన్నిహిత సంబంధం ఉంది. ఇక ఆ మహిళా ప్రజాప్రతినిధి పేరు, ప్రభుత్వంలోని ఒక కీలక అధిపతి కూతురి పేరు ఒకటే కావడంతో.. గతంలో ఉన్న సంబంధం ఆధారంగా ఆ మహిళ ప్రజా ప్రతినిధి అనుకుని కీలక అధిపతి కూతురికి ఫోన్ చేశాడు. ” నేను మీ జిల్లాకు దగ్గరలో ఉన్నా.. శరీరం నీ సాంగత్యం కోరుతోంది.. రమ్మంటావా? వస్తున్నప్పుడు మల్లెపూలు, నీకు ఇష్టమైన బెల్లం హల్వా తీసుకు రమ్మంటావా” అంటూ తన కోరికను, అంతకుమించిన రసికత్వాన్ని బయటపెట్టాడు.
దీనిని మొత్తం రికార్డు చేసిన సదరు కీలక నేత కూతురు ఎక్కడ బయట పెట్టాలో అక్కడ బయటపెట్టింది. దీంతో ఆ ఎమ్మెల్యే మంత్రి పదవి ఊడిపోయింది.. ఇలా చెప్పుకుంటూ పోతే ఆ రసిక ఎమ్మెల్యే కామ చరిత్ర ఒక పట్టాన ముగియదు.. నాడు ఈటల రాజేందర్ మీద అంతెత్తున ఎగిరిపడ్డ సీఎం కేసీఆర్.. ఇలాంటి రసిక ఎమ్మెల్యేల మీద ఎందుకు చర్యలు తీసుకోరో అర్థం కాదు