కొత్తగా పెళ్లి చేసుకున్న నవదంపతులలో వరుడికి కరోనా పాజిటివ్ రావటంతో వధువును క్వారంటైన్ కు తరలించారు. అంతే కాకుండా పెళ్ళికి ఊరివారంతా హాజరు కావటంతో ఆ ఊరుని కంటైన్మెంట్ జోన్ గా మార్చారు. ఈ ఘటన కర్నూలు జిల్లాలో చోటుచేసుకుంది.
పూర్తి వివరాల్లోకి వెళితే.. కర్నూలు జిల్లా పత్తికొండ మండలం మర్రిమానుతండాకు చెందిన ఓ యువకుడు హైదరాబాద్ లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో విధులు నిర్వర్తిస్తున్నాడు. అతడికి ఈ నెల 10వ తేదీన అతడి పెళ్లి ఉండటంతో ఊరికి వచ్చాడు. అయితే యువకుడు వచ్చే ముందే అతడి సాంపుల్స్ ను ఇచ్చి వచ్చాడు. కాగా పెళ్లి అనంతరం రిసెప్షన్ రోజున అతడు అస్వస్థకు గురయ్యాడు. అతడి నమూనాలకు సంబందించి రిపోర్ట్స్ రాగా అతడికి కరోనా పాజిటివ్ ఉన్నట్టు తేలింది. దాంతో వరుడిని ఆస్పత్రికి తరలించారు. పెళ్లి చేసుకున్న వధువును క్వారంటైన్ కు తరలించారు.
ఇక ఆ పెళ్లివేడుక కు హాజరైన 70 కుటుంబాల నుండి నమూనాలను సేకరించారు. వరుడికి కరోనా రావటం తో పెళ్ళికి హాజరైన బంధువులంతా భయపడుతున్నారు. ఇక ఆ వేడుకకు గ్రామస్థులు కూడా వెళ్లటంతో గ్రామాన్ని కంటైన్మెంట్ జోన్ గా గుర్తించారు.