Maganti Fake Death News : ఇప్పుడు ఇదే దుస్థితి భారత రాష్ట్ర సమితి ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ కుటుంబ సభ్యులకు ఎదురయింది. మాగంటి గోపీనాథ్ ప్రస్తుతం జూబ్లీహిల్స్ ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు.. 2014 నుంచి ఆ నియోజకవర్గంలో ఆయన ఎమ్మెల్యేగా గెలుచుకుంటూ వస్తున్నారు. 2023లో జరిగిన ఎన్నికల్లోనూ ఆయన విజయం సాధించి హట్రిక్ ఎమ్మెల్యేగా రికార్డు సృష్టించారు. ప్రస్తుతం ఆయన భారత రాష్ట్ర సమితి హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు.. గురువారం అనారోగ్యానికి గురి కావడంతో కుటుంబ సభ్యులు ఆయనను గచ్చిబౌలిలోని ఏఐజి ఆసుపత్రికి తరలించారు. ఇష్టం ఆయన అత్యవసర వైద్య విభాగం లో చికిత్స పొందుతున్నారు. వాస్తవానికి ఆయన పరిస్థితి విషమంగానే ఉంది.. ఆయన ఆరోగ్య పరిస్థితిని భారత రాష్ట్ర సమితి అగ్ర నాయకులలో ఒకరైన హరీష్ రావు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. కుటుంబ సభ్యులతో మాట్లాడుతున్నారు. ఏఐజి ఆసుపత్రి వైద్యులతో సంప్రదింపులు జరుపుతున్నారు. వాస్తవ పరిస్థితి ఇలా ఉంటే.. కొంతమంది, కొన్ని మీడియా సంస్థలు అత్యుత్సాహాన్ని ప్రదర్శించి.. మాగంటి గోపీనాథ్ కన్నుమూశారని నిరాధారమైన వార్తలను ప్రచారం చేస్తున్నారు..
Also Read : 40 యాక్సిడెంట్లకు కారణమైన అనుష్క పోస్టర్..సంచలన నిజాలు బయటపెట్టిన పోలీసులు!
నేటి స్పీడ్ కాలంలో బ్రేకింగ్ న్యూస్ కు ప్రాధాన్యం ఉంటుంది. దీనిని కాదనడానికి కూడా లేదు. కానీ ఆ బ్రేకింగ్ న్యూస్ వేసే సమయంలో.. అది నిజమో కాదో నిర్ధారించుకోవాల్సిన బాధ్యత మీడియా ప్రతినిధులపై ఉంటుంది. మీడియా సంస్థలపై కూడా ఉంటుంది. ఆ మాత్రం ఈ ఇంగితం లేకుండా, వాస్తవాలను రూడీ చేసుకోకుండా బతికి ఉన్న మనిషిని చనిపోయాడు అని చెప్పడం అత్యంత దారుణం. అసలే గోపీనాథ్ ఆరోగ్యం బాగోలేక కుటుంబ సభ్యులు ఆసుపత్రిలో నరకం చూస్తున్నారు. అత్యవసర వైద్య విభాగంలో ఆయన పడుతున్న బాధను చూసి కన్నీటి పర్యంతమవుతున్నారు. ఇలాంటి దుఃఖ సమయంలో ఆయన చనిపోయాడుల్ని వార్తలు ప్రచారం చేస్తున్న మీడియా సంస్థలు గోపీనాథ్ కుటుంబ సభ్యులను మరింత క్షోభకు గురిచేస్తున్నాయి. ” మాగంటి గోపీనాథ్ అత్యవసర వైద్య విభాగంలో చికిత్స పొందుతున్నారు. ఆయన ఆరోగ్యం గురించి ఎప్పటికప్పుడు వాకబు చేస్తూనే ఉన్నాం. ఏఐజి ఆసుపత్రి వైద్యులతో సంప్రదింపులు జరుపుతూనే ఉన్నాం. వారి కుటుంబ సభ్యులతో మాట్లాడుతూనే ఉన్నాం.. ఆయన ఆరోగ్యంవిషమంగానే ఉన్నప్పటికీ.. ఆయన చికిత్సకి స్పందిస్తున్నారని వైద్యులు అంటున్నారు. ఇలాంటి సమయంలో ఆయన చనిపోయారని కొన్ని మీడియా సంస్థలు నిరాధారమైన వార్తలను ప్రసారం చేయడం అత్యంత దారుణమని” ఆర్థిక శాఖ మాజీ మంత్రి హరీష్ రావు వ్యక్తిగత కార్యదర్శి మీడియాకు ఓ ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు.. మీడియా ప్రతినిధులు బ్రేకింగ్ న్యూస్ వేసే సమయంలో కాస్త వెనుక ముందు ఆలోచించుకోవాలని.. వాస్తవాలు తెలుసుకొని బ్రేకింగ్ న్యూస్ వెయ్యాలని గులాబీ పార్టీ నాయకులు సూచిస్తున్నారు.