https://oktelugu.com/

‘చంద్రబాబు గుడులను కూడా వదల్లేదుగా..!’

టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు అవుట్ సోర్సింగ్ కాంట్రాక్టు విధానం లో రాష్ట్రంలోని గుడులను వదిలిపెట్టలేదని ఏపీ సీఎం జగన్ విమర్శించారు. గత టిడిపి ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు కాంట్రాక్టర్ లకు మేలు చేసే విదానాన్నే అమలు చేశారని జగన్ వ్యాఖ్యానించారు. అవుట్ సోర్సింగ్ కార్పొరేషన్ సేవలను ప్రారంభించిన సందర్భంగా ఆయన టీడీపీ పై నిప్పులు చెరిగారు. తన పాదయాత్రలో ఈ సమస్యను అనేక మంది ప్రస్తావించారని ఆయన అన్నారు. చివరికి గుడులలో సైతం చంద్రబాబు […]

Written By:
  • Neelambaram
  • , Updated On : July 3, 2020 / 08:37 PM IST
    Follow us on

    టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు అవుట్ సోర్సింగ్ కాంట్రాక్టు విధానం లో రాష్ట్రంలోని గుడులను వదిలిపెట్టలేదని ఏపీ సీఎం జగన్ విమర్శించారు. గత టిడిపి ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు కాంట్రాక్టర్ లకు మేలు చేసే విదానాన్నే అమలు చేశారని జగన్ వ్యాఖ్యానించారు. అవుట్ సోర్సింగ్ కార్పొరేషన్ సేవలను ప్రారంభించిన సందర్భంగా ఆయన టీడీపీ పై నిప్పులు చెరిగారు. తన పాదయాత్రలో ఈ సమస్యను అనేక మంది ప్రస్తావించారని ఆయన అన్నారు. చివరికి గుడులలో సైతం చంద్రబాబు తన బంధువు అయిన భాస్కర నాయుడుకు ఏడు గుడులలో ముప్పై లక్షల రూపాయల చొప్పున అవుట్ సోర్స్ కాంట్రాక్టు ఇచ్చాడని ఆయన అన్నారు. దీనివల్ల పనిచేసే సిబ్బందికి తక్కువ జీతాలు ఇవ్వడం, కాంట్రాక్టర్ లకు మేలు చేయడం జరిగేదని ఆయన విమర్శించారు. కాని ఇప్పుడు తాము తీసుకు వస్తున్న వ్యవస్థ వల్ల ఉద్యోగులకు జీతాలు పెరుగుతాయని, లంచాలతో పనిలేకుండా ఉద్యోగాలు వస్తాయని, ఖచ్చితంగా మొదటి తేదీనే జీతాలు ఇచ్చే విధంగా తాము ఏర్పాటు చేస్తున్నామని ఆయన అన్నారు. ఈ కొత్త సంస్థ అవుట్ సోర్స్ ఉద్యోగులలో కూడా ఏభై శాతం బలహీనవర్గాలవారు ఉండేలా చూస్తుందని జగన్ తెలిపారు.నలభై ఏడు వేల మందికి అవుట్ సోర్స్ ఉద్యోగులకు నియామక పత్రాలను అందిస్తున్నామని ఆయన చెప్పారు.

    ఏపీ కార్పొరేషన్‌ ఫర్‌ ఔట్‌ సోర్స్‌డ్‌ సర్వీసెస్‌’ (ఆప్కాస్‌)కు శ్రీకారం సీఎం జగన్ చుట్టారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ఆప్కాస్‌ ను సీఎం జగన్‌ లాంఛనంగా ప్రారంభించారు. ఉద్యోగాల భర్తీలో అవినీతి, అక్రమాలకు తావులేకుండా ఓ సంస్థను ఏర్పాటు చేయాలని భావించిన సీఎం దానికి అనుగుణంగానే ఎంతో ప్రతిష్టాత్మకంగా ఔట్ సోర్సింగ్ వ్యవస్థను తీసుకొచ్చారు. ఆప్కాన్‌ ప్రారంభం సందర్భంగా కాంట్రాక్ట్‌ ఉద్యోగాలు పొందిన పలువురితో వీడియో కాన్ఫరెన్స్‌ లో సీఎం మాట్లాడారు.

    కార్పొరేషన్‌ ఫర్‌ ఔట్‌ సోర్స్‌డ్‌ సర్వీసెస్‌ కు చైర్మన్‌ గా సాధారణ పరిపాలన శాఖ (జీఏడీ)కి చెందిన ప్రత్యేక ప్రధాన కార్యదర్శి లేదా ముఖ్య కార్యదర్శి లేదా ప్రభుత్వ కార్యదర్శి వ్యవహరిస్తారు. దీంతో ఎక్కడా కూడా అవినీతి చోటుచేసుకునే అవకాశం ఉండదు. జీతాలు, ఉద్యోగాల్లో ఎక్కడా చేతివాటాలకు అస్కారం లేదు. ఔట్ సోర్సింగ్ ఉద్యోగ నియామకాల్లో పారదర్శకత ఉంటుంది. ప్రతి ఒకనెలా 1వ తేదీనే జీతం చెల్లిస్తాం. ఈఎస్‌ఐ, పీఎఫ్ వంటి విధానాలు కచ్చితంగా పాటిస్తాం. ఎటువంటి లంచాలు, వివక్ష లేకుండా జీతాలు వారి చేతుల్లోకే వస్తాయి. ప్రస్తుతానికి 50,449 మందికి నియామక పత్రాలు ఇస్తాం. ఈ సంఖ్యను వచ్చే రోజుల్లో పెంచుతాం. గత ప్రభుత్వంలో కాంట్రాక్ట్‌లో 20 మంది పనిచేయాలని ఉంటే 15 మందితో పనిచేయించి.. మిగిలిన వారి జీతాలను కాంట్రాక్టర్లే తీసుకునేవారు. ఇకపై సిఫారసులు, దళారీలకు చోటు లేదు. కాంట్రాక్టు ఉద్యోగులకు పూర్తి భద్రతను ఇస్తాం’ అని అన్నారు. ఇక ఆప్కాస్‌పై కాంట్రాక్ట్‌ ఉద్యోగులు హర్షం వ్యక్తం చేశారు.