https://oktelugu.com/

వలస కూలీలకు చేయూతనివ్వండి:జగన్

వలస కూలీల విషయంలో ప్రతి అధికారి ఉదారంగా ఉండాలని ఏపీ సీఎం జగన్‌ అధికారులకు సూచించారు. అధికారులతో జరిగిన సమీక్షలో ఆయన మాట్లాడుతూ.. ‘‘ఏపీలో ఉన్న ఇతర రాష్ట్రాల కూలీలకు షెల్టర్‌ ఏర్పాటు చేసి వారికి భోజనం, తదితర సదుపాయాలు ఇవ్వండి. వివిధ పరిశ్రమల్లో పనులకు వెళ్తానంటే.. వారికి సహకారం అందించండి. తమ తమ రాష్ట్రాలకు వెళ్లిపోతామంటే… వారికి కావాల్సిన ప్రయాణ ఏర్పాటు చేయండి. ఇందుకు అవసరమైన ఖర్చును రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తుంది. ఈ విషయంలో సంకోచించాల్సిన […]

Written By:
  • Neelambaram
  • , Updated On : May 6, 2020 / 07:09 PM IST
    Follow us on

    వలస కూలీల విషయంలో ప్రతి అధికారి ఉదారంగా ఉండాలని ఏపీ సీఎం జగన్‌ అధికారులకు సూచించారు. అధికారులతో జరిగిన సమీక్షలో ఆయన మాట్లాడుతూ.. ‘‘ఏపీలో ఉన్న ఇతర రాష్ట్రాల కూలీలకు షెల్టర్‌ ఏర్పాటు చేసి వారికి భోజనం, తదితర సదుపాయాలు ఇవ్వండి. వివిధ పరిశ్రమల్లో పనులకు వెళ్తానంటే.. వారికి సహకారం అందించండి. తమ తమ రాష్ట్రాలకు వెళ్లిపోతామంటే… వారికి కావాల్సిన ప్రయాణ ఏర్పాటు చేయండి. ఇందుకు అవసరమైన ఖర్చును రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తుంది. ఈ విషయంలో సంకోచించాల్సిన అవసరం లేదు. చొరవ తీసుకుని వారికి తగిన విధంగా సహాయం చేయండి. వెళ్లేటప్పుడు దారి ఖర్చుల కింద రూ.500లు రూపాయలు ఒక్కో కూలీకి ఇవ్వండి’’ అని సీఎం జగన్‌ అధికారులకు సూచించారు.

    ఇతర రాష్ట్రాల్లో ఉన్న రాష్ట్ర కూలీలు ఇక్కడకు వచ్చేందుకు ఆయా రాష్ట్రాలకు చెందిన ప్రభుత్వాలు ముందుకు రాని పరిస్థితులు ఉంటే.. వెనకడుగు వేయవద్దన్నారు. అవసరమైన పక్షంలో వారికీ ప్రయాణ సదుపాయాలు కూడా రాష్ట్ర ప్రభుత్వమే కల్పించాలని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు.