
Naresh – Pavitra Lokesh Marriage: కొన్ని ప్రేమ జంటలను చూస్తే ఇదెక్కడి ఖర్మ రా బాబు, మీడియా ఉండడం ఉండడం వాళ్ళ ఏవేవో చూడాల్సి వస్తుంది అని అనిపిస్తుంటాయి.అలాంటి ప్రేమ జంట లో ఒకటి నరేష్ – పవిత్ర జంట.ముదురు వయస్సులో ప్రేమలో పడ్డ ఈ జంట, నేడు పెళ్లి ద్వారా ఒకటయ్యారు.లోకులు ఏమి అనుకుంటే మాకు ఎందుకు, మా ఇష్టం వచ్చినట్టు మేము ఉంటాము అనేలా ప్రవర్తించిన వీళ్లిద్దరికీ సోషల్ మీడియా లో ఒక్కరి సపోర్టు కూడా దక్కడంలేదు,అందరూ విమర్శించే వాళ్ళే.
ఎందుకంటే ఇది నరేష్ కి నాల్గవ పెళ్లి, పవిత్ర కి రెండవ పెళ్లి.మూడవ భార్య రమ్య పై ఆయన వేసిన నిందలు,ఆమె తో విడాకుల కోసం ఆయన వేసిన నాటకాలు చూసి సభ్య సమాజం చీదరించుకుంది.ఆమె అలుపెరగని పోరాటం చేసి చివరికి ఓడిపోయింది.ఆమెకి నరేష్ భరణం ఇచ్చాడో లేదో ఎవరికీ తెలియదు, ఆమెతో నాలుగేళ్లు కాపురం చేసి ఒక బిడ్డకి కూడా జన్మనిచ్చాడు.
ఇది ఇలా ఉండగా వీళ్ళ లవ్ స్టోరీ ఎలా మొదలైందో ఒకసారి చూద్దాము.అందరి లాగానే వీళ్ళ ప్రేమ కూడా ఒకే చోట కలిసి పనిచెయ్యడం వల్ల ఏర్పడింది.అయితే వీళ్లిద్దరి ప్రేమ నరేష్ రమ్య తో వైవాహిక బంధం లో ఉన్నపుడే మొదలైందా, లేదా రమ్య తో విడాకులు అయిపోయిన తర్వాత మొదలయిందా అనేది కాసేపు పక్కన పెడితే , 2017 వ సంవత్సరం నుండే వీళ్లిద్దరు డేటింగ్ లో ఉండడం ప్రారంభించారు.అప్పటి నుండే వీళ్లిద్దరు ఎక్కడికి వెళ్లినా కలిసే వెళ్లేవారు, కలిసే కనిపించేవారు.వీళ్లిద్దరి సహా జీవనం కి కృష్ణ అనుమతి కూడా ఉంది.

అంటే రమ్య తో విబేధాలు వచ్చి విడిపోయిన తర్వాతే వీళ్లిద్దరు ఒక్కటయ్యారని అర్థం అవుతుంది.మరి ఈరోజు విడుదలైన వీళ్లిద్దరి పెళ్లి వీడియో పై సోషల్ మీడియా లో నెటిజెన్స్ నుండి విమర్శల వర్షం కురుస్తుంది.నరేష్ కి సాయి ధరమ్ తేజ్ వయస్సు ఉన్న కొడుకు ఉన్నాడు, అతనికి పెళ్లి చెయ్యకుండా 60 ఏళ్ళ వయస్సులో పెళ్లి చేసుకొని సమాజానికి ఏమి సందేశం ఇస్తున్నట్టు అనేది ఆయనకే తెలియాలి.
https://twitter.com/ItsActorNaresh/status/1634070240366850049?s=20