2019 లోనందమూరి బాలకృష్ణకి తీరని అవమానాన్ని మిగిల్చిన రూలర్ చిత్రం ఆయనకు మంచి గుణపాఠమే చెప్పింది. దాంతో తదుపరి చిత్రాల విషయంలో మేల్కొని పలు జాగ్రత్తలు తీసుకొంటున్నాడు. ఆ క్రమంలో తన 106వ చిత్రం తనతో రెండు హిట్ సినిమాలు తీసిన బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కిస్స్తున్నాడు. రీసెంట్‌గా రామోజీ ఫిలింసిటీలోఈ చిత్రం యొక్క షూటింగ్ స్టార్ట్ అయ్యింది కూడా…. సింహా, లెజెండ్ చిత్రాల తర్వాత బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో తెరకెక్కుతోన్న చిత్రం కావడంతో సినిమాపై మంచి అంచనాలున్నాయి. ఈ చిత్రంలో బాలకృష్ణ రెండు పాత్రల్లో నటిస్తున్నారు. అందులో ఓ పాత్ర అఘోరా తరహాలో ఉంటుందని అంటున్నారు. ఈ సినిమా సెట్స్‌లో ఉండగానే బాలయ్య తన తదుపరి 107వ సినిమాపై దృష్టి పెట్టాడని తెలుస్తోంది.
విశ్వసనీయ సమాచారాన్ని బట్టి ఆ చిత్రం సీనియర్ దర్శకుడు బి.గోపాల్ దర్శకత్వంలో తెరకెక్కబోతోంది గతంలో బాలకృష్ణతో లారీ డ్రైవర్, రౌడీఇన్‌స్పెక్టర్, సమరసింహారెడ్డి, నరసింహనాయుడు వంటి బ్లాక్‌బస్టర్ చిత్రాలను తీసిన బి.గోపాల్ తో కలిసి మరోమారు బాలయ్య తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నాడు.
ఈ సినిమా వర్క్ అంతా దాదాపు ఓకే అయ్యిందని.తెలుస్తోంది.. ఏప్రిల్‌లో బోయపాటి శ్రీను సినిమాను పూర్తి చేసిన వెంటనే ఎక్కువ గ్యాప్ తీసుకోకుండా బాలయ్య బాబు మే నెలలోనే తన 107వ సినిమాను మొదలు పెట్ట నున్నాడు…త్వరలోనే ఈ సినిమాకు సంబంధించి పూర్తి సమాచారం వెలువడ నుంది.
Old is always gold