ఢిల్లీ పర్యనలో కేంద్రాన్ని కేసీఆర్ ఏం కోరాడంటే..?

మొన్నటి వరకు ఎన్నికలతో బీజీగా ఉన్న తెలంగాణ సీఎం కేసీఆర్ ఆ తరువాత ఎవరూ ఊహించని విధంగా ఢిల్లీ పర్యటన చేస్తున్నారు. ఈనెల 10న హస్తినకు వెళ్లిన టీఆర్ఎస్ అధినేత వరుసగా కేంద్రమంత్రులు, ఆ తరువాత ప్రధాన మంత్రిని కలిశారు. రాష్ట్రంలోని పలు అవసరాల కోసం నిధులు అడిగేందుకు కేంద్ర ప్రభుత్వాన్ని కోరినట్లు టీఆర్ఎస్ వర్గాలు తెలుపుతున్నాయి. మూడురోజుల పాటు ఢిల్లీలో మకాం వేసిన కేసీఆర్ నిన్న సాయంత్రం ప్రధాన మంత్రి నరేంద్ర మోడీతో సమావేశమయ్యారు.పలు విషయాలపై […]

Written By: NARESH, Updated On : December 13, 2020 12:15 pm
Follow us on

మొన్నటి వరకు ఎన్నికలతో బీజీగా ఉన్న తెలంగాణ సీఎం కేసీఆర్ ఆ తరువాత ఎవరూ ఊహించని విధంగా ఢిల్లీ పర్యటన చేస్తున్నారు. ఈనెల 10న హస్తినకు వెళ్లిన టీఆర్ఎస్ అధినేత వరుసగా కేంద్రమంత్రులు, ఆ తరువాత ప్రధాన మంత్రిని కలిశారు. రాష్ట్రంలోని పలు అవసరాల కోసం నిధులు అడిగేందుకు కేంద్ర ప్రభుత్వాన్ని కోరినట్లు టీఆర్ఎస్ వర్గాలు తెలుపుతున్నాయి. మూడురోజుల పాటు ఢిల్లీలో మకాం వేసిన కేసీఆర్ నిన్న సాయంత్రం ప్రధాన మంత్రి నరేంద్ర మోడీతో సమావేశమయ్యారు.పలు విషయాలపై చర్చించారు.

Also Read: హరీష్ రావు సన్నిహిత నేతపై ఫోకస్ పెట్టిన కాషాయదళం..!

ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో కేసీఆర్ దాదాపు 40 నిమిషాల పాటు సమావేశమయ్యారు. రాష్ట్రానికి రావాల్సిన నిధులపై చర్చించినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా వరదసాయం, క్రుష్ణా నది జలాల వివాదం, సాగునీటి ప్రాజెక్టులకు నిధుల తదితర అంశాలపై సుధీర్ఘంగా చర్చించనట్లు సమాచారం. ఇక విభజన చట్టంలోని అంశాలపై కూడా మాట్లాడినట్లు తెలుస్తోంది. ఎన్నో ఏళ్లుగా పెండింగ్ లో ఉన్న ఎస్సీ వర్గీకరణ అంశాన్ని కూడా ప్రస్తావించినట్టలు టీఆర్ఎస్ వర్గాలు చర్చించుకుంటున్నారు.

తెలంగాణలో వెనుకబడిన జిల్లాల కోసం ఏటా కేంద్రం విడుదల చేయాల్సిన రూ.450 కోట్లను వెంటనే విడుదల చేయాలని కోరారు. రాష్ట్రంలో రైల్వే పనులకు అవసరమైన నిధులు కేంద్రం వెంటనే విడుదల చేయాలన్నారు. రామప్ప దేవాలయన్ని ప్రపంచ వారసత్వం సంపదగా గుర్తించాలని కేసీఆర్ కోరినట్లు సమాచారం.

Also Read: ‘సింధు’ భోజనం.. గొడ్డు, బర్రె, ఓ మేక!

అంతకుముందు కేంద్ర మంద్రి హర్దిప్ సింగ్ తో కేసీఆర్ సమావేశమయ్యారు. రాష్ట్రంలో నిర్మిస్తున్న డబుల్ బెడ్ రూం ఇళ్ల నిర్మాణానికి సంబంధించిన నిధులను కోరినట్లు తెలుస్తోంది. ఇక తెలంగాణలో ఆరు ఎయిర్ పోర్టుల ప్రతిపాదనను కూడా మంత్రి ముందుంచారు. తెలంగాణలోని పెద్దపల్లి జిల్లా బసంత్ నగర్, వరంగల్ లోని మూమునూరు, ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లా జక్రాన్ పల్లి, మహబూబ్ నగర్ జిల్లా గుడిబండ, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎయిర్ పోర్టుల గురించి కేసీఆర్ వివరించినట్లు తెలుస్తోంది.

మరిన్ని తెలంగాణ రాజకీయ వార్తల కోసం తెలంగాణ పాలిటిక్స్