హాస్టళ్లలో ఉండే విద్యార్థులకు జగన్ సర్కార్ శుభవార్త..?

ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి హాస్టళ్లలో ఉండే విద్యార్థులకు శుభవార్త చెప్పారు. నాడు నేడు అమలు ద్వారా రాష్ట్రంలోని హాస్టళ్ల రూపరేఖలు మార్చబోతున్నట్టు తెలిపారు. నిన్న రాష్ట్రంలోని హాస్టళ్ల గురించి సమీక్షా సమావేశం నిర్వహించిన జగన్ అధికారులకు కీలక సూచనలు చేశారు. రాష్ట్రంలోని విద్యార్థులకు పుస్తకాలు, దుస్తులతో పాటు మంచి వాతావరణం నాణ్యమైన ఆహారం అందేలా చేయబోతున్నామని వెల్లడించారు. హాస్టల్ విద్యార్థులకు కూడా జగనన్న విద్యాదీవెన కథకం అమలు చేయబోతున్నామని.. విద్యార్థులకు మంచి పౌష్టికాహారం ఇవ్వడంతో […]

Written By: Navya, Updated On : October 2, 2020 8:10 am
Follow us on

ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి హాస్టళ్లలో ఉండే విద్యార్థులకు శుభవార్త చెప్పారు. నాడు నేడు అమలు ద్వారా రాష్ట్రంలోని హాస్టళ్ల రూపరేఖలు మార్చబోతున్నట్టు తెలిపారు. నిన్న రాష్ట్రంలోని హాస్టళ్ల గురించి సమీక్షా సమావేశం నిర్వహించిన జగన్ అధికారులకు కీలక సూచనలు చేశారు. రాష్ట్రంలోని విద్యార్థులకు పుస్తకాలు, దుస్తులతో పాటు మంచి వాతావరణం నాణ్యమైన ఆహారం అందేలా చేయబోతున్నామని వెల్లడించారు.

హాస్టల్ విద్యార్థులకు కూడా జగనన్న విద్యాదీవెన కథకం అమలు చేయబోతున్నామని.. విద్యార్థులకు మంచి పౌష్టికాహారం ఇవ్వడంతో పాటు హాస్టళ్ల స్థితిగతులు పూర్తిగా మారాలని తెలిపారు. విద్యార్థులకు నాణ్యతతో కూడిన పౌష్టికాహారం అందించేందుకు సరైన ప్రణాళిక రచించాలని చెప్పారు. రాష్ట్రంలో జగనన్న గోరుముద్ద పథకానికి ఏ మెనూ అమలవుతుందో అదే మెనూ హాస్టళ్లలోని విద్యార్థులకు కూడా అమలయ్యేలా చూడాలని సూచించారు/

నాడు నేడు పథకం ద్వారా హాస్టళ్లలో పూర్తి వసతులను మార్చేస్తున్నామని తెలిపారు. హాస్టళ్లలోని విద్యార్థులకు కనీస వసతులతో పాటు మంచాలు, దుప్పట్లు, అల్మారాలు, బెడ్లు అందేలా చర్యలు తీసుకోవాలని అన్నారు. నాడు నేడు రెండో దశలో భాగంగా ఈ మార్పులు జరగనున్నాయి. ప్రభుత్వ సొంత భవనాల్లో ఉన్న 4,000 హాస్టళ్లలో నాడు నేడులో భాగంగా హాస్టళ్ల రూపురేఖలు మారనున్నాయి.

రాష్ట్రంలో మొత్తం 4 లక్షల మంది విద్యార్థులు హాస్టళ్లలో ఉన్నారు. ప్రభుత్వం విద్యార్థులకు ప్రయోజనం చేకూరేలా తీసుకుంటున్న నిర్ణయాల పట్ల విద్యార్థుల తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. జగన్ సర్కార్ జగనన్న గోరుముద్దలో భాగంగా విద్యార్థులకు చిక్కీలు, కోడిగుడ్లతో పాటు పౌష్టికాహారం అందే విధంగా చర్యలు తీసుకుంటోంది. అదే మెనూను హాస్టళలో అమలు చేస్తామని జగన్ సర్కార్ చెప్పడం, హాస్టళ్ల రూపురేఖలను మారుస్తానని చెప్పడంతో మునుపటితో పోలిస్తే హాస్టల్ విద్యార్థుల సంఖ్య భారీగా పెరిగే అవకాశం ఉందని విద్యాశాఖ వర్గాలు భావిస్తున్నాయి.