https://oktelugu.com/

మాంసం తినే వారికి షాకింగ్ న్యూస్.. ఆ వ్యాధి బారిన పడే అవకాశం..?

మనలో చాలామంది నాన్ వెజ్ ను ఎంతో ఇష్టంగా తింటూ ఉంటారు. ముక్క లేనిదే ముద్ద దిగని వాళ్లు మనలో చాలామందే ఉంటారు. అయితే మాంసం తినేవాళ్లు చల్లటి మాంసంతో జాగ్రత్తగా ఉండాలని.. చల్లటి మాంసం తింటే ప్రాణాంతక వ్యాధుల బారిన పడే అవకాశం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. చల్లటి మాంసంపై ప్రమాదకరమైన బ్యాక్టీరియా ఉంటుందని ఆ బ్యాక్టీరియా అనేక ఆరోగ్య సమస్యలకు కారణమవుతుందని తెలుపుతున్నారు. లిస్టేరియా అని పిలిచే ఈ బ్యాక్టీరియా ఇప్పటికే అగ్రరాజ్యం అమెరికాలోని […]

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : October 31, 2020 / 08:36 AM IST
    Follow us on


    మనలో చాలామంది నాన్ వెజ్ ను ఎంతో ఇష్టంగా తింటూ ఉంటారు. ముక్క లేనిదే ముద్ద దిగని వాళ్లు మనలో చాలామందే ఉంటారు. అయితే మాంసం తినేవాళ్లు చల్లటి మాంసంతో జాగ్రత్తగా ఉండాలని.. చల్లటి మాంసం తింటే ప్రాణాంతక వ్యాధుల బారిన పడే అవకాశం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. చల్లటి మాంసంపై ప్రమాదకరమైన బ్యాక్టీరియా ఉంటుందని ఆ బ్యాక్టీరియా అనేక ఆరోగ్య సమస్యలకు కారణమవుతుందని తెలుపుతున్నారు.

    లిస్టేరియా అని పిలిచే ఈ బ్యాక్టీరియా ఇప్పటికే అగ్రరాజ్యం అమెరికాలోని మూడు రాష్ట్రాల ప్రజలను గజగజా వణికిస్తుంది. శాస్త్రవేత్తలు ఈ బ్యాక్టీరియా ఏ విధంగా పుట్టిందో కచ్చితమైన కారణాన్ని కనుగొనలేకపోతున్నారు. ఇప్పటికే ఈ వ్యాధి బారిన పడిన ఒక వ్యక్తి మృతి చెందగా 9 మంది అనారోగ్య సమస్యలతో ఆస్పత్రిలో జాయిన్ అయ్యారు. ఇమ్యూనిటీ పవర్ తక్కువగా ఉన్నవాళ్లు ఈ బ్యాక్టీరియా వల్ల కలిగే వ్యాధుల బారిన పడే అవకాశం ఉంటుంది.

    శాస్త్రవేత్తలు, వైద్యులు గర్భంతో ఉన్నవాళ్లు, వృద్ధులు ఎక్కువగా ఈ బ్యాక్టీరియా బారిన పడుతున్నారు. అయితే ఈ బ్యాక్టీరియా అరుదుగా వ్యాపించినా జాగ్రత్తగా ఉండాలని అందువల్ల చల్లటి మాంసం తినవద్దని వైద్యులు తెలుపుతున్నారు. ఈ బ్యాక్టీరియా చల్లటి వాతావరణంలో జీవిస్తుంది. జ్వరం, ఒళ్లు నొప్పులు, తలనొప్పి, డయేరియా ఈ వ్యాధి లక్షణాలు. గర్భం దాల్చిన మహిళలు ఈ బ్యాక్టీరియా వల్ల కలిగే వ్యాధి బారిన పడితే ప్రమాదం.

    ఈ బ్యాక్టీరియా బారిన పడిన కొందరు మహిళల్లో గర్భస్రావం, ప్రసవ సమయంలో సమస్యలు, పుట్టినబిడ్డ చనిపోయే అవకాశాలు ఉంటాయని వైద్యులు తెలుపుతున్నారు. కొత్తకొత్త వ్యాధులు విజృంభిస్తున్న నేపథ్యంలో ప్రజలు ఆరోగ్యం విషయంలో మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందని వైద్యులు తెలుపుతున్నారు.