https://oktelugu.com/

విశాఖలో వైసీపీకి ఉన్న బలం ఇదే..!

ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల హడావుడి మొదలు కానుంది. ముఖ్యమంత్రి జగన్‌, ఎన్నికల కమిషనర్‌ నిమ్మగడ్డ రమేశ్‌కుమార్‌ల మధ్య కోల్డ్‌వార్‌ సాగుతున్నా మొత్తానికి ఎన్నికలు నిర్వహించే అవకాశం ఎక్కువగానే ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఒకవేళ ఎన్నికలు జరిగితే వైసీపీకే ఎక్కువ లాభాలున్నాయని తెలుస్తోంది. రాష్ట్రంలో 151 ఎమ్మెల్యేలతో పాటు కొందరు టీడీపీ నాయకులు కూడా జగన్‌కు మద్దతు ఇస్తుండడంతో స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయావకాశాలు వైసీపీకే ఎక్కువగానే ఉన్నట్లు తెలుస్తోంది. గత ఎన్నికల్లో విశాఖ జిల్లాలో కాస్త […]

Written By:
  • NARESH
  • , Updated On : October 31, 2020 / 09:19 AM IST
    Follow us on

    ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల హడావుడి మొదలు కానుంది. ముఖ్యమంత్రి జగన్‌, ఎన్నికల కమిషనర్‌ నిమ్మగడ్డ రమేశ్‌కుమార్‌ల మధ్య కోల్డ్‌వార్‌ సాగుతున్నా మొత్తానికి ఎన్నికలు నిర్వహించే అవకాశం ఎక్కువగానే ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఒకవేళ ఎన్నికలు జరిగితే వైసీపీకే ఎక్కువ లాభాలున్నాయని తెలుస్తోంది. రాష్ట్రంలో 151 ఎమ్మెల్యేలతో పాటు కొందరు టీడీపీ నాయకులు కూడా జగన్‌కు మద్దతు ఇస్తుండడంతో స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయావకాశాలు వైసీపీకే ఎక్కువగానే ఉన్నట్లు తెలుస్తోంది. గత ఎన్నికల్లో విశాఖ జిల్లాలో కాస్త వెనుకబడ్డ వైసీపీ ఇప్పడు ఎలాంటి పరిస్థితి ఉందో చూద్దాం..

    మరిన్ని ఆంధ్ర రాజకీయ వార్తల కోసం ఏపీ పాలిటిక్స్

    విశాఖ కార్పొరేషన్‌ చూసుకుంటే 80 శాతానికి పైగానే ఇక్కడ సీట్లు వస్తాయని వైసీపీ నాయకులు అంటున్నారు. 99 సీట్లకు పెంచిన ఈ కార్పొరేషన్‌ను కైవసం చేసుకోవచ్చని ఆ పార్టీ నాయకులు అభిప్రాయపడుతున్నారు. 2019 ఎన్నికల్లో విశాఖ నగరంలో నలుగురు ఎమ్మెల్యేలు టీడీపీ నుంచి గెలుపొందారు. వారిలో దక్షిణ ఎమ్మెల్యే వాసుపల్లి గణేశ్‌కుమార్‌ ఇటీవల టీడీపీకి గుడ్‌బై చెప్పి వైసీపీలో చేరారు. ఇక ఉత్తరం ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు కూడా సైకిల్‌ని పట్టించుకోవడం లేదు. తూర్పు ఎమ్మెల్యే వెలగపూడితో కొంత ఇబ్బంది ఉన్నా నెట్టుకొచ్చే అవకాశాలు ఎక్కువగానే ఉన్నాయంటున్నారు. కాగా పశ్చిమలో వైసీపీ జోరు మెల్లమెల్లగా పెరుగుతోంది.

    Also Read: అల్లుళ్ల కోసం గిళ్లక తప్పదు బాలయ్యా..!

    మరోవైపు విశాఖ మొత్తంలో వైసీపీ పుంజుకుంటున్నట్లు తెలుస్తోంది. ఇక్కడ వైసీపీ తూర్పు నియోజకవర్గ ఇన్‌చార్జిగా ఉన్న వంశీకృష్ణ శ్రీనివాసయాదవ్‌కే మేయర్‌ అభ్యర్థిత్వాన్ని ఆశిస్తున్నాడు. ఇక్కడ తనకు పట్టు ఉండగా మిగతా చోట్ల జెండా ఎగురవేయడానికి ప్రయత్నిస్తున్నాడు. భీమిలిలో మంత్రి అవంతి శ్రీనివాస్‌, గాజువాకలో వైసీపీ ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి బలం ఉండనే ఉంది.

    Also Read: విద్యార్థుల తల్లిదండ్రులకు సీఎం జగన్ శుభవార్త.. ఏం చేశారంటే..?

    ఈ నేపథ్యంలో విశాఖ మేయర్‌ స్థానాన్ని కొట్టేందుకు పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేదని అంటున్నారు. అయితే టీడీపీ సైతం జగన్‌ తప్పులను ఎత్తివేసి ఇక్కడ తన ఎమ్మెల్యేలతో డివిజన్లను చీల్చాలని యత్నిస్తున్నారు. అయితే ఎన్నికలపై ప్రకటన వెలువడిన తరువాత ఎలాంటి మార్పులు చోటు చేసుకుంటాయో చూడాలి మరి..