https://oktelugu.com/

బీజేపీ వర్సెస్ జనసేన..!

ఇదేంటీ.. ఈ రెండు పార్టీలూ ఫ్రెండ్స్ కదా! ఎక్కడ చెడింది అనుకుంటున్నారా..? ఇంకా ఎక్కడా చెడలేదు కానీ.. ఇరు పార్టీల మధ్య పోరు మాత్రం నడుస్తోంది. తిరుపతి బై పోల్ లో ఎవరు నిలబడాలి..? ఎవరు సపోర్ట్ చేయాలి..? అనే విషయంలో నెలకొన్న పంచాయితీ.. ఇంకా కొనసాగుతూనే ఉంది. Also Read: హరీష్ రావు సన్నిహిత నేతపై ఫోకస్ పెట్టిన కాషాయదళం..! బలం పెంచుకోవాలని కాషాయం.. ఏపీ బీజేపీకి తిరుప‌తి బై పోల్ ప్ర‌తిష్టాత్మ‌కంగా మారింది. మోడీ […]

Written By:
  • Neelambaram
  • , Updated On : December 13, 2020 11:51 am
    Follow us on

    BJP Janasena
    ఇదేంటీ.. ఈ రెండు పార్టీలూ ఫ్రెండ్స్ కదా! ఎక్కడ చెడింది అనుకుంటున్నారా..? ఇంకా ఎక్కడా చెడలేదు కానీ.. ఇరు పార్టీల మధ్య పోరు మాత్రం నడుస్తోంది. తిరుపతి బై పోల్ లో ఎవరు నిలబడాలి..? ఎవరు సపోర్ట్ చేయాలి..? అనే విషయంలో నెలకొన్న పంచాయితీ.. ఇంకా కొనసాగుతూనే ఉంది.

    Also Read: హరీష్ రావు సన్నిహిత నేతపై ఫోకస్ పెట్టిన కాషాయదళం..!

    బలం పెంచుకోవాలని కాషాయం..
    ఏపీ బీజేపీకి తిరుప‌తి బై పోల్ ప్ర‌తిష్టాత్మ‌కంగా మారింది. మోడీ పాల‌న‌తో త‌మ‌కు దేశ‌మంతా అనుకూల‌త ఉంద‌ని వాదిస్తున్న ఆ పార్టీ నేతలు.. తిరుపతిలో గెలిచి సత్తా చాటాలని భావిస్తున్నారు. అయితే.. ఈ ప్ర‌య‌త్నంలో బీజేపీ ముందుగా జ‌న‌సేనతో పోటీ ఎదుర్కోవాల్సి రావడం విశేషం. బీజేపీకి మిత్రపక్షంగా ఉన్న జనసేన.. తాము కూడా ఈ ఎన్నికల్లో పోటీ చేస్తామని ప్రకటించింది. దీంతో ఈ రెండు పార్టీల్లో ఎవరు పోటీలో నిలుస్తారో ఎవరికీ తెలియట్లేదు.

    కొనసా…గుతున్న చర్చలు
    ఇద్దరిలో ఎవరు పోటీ చేయాలనే విషయమై చర్చోపచర్చలు సాగుతున్నాయి. రోజుల తరబడి సాగుతున్న ఈ మేథో మదనం ఇంకా ముగియట్లేదు. దీంతో ఏం జరుగుతోందో అర్థం కాక కేడర్లో అయోమయం నెలకొంది.

    పవన్ కు ఇంత ప్రాధాన్యం ఎందుకు?
    బీజేపీ కేంద్రంలో అధికారంలో ఉంది. రాష్ట్రంలో నేతలు మోదీ పేరుతోనే ఎన్నికలకు వెళ్తున్నారు. ఇటు జనసేనను చూస్తే.. గత ఎన్నికల్లో ఏమాత్రం ప్రభావం చూపలేదు. అలంటి పార్టీ నిర్ణయం కోసం ఎందుకు బీజేపీ ఎదురుచూస్తోంది..? అనేది చాలా మందిలో మెదిలే ప్రశ్న. అయితే.. దీనికి కారణం ఉంది. గత ఎన్నికల్లో తిరుపతి లోక్ స‌భ సీటు ప‌రిధిలో సుమారు 13 ల‌క్ష‌ల‌కు పైగా ఓట్లు పోల్ అయితే… బీజేపీ అభ్య‌ర్థికి అప్పుడు వ‌చ్చిన ఓట్లు సుమారు 16 వేలు! అంటే.. ఒక్క శాతం కంటే కొన్ని ఎక్కువ ఓట్లు వచ్చాయి. కానీ.. నోటాకు ప‌డ్డ ఓట్లు 25 వేలు! ఇదీ.. అక్కడ బీజేపీ బలం. దేశ‌మంతా మోడీ గాలి వీచినా.. తిరుప‌తిలో కమలం ప్రభావం ఇదన్నమాట. అందుకే.. జనసేనను కాదనలేకపోతోందని సమాచారం.

    Also Read: ‘సింధు’ భోజనం.. గొడ్డు, బర్రె, ఓ మేక!

    హైద్రాబాద్ లో చర్చలు..
    జీహెచ్ ఎంసీ ప్రచారానికి వచ్చిన సందర్భంగా అమిత్ షా మాట్లాడుతూ.. తాము ఏ ఎన్నికలనూ తేలిగ్గా తీసుకోబోమని అన్నారు. తిరుపతి ఎన్నికపైనా ఇదే విధంగా వ్యవహరిస్తున్నారు కాషాయ దళనేతలు. తిరుప‌తిలో ఎవ‌రు పోటీ చేయాల‌నే అంశం గురించి హైద‌రాబాద్ లో చ‌ర్చ‌లు జరుపుతున్నట్టు సమాచారం. మరి చూడాలి.. ఈ చర్చల్లో ఎవ‌రు గెలిచి తిరుప‌తి బ‌రిలో నిలుస్తారో..?

    మరిన్ని ఆంధ్ర రాజకీయ వార్తల కోసం ఏపీ పాలిటిక్స్