అసలు ఉనికే లేని చచ్చుబడిన ఏపీలో పీసీసీ అధ్యక్షుడిని మార్చేసి కొత్తగా శైలజనాథ్ ను పెట్టేసింది కాంగ్రెస్ అధిష్టానం. చాలా యాక్టివ్ గా ఉన్న కర్ణాటకలోనూ ట్రబుల్ షూటర్ డీకే శివకుమార్ ను పీసీసీ చీఫ్ గా నియమించింది. నెలలు గడుస్తున్నా కానీ తెలంగాణలో ఆ ఉలుకూ పలుకు లేదు. పైగా తెలంగాణ ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న కాంగ్రెస్ పార్టీ రోజురోజుకు దిగజారుతోంది. ఎందుకని అధిష్టానం తెలంగాణ కాంగ్రెస్ కు అసలు సిసలు నడిపించే నేతను ఎన్నుకోలేకపోతోంది? అన్నది ఇప్పుడు అందిరినీ తొలుస్తున్న ప్రశ్న. తెలంగాణ పీసీసీపై కాంగ్రెస్ అధిష్టానం ఎందుకని ఒక నిర్ణయానికి రావడం లేదన్నది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది..
హైదరాబాద్ అంటే ఎందుకంత నిర్లక్యం!
హుజూర్ నగర్ లాంటి సొంత అసెంబ్లీ సీటులో ఓటమి తర్వాత పీసీసీ చీఫ్ గా తాను వైదొలుగుతానని ఉత్తమ్ కుమార్ రెడ్డి ఢిల్లీ వెళ్లి మరీ కాడి వదిలేశాడట.. ఇప్పటికే ఉత్తమ్ ఐదేళ్ల పదవీకాలం కూడా ముగిసింది. ఆయన హయాంలో కాంగ్రెస్ గెలిచింది లేదు. ఇప్పటికే రెండు ఎన్నికలను పీసీసీ చీఫ్ గా ఎదుర్కొన్న ఉత్తమ్ రెండింట్లోనూ కాంగ్రెస్ ను గెలిపించలేకపోయాడు. దీంతో కాంగ్రెస్ వాదులంతా ఉత్తమ్ ను సాగనంపి కొత్త నేతను నియమించాలని అధిష్టానానికి విన్నవించారు.
ఈ నేపథ్యంలో కొత్త పీసీసీ చీఫ్ కోసం కాంగ్రెస్ నేతల లాబీయింగ్ జోరుగా సాగింది. రేవంత్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డిలు హోరాహోరీగా లాబీయింగ్ చేశారు. శ్రీధర్ బాబు,జీవన్ రెడ్డిల పేర్లు కూడా వినిపించాయి. జగ్గారెడ్డి అయితే తనకు ఇస్తే కాంగ్రెస్ ను అధికారంలోకి తీసుకొస్తానన్నాడు. అయితే కరోనా-లాక్ డౌన్ తెలంగాణ నేతల ఆశలపై నీళ్లు చల్లింది.
ఇదీ చంద్రబాబు, దేవినేని ఉమ ఘనకార్యమట?
రేవంత్ రెడ్డిని తెలంగాణ కాంగ్రెస్ చీఫ్ గా దాదాపు ఖాయం చేసుకున్న అధిష్టానానికి కాంగ్రెస్ సీనియర్లు అంతా మూకుమ్మడిగా వ్యతిరేకించడంతో నియామకం ఆగిపోయిందట.. కోమటిరెడ్డికి సపోర్టుగా ఉత్తమ్ సహా నల్గొండ నేతలు లాబీయింగ్ చేశారనే ప్రచారం సాగింది. ఈ నేపథ్యంలోనే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ తేనెతుట్టను కదపితే మరింతగా పరిస్థితి దిగజారుతుందని కాంగ్రెస్ అధిష్టానం మిన్నకున్నట్లు తెలిసింది.
అందుకే ఉత్తమ్ ప్రస్తుతానికి కంటిన్యూ అయిపోతున్నారు. అయితే వచ్చే మూడేళ్లలో కాంగ్రెస్ ను అధికారంలోకి తీసుకురావాలంటే కొత్త పీసీసీ చీఫ్ అవసరమని.. ఇప్పుడు నియమించాలని కాంగ్రెస్ వాదులు ఎంత మొత్తుకుంటున్నా.. గ్రూపుల గోలతో తెలంగాణ కాంగ్రెస్ లో ఇప్పుడప్పుడే పీసీసీ పీఠం మార్పు సాధ్యమయ్యేలా లేదట.. అలా కాంగ్రెస్ పార్టీ చేజేతులారా తెలంగాణలో బలహీన పడుతోందని.. ఇదంతా కాంగ్రెస్ నేతల స్వయంకృతాపరాధం అని నేతలు వాపోతున్నారు. తెలంగాణలో కాంగ్రెస్ ను ఎవరో ఓడించనక్కర్లేదని.. కాంగ్రెస్ వోళ్లు ఓడిస్తారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
-ఎన్నం