అల్లుళ్ల కోసం గిళ్లక తప్పదు బాలయ్యా..!

తెలుగుదేశం పార్టీ అధినేత, సినీ నటుడు ఎన్టీరామారావు కుమారుడైన బాలకృష్ణ తండ్రి అండ ఉన్నా ప్రత్యేకంగా గుర్తింపు తెచ్చుకున్నాడు. సినిమాల్లో తనదైన నటనతో అందరినీ ఆట్టుకున్నాడు. ఆ తరువాత రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన బాలయ్య ప్రస్తుతం హిందూపురం ఎమ్మెల్యేగా కొనసాగుతున్నాడు. ఇక్కడ వరుసగా విజయాలు సాధిస్తూ అందరి మన్ననలు పొందుతున్నాడు. మరిన్ని ఆంధ్ర రాజకీయ వార్తల కోసం ఏపీ పాలిటిక్స్ అయితే ఎక్కువ శాతం సినిమాలకు సమయాన్ని కేటాయిస్తున్న బాలయ్య తన నియోజకవర్గంలో ఎక్కువగా ఉండడం లేదనే […]

Written By: NARESH, Updated On : October 31, 2020 10:00 am
Follow us on

తెలుగుదేశం పార్టీ అధినేత, సినీ నటుడు ఎన్టీరామారావు కుమారుడైన బాలకృష్ణ తండ్రి అండ ఉన్నా ప్రత్యేకంగా గుర్తింపు తెచ్చుకున్నాడు. సినిమాల్లో తనదైన నటనతో అందరినీ ఆట్టుకున్నాడు. ఆ తరువాత రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన బాలయ్య ప్రస్తుతం హిందూపురం ఎమ్మెల్యేగా కొనసాగుతున్నాడు. ఇక్కడ వరుసగా విజయాలు సాధిస్తూ అందరి మన్ననలు పొందుతున్నాడు.

మరిన్ని ఆంధ్ర రాజకీయ వార్తల కోసం ఏపీ పాలిటిక్స్

అయితే ఎక్కువ శాతం సినిమాలకు సమయాన్ని కేటాయిస్తున్న బాలయ్య తన నియోజకవర్గంలో ఎక్కువగా ఉండడం లేదనే అపవాదు ఉంది. అంతేకాకుండా ప్రజలు తమ సమస్యల్ని చెప్పుకోవాలంటే బాలయ్య అందుబాటులో ఉండడం లేదని కొందరు వాపోతున్నారు. అయితే ఇప్పుడు బాలకృష్ణ రాజకీయల్లో ప్రత్యక్షంగా పోరాడడం తప్పేట్టు లేదు. ఇప్పటి వరకు చంద్రబాబు అండతో, ఎన్టీఆర్‌ పేరు చెప్పుకొని ఎమ్మెల్యేగా గెలిచిన బాలయ్య ఇప్పుడు ఆయన అల్లుళ్ల కోసం రాజకీయాల్లోకి క్రీయాశీలకంగా పనిచేయాల్సిన అవసరం ఉందని అంటున్నారు.

Also Read: విద్యార్థుల తల్లిదండ్రులకు సీఎం జగన్ శుభవార్త.. ఏం చేశారంటే..?

చంద్రబాబు కుమారుడు లోకేశ్‌బాబు, బాలయ్యకు అల్లుడు అన్న విషయం దాదాపు అందరికీ తెలుసు. ప్రస్తుతం టీడీపీకి జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఉన్న ఆయన త్వరలో టీడీపీ బాధ్యతలు చేపడుతారని అంటున్నారు. అంతవరకు బాగానే ఉంది కానీ.. గత ఎన్నికల్లో మంగళగిరి నుంచి పోటీ చేసి ఓడిన లోకేశ్‌ ఈసారి గెలుపు కోసం తీవ్రంగా కృషి చేయాల్సిన అవసరం ఉంది. అందుకు బాలకృష్ణ సపోర్టు కావాల్సి ఉంది. హిందూపురం ఎమ్మెల్యేగానే కాకుండా పొలిట్‌బ్యూరో సభ్యుడిగా ఇటీవల ఎన్నికైన ఆయన పార్టీ గెలుపు కోసం కష్టపడకుంటే అల్లుడు లోకేశ్‌ భవిష్యత్తు ఆందోళనలో పడే అవకాశం ఉంది.

ఇక బాలకృష్ణ మరో అల్లుడు భరత్‌ గత ఎన్నికల్లో విశాఖ ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు. గీతం విద్యాసంస్థల అధినేత అయిన ఆయన వచ్చే ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం ఉంది. ఇటీవల గీతం యూనివర్సిటీ ప్రహారీ గోడ కూల్చివేత ఘటనలో చంద్రబాబు సహా టీడీపీ నేతలు స్పందించారు. అయితే బాలకృష్ణ ఏవిధంగా స్పందించలేదు. అయితే వచ్చే ఎన్నికల్లో మాత్రం ఈ అల్లుడి కోసం కష్టపడకుంటే అసలుకే మోసం ఏర్పడే ప్రమాదముందంటున్నారు.

Also Read: భారీ భూకంపం.. సునామీతో జనం పరుగులు

అందువల్ల బాలకృష్ణ కేవలం సినిమాలకే కాకుండా రాజకీయాల్లోనూ ప్రత్యక్షంగా పోరాడాల్సిన అవసరం ఏర్పడిందని కొందరు సీనియర్‌ రాజకీయ నాయకులు అంటున్నారు. మరి బాలయ్య అల్లుళ్ల కోసం ఏ విధంగా గిల్లుకుంటూ పోతాడో చూద్దాం..