Telangana politics: భారత రాష్ట్ర సమితికి కంచుకోట లాగా ఉన్న ఈ జిల్లాలోని ఓ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ ఓడిపోయింది.. ఇక్కడ భారత రాష్ట్రపతి అభ్యర్థి 10,000 ఓట్ల మెజారిటీతో గెలిచారు.. ఇంకో మూడు స్థానాల్లో భారత రాష్ట్ర సమితి గెలిచింది.. ఇక్కడ బీఆర్ ఎస్ నుంచి ఎమ్మెల్యే గా గెలిచినప్పటికీ.. కేడర్ కోరుకున్న పనులు ఆయన ఒక్కటి కూడా చేయలేకపోతున్నారు. దీంతో వారికి దిక్కుతోచని పరిస్థితి నెలకొంది.. ఇక ఇదే సమయంలో ఈ నియోజకవర్గ ప్రజలకు మాజీ ఎమ్మెల్యేనే పెద్దదిక్కు అయి పోయారు.. ఎమ్మెల్యేతో పనులు కాకపోవడంతో చాలామంది హైదరాబాద్ వెళ్ళిపోతున్నారు. చివరికి భారత రాష్ట్ర సమితి నాయకులు కూడా మాజీ ఎమ్మెల్యే ను కలుస్తున్నారు. అయితే ఆ మాజీ ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీలో రాష్ట్ర స్థాయిలో కీలక నాయకుడు కావడంతో.. ప్రజల సమస్యలను పరిష్కరించే బాధ్యతను ఆతన తన సతీమణికి అప్పగించారట. తన భర్త మీద ఉన్న అపవాదును ఆమె తొలగించే ప్రయత్నం చేస్తున్నారట.
ప్రస్తుత ఆ మాజీ ఎమ్మెల్యే గతంలో ఆ నియోజకవర్గంలో మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. 2018లో విజయం సాధించినప్పటికీ.. అప్పుడు అధికారంలో భారత రాష్ట్ర సమితి ఉంది. అధికారం లేకపోవడంతో ఆ మాజీ ఎమ్మెల్యే నాడు ప్రజల సమస్యలను పరిష్కరించలేకపోయారు. అయితే అనేక సందర్భాల్లో మంత్రుల వద్దకు వెళ్లి వాటిని పరిష్కరించడానికి ఎంతో కొంత చొరవ చూపించారు. అయితే మొన్నటి ఎన్నికల్లో మాత్రం ఆయన ఓడిపోయారు. రాష్ట్ర వ్యాప్తంగా భారత రాష్ట్ర సమితికి వ్యతిరేకంగా గాలివీచినప్పటికీ.. ఇక్కడ మాత్రం భారత రాష్ట్ర సమితి అభ్యర్థి ఎమ్మెల్యేగా గెలిచారు.. మాజీ ఎమ్మెల్యే మాత్రం ప్రజల సమస్యల పరిష్కారంలో ముందున్నారు..
మరోవైపు భారత రాష్ట్ర సమితి నుంచి గెలిచిన ఎమ్మెల్యే చుట్టపు చూపుగా నియోజకవర్గానికి వస్తున్నారు. ప్రజా సమస్యలను పరిష్కరించాలని ఎవరైనా ఆయన వద్దకు వస్తే.. ప్రభుత్వం మనది కాదు కాబట్టి.. ఏం చేయలేకపోతున్నామని చెబుతున్నారట. దీంతో గులాబీ క్యాడర్ కూడా ఆలోచనలో పడి.. కాంగ్రెస్ పార్టీ వైపు చూస్తోందట. పనులు కావాలంటే కచ్చితంగా అధికార పార్టీలో ఉండాలనే భావనకు కేడర్ మొత్తం వచ్చేసిందట.. గత భారత రాష్ట్ర సమితి హయాంలో పనులు చేసిన సర్పంచ్ లు, ఎంపీటీసీలు, జెడ్పిటిసిలు బిల్లుల కోసం కాంగ్రెస్ పార్టీలో కి వెళ్లాలని నిర్ణయించుకున్నారట. ఇక అధికారం లేకపోవడంతో ప్రస్తుత ఎమ్మెల్యే పనులు చేయలేకపోతున్నారట. దీంతో అనుచర గణం మొత్తం నిరాశలో ఉన్నారట. పార్టీలో ఉన్నవారు తమ ఆగ్రహాన్ని ఏదో ఒక రూపంలో వ్యక్తం చేస్తున్నారట. పదేళ్లు అధికారంలో ఉన్నప్పుడు నిబంధనల పేరు చెప్పేవారట.. ఓ మంత్రి తో మాట్లాడదామని అనేవారట ప్రస్తుత ఎమ్మెల్యే( గతంలో ఎమ్మల్యే గా పోటీ చేసి ఓడిపోయారు). అప్పుడు అధికార పార్టీలో ఉన్నప్పుడే ఏమీ చేయలేదు.. ఇప్పుడు మాత్రం ఏం చేస్తాడని కిందిస్థాయి క్యాడర్ చెవులు కోరుకుంటున్నారట. ఏదేమైనా గెలిపించిన ఎమ్మెల్యే మొక్కుబడిగా మారడాన్ని క్యాడర్ జీర్ణించుకోలేకపోతుందట.