https://oktelugu.com/

పక్క రాష్ట్రంతో జాగ్రత్త:కేసీఆర్

ఆంధ్రప్రదేశ్ లోని కర్నూలు, గుంటూరు జిల్లాల్లో కరోనా వ్యాప్తి ఎక్కువగా ఉన్నందున సీఎం కేసీఆర్ అధికారులకు పలు సూచనలు చేశారు. కర్నూలు సరిహద్దులో గల గ్రామాల్లో అదేవిధంగా గుంటూరు జిల్లా సరిహద్దు గ్రామాల్లో అధికారులు అప్రమత్తంగా ఉండాలన్నారు. ఈ రెండు సరిహద్దు ప్రాంతాల్లో ప్రత్యేక అధికారులను నియమించి నియంత్రణ చర్యలు చేపట్టాలన్నారు. అటువారెవరూ ఇటు రాకుండా, ఇటువారెవరూ అటు పోకుండా చూడాలన్నారు. వైరస్‌ మన దగ్గర పుట్టింది కాదని, ఇతర ప్రాంతాల నుంచి వ్యాప్తి చెందిందన్నారు. ప్రజల […]

Written By:
  • Neelambaram
  • , Updated On : May 6, 2020 / 07:27 PM IST
    Follow us on

    ఆంధ్రప్రదేశ్ లోని కర్నూలు, గుంటూరు జిల్లాల్లో కరోనా వ్యాప్తి ఎక్కువగా ఉన్నందున సీఎం కేసీఆర్ అధికారులకు పలు సూచనలు చేశారు. కర్నూలు సరిహద్దులో గల గ్రామాల్లో అదేవిధంగా గుంటూరు జిల్లా సరిహద్దు గ్రామాల్లో అధికారులు అప్రమత్తంగా ఉండాలన్నారు. ఈ రెండు సరిహద్దు ప్రాంతాల్లో ప్రత్యేక అధికారులను నియమించి నియంత్రణ చర్యలు చేపట్టాలన్నారు. అటువారెవరూ ఇటు రాకుండా, ఇటువారెవరూ అటు పోకుండా చూడాలన్నారు. వైరస్‌ మన దగ్గర పుట్టింది కాదని, ఇతర ప్రాంతాల నుంచి వ్యాప్తి చెందిందన్నారు. ప్రజల రాకపోకలను ఎంత కట్టుదిట్టంగా నియంత్రించగలిగితే వైరస్‌ వ్యాప్తిని అంత బాగా అరికట్టవచ్చు అని సీఎం పేర్కొన్నారు.

    అదే సమయంలో కరోనా వ్యాప్తి ఎక్కువగా ఉన్న హైదరాబాద్‌ చుట్టుపక్కల ప్రాంతాల్లో కట్టుదిట్టమైన నియంత్రణ చర్యలు పాటించాలని సీఎం కేసీఆర్ అన్నారు. హైదరాబాద్‌ చుట్టుపక్కల జిల్లాలు మినహా రాష్ట్రంలోని మిగతా జిల్లాల్లో పరిస్థితి అదుపులోనే ఉందన్నారు. కొత్తగా నమోదవుతున్న కేసులన్నీ హైదరాబాద్‌, మేడ్చల్‌, రంగారెడ్డి, వికారాబాద్‌ జిల్లాలోనే ఉన్నాయన్నారు. అధికారులు హైదరాబాద్‌ పై ఎక్కువ దృష్టి కేంద్రీకరించాలన్నారు. ఎవరికి వ్యాధి లక్షణాలు కనిపించినా వెంటనే పరీక్షలు జరిపాలన్నారు. పాజిటివ్‌ వచ్చిన వ్యక్తికి చికిత్స చేయించడంతో పాటు అతను కలిసిన వారందరినీ క్వారంటైన్‌ చేయాలన్నారు. హైదరాబాద్‌ లోని వారు బయటకు పోకుండా బయటివారు హైదరాబాద్‌ లోకి రాకుండా పకడ్బందీ చర్యలు చేపట్టాలన్నారు. చురుకైన పోలీసు అధికారులు, వైద్యారోగ్యశాఖ అధికారులు, ఐఏఎస్‌ అధికారులను ప్రత్యేకాధికారులుగా నియమించాలన్నారు.