https://oktelugu.com/

శాసనమండలి రద్దు ఖాయం… సంకేతాలివే!

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో జగన్ పార్టీకి తిరుగులేని మెజారిటీ ఉంది. అయితే శాసనమండలి విషయానికి వస్తే ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ హవా కొనసాగుతోంది దింతో శాసనసభలో ఎటువంటి బిల్లు ప్రవేశపెట్టి,శాసనమండలికి పంపిస్తే అక్కడ దానిని టిడిపి అడ్డుకుంటోంది. ఇప్పటికే పలు బిల్లుల విషయంలో ఇలానే జరిగింది. అనేక సందర్భాల్లో ఇదే విధంగా శాసనమండలిలో ప్రభుత్వానికి చుక్కెదురయ్యింది. మరోవైపు మూడు రాజధానుల విషయంలోనూ టిడిపి ఇలానే వ్యవహరించింది. ఇక ముందు కూడా ఇదే ధోరణి తో వ్యవహరించే అవకాశం కనిపిస్తోంది. […]

Written By: , Updated On : March 10, 2020 / 03:57 PM IST
Follow us on

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో జగన్ పార్టీకి తిరుగులేని మెజారిటీ ఉంది. అయితే శాసనమండలి విషయానికి వస్తే ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ హవా కొనసాగుతోంది దింతో శాసనసభలో ఎటువంటి బిల్లు ప్రవేశపెట్టి,శాసనమండలికి పంపిస్తే అక్కడ దానిని టిడిపి అడ్డుకుంటోంది. ఇప్పటికే పలు బిల్లుల విషయంలో ఇలానే జరిగింది. అనేక సందర్భాల్లో ఇదే విధంగా శాసనమండలిలో ప్రభుత్వానికి చుక్కెదురయ్యింది. మరోవైపు మూడు రాజధానుల విషయంలోనూ టిడిపి ఇలానే వ్యవహరించింది. ఇక ముందు కూడా ఇదే ధోరణి తో వ్యవహరించే అవకాశం కనిపిస్తోంది. అందుకే ఏపీ అసెంబ్లీలో శాసన మండలిని రద్దు చేస్తూ తీర్మానం ప్రవేశపెట్టి సీఎం జగన్ ఆమోదింప జేసుకున్నారు.

అయితే ఈ వ్యవహారం కేంద్రానికి చేరింది. కేంద్రం జగన్ తీసుకున్న నిర్ణయానికి వంత పాడటంతో పాటు, శాసనమండలిని రద్దు చేసేందుకు సరే అనేలా వుంది. ఇదిలా ఉంటే, శాసన మండలి సభ్యత్వం పొంది మంత్రి పదవులు పొందిన జగన్ కు సన్నిహితులైన పిల్లి సుభాష్ చంద్రబోస్, మోపిదేవి వెంకటరమణ శాసనమండలి రద్దు అయితే మంత్రి పదవులకు రాజీనామా చేయాల్సి వస్తుంది. ఇటువంటి పరిస్థితి ఏర్పడితే వారికి రాజ్యసభ సభ్యత్వం కట్ట పెడతారనే వార్తలు వినిపించాయి. దీనిని నిజం చేస్తూ జగన్ ఆ ఇద్దరికి రాజ్యసభ సభ్యత్వం దక్కేలా చేశారు. దీనిని చూస్తుంటే త్వరలోనే శాసన మండలి రద్దు కాబోతోందని సంకేతాలు వచ్చాయని విశ్లేషకులు అంటున్నారు.