https://oktelugu.com/

ఆ సీనియర్ నటి ఎందుకు పెళ్లి చేసుకోలేదంటే?

ఒకప్పటి హీరోయిన్, ప్రస్తుత క్యారెక్టర్ సీతార తాను పెళ్లి చేసుకోకపోవడానికి గల కారణాన్ని తాజాగా ఓ ఇంటర్వ్యూలో తెలిపింది. ఒకప్పుడు సితార హీరోయిన్ గా మంచి గుర్తింపు తెచ్చుకొంది. పలు భాషల్లో నటించి మెప్పింది. అందం, అభినయంతో నాటితరం ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. కొన్నేళ్ల గ్యాప్ తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్టుగా సితార ఎంట్రీ ఇచ్చింది. సెకండ్ ఇన్నింగ్స్ లోనూ బీజీగా స్టార్ గా మారిపోయింది. టాలీవుడ్లో హీరోల తల్లి క్యారెక్టర్లలో సితార, ప్రగతిలు పోటాపోటీగా అవకాశాలు దక్కించుకుంటున్నారు. […]

Written By:
  • Neelambaram
  • , Updated On : May 6, 2020 / 07:31 PM IST
    Follow us on


    ఒకప్పటి హీరోయిన్, ప్రస్తుత క్యారెక్టర్ సీతార తాను పెళ్లి చేసుకోకపోవడానికి గల కారణాన్ని తాజాగా ఓ ఇంటర్వ్యూలో తెలిపింది. ఒకప్పుడు సితార హీరోయిన్ గా మంచి గుర్తింపు తెచ్చుకొంది. పలు భాషల్లో నటించి మెప్పింది. అందం, అభినయంతో నాటితరం ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. కొన్నేళ్ల గ్యాప్ తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్టుగా సితార ఎంట్రీ ఇచ్చింది. సెకండ్ ఇన్నింగ్స్ లోనూ బీజీగా స్టార్ గా మారిపోయింది. టాలీవుడ్లో హీరోల తల్లి క్యారెక్టర్లలో సితార, ప్రగతిలు పోటాపోటీగా అవకాశాలు దక్కించుకుంటున్నారు. సీనియర్ హీరోయిన్ రాణించిన సితార తనకు పెళ్లి కాలేదని విషయం తెలిపి అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది.

    లాక్ డౌన్ బాధిత ప్రజలపై పెట్రోల్ ధరల మోత

    తాను ఎందుకు పెళ్లి చేసుకోకపోవడానికి గల కారణాన్ని సితార వివరించింది. తనకు తండ్రి అంటే చాలా ఇష్టమని చెప్పింది. ఏ చిన్న పని చేసినా, సినిమా, కెరీర్ వంటి విషయాలతోపాటు ప్రతీ పనిలోనూ ఆయన మాటనే వినేదానినని చెప్పింది. తన కెరీర్ పిక్స్ లో ఉన్న సమయంలోనే తన తండ్రి మృతిచెందినట్లు వాపోయింది. ఆయన మృతితో మానసికంగా కుంగిపోయినట్లు తెలిపింది. ఈ బాధను మరిచిపోయేందుకు వరుసగా సినిమాలు చేస్తూ పోయినట్లు తెలిపింది. అలా బీజీగా మారిపోయి ఎనిమిదేళ్లు పెళ్లి గురించి ఆలోచించలేదని తెలింది.

    మద్యం అమ్మకాలపై ముఖం చాటేస్తున్న ప్రధాని మోదీ!

    ప్రస్తుతానికి పెళ్లి చేసుకునే ఆలోచన లేదని చెప్పింది. సితార తన జీవితంలో జరిగిన విషాద సంఘటన తెలుసుకున్న అభిమానులు షాక్ అవుతున్నారు. తెరపై ఎప్పుడు నవ్వుతూ కన్పించే సితార జీవితంలో ఇంత విషాదం ఉందా? అంటూ అభిమానులు అవాక్కవుతున్నారు.