https://oktelugu.com/

తెలంగాణలో బీజేపీ తరఫున జనసేనాని.. రంగంలోకి?

తెలంగాణలో బీజేపీ రోజురోజుకూ పుంజుకుంటోంది అనడంలో ఇప్పుడున్న పరిస్థితులను బట్టి చూస్తే అర్థమవుతోంది. టీఆర్‌‌ఎస్‌కు ప్రత్యామ్నాయ శక్తిగా ఎదుగుతోంది. అధికార పార్టీ తీసుకుంటున్న నిర్ణయాలతో వ్యతిరేకత పెరుగుతోంది. ఇక.. కాంగ్రెస్‌ ఇప్పటికే తన ఉనికిని కోల్పోయింది. ఈ పరిణామాల నేపథ్యంలో తామే దీటైన ప్రతిపక్షంగా ఎదుగుతూ ఫ్యూచర్‌‌లో అధికారంలోకి రావాలని బీజేపీ ప్లాన్‌ చేస్తోంది. తెలంగాణలో బలోపేతం కావడమే లక్ష్యంగా పార్టీ కూడా దూసుకుపోతోంది. Also Read: రైతుల కోసం దేవుడితోనైనా కొట్లాడుతా: కేసీఆర్ సంచలనం కొద్ది […]

Written By:
  • NARESH
  • , Updated On : October 2, 2020 / 08:49 AM IST
    Follow us on

    తెలంగాణలో బీజేపీ రోజురోజుకూ పుంజుకుంటోంది అనడంలో ఇప్పుడున్న పరిస్థితులను బట్టి చూస్తే అర్థమవుతోంది. టీఆర్‌‌ఎస్‌కు ప్రత్యామ్నాయ శక్తిగా ఎదుగుతోంది. అధికార పార్టీ తీసుకుంటున్న నిర్ణయాలతో వ్యతిరేకత పెరుగుతోంది. ఇక.. కాంగ్రెస్‌ ఇప్పటికే తన ఉనికిని కోల్పోయింది. ఈ పరిణామాల నేపథ్యంలో తామే దీటైన ప్రతిపక్షంగా ఎదుగుతూ ఫ్యూచర్‌‌లో అధికారంలోకి రావాలని బీజేపీ ప్లాన్‌ చేస్తోంది. తెలంగాణలో బలోపేతం కావడమే లక్ష్యంగా పార్టీ కూడా దూసుకుపోతోంది.

    Also Read: రైతుల కోసం దేవుడితోనైనా కొట్లాడుతా: కేసీఆర్ సంచలనం

    కొద్ది నెలల క్రితమే తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా అధిష్టానం బండి సంజయ్‌ని నియమించింది. సంజయ్‌ బాధ్యతలు చేపట్టిన తర్వాత ప్రభుత్వంపై దూకుడుగా వ్యవహరిస్తూనే ఉన్నారు. ఎప్పటికప్పుడు ప్రభుత్వాన్ని నిలదీస్తూనే ఉన్నారు. ప్రభుత్వం చేస్తున్న నిర్ణయాలపై పోరాడుతున్నారు. ఇటీవల ప్రభుత్వం తీసుకొచ్చిన ఎల్‌ఆర్‌‌ఎస్‌ మీద కానీ.. కరోనా పై ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ కానీ.. పెద్ద ఎత్తున ఆందోళనలు చేశారు.

    ఇప్పుడు సంజయ్‌కి ప్రధాన టాస్క్‌ ప్రారంభమైంది. రాష్ట్రంలో రానున్న వరుస ఎన్నికలు ప్రతిష్టాత్మకంగా మారాయి. ప్రతీ ఎన్నికలోనూ పార్టీ సత్తా చాటాలని, ఎలాగైనా ఆ సీట్లను తమ ఖాతాలో వేసుకోవాలని బండి సంజయ్ గట్టిగానే ప్రయత్నాలు చేస్తున్నారు. అధికార పార్టీ ప్రభావం ఈ ఎన్నికల్లో ఎక్కువగా కనిపించే అవకాశం ఉండడం, కేసీఆర్, కేటీఆర్ మిగతా మంత్రులు, ఎమ్మెల్యేలందరూ ఈ ఎన్నికలపై దృష్టి పెట్టడంతో, బీజేపీకి కూడా గట్టి పోటీ ఎదురవుతోంది.

    తెలంగాణలో ప్రతిపక్షంగా ఉన్న కాంగ్రెస్ ప్రభావం పెద్దగా కనిపించకపోవడంతో, టీఆర్ఎస్‌కు ప్రత్యామ్నాయం తామే అనే అభిప్రాయం ప్రజల్లోనూ కలగడంతో, తమకు గెలుపు అవకాశాలు ఉన్నాయని, సంజయ్‌ నమ్ముతున్నారు. ఈ ఎన్నికల్లో గెలుపొందితే ఇక బీజేపీకి వచ్చే జనరల్‌ ఎలక్షన్స్‌లో ఢోకా ఉండదు. ఈ ఎన్నికల ప్రభావం సార్వత్రిక ఎన్నికలపై తప్పనిసరిగా ఉంటుందని బీజేపీ నాయకులు కూడా అభిప్రాయపడుతున్నారు.

    ప్రస్తుతం జీహెచ్ఎంసీ ఎన్నికలతోపాటు, దుబ్బాక ఉప ఎన్నికలు జరగబోతున్న నేపథ్యంలో హైదరాబాద్‌ పై స్పెషల్ ఫోకస్‌ పెట్టారు సంజయ్‌. ఈసారి జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో జనసేన సేనానిని ప్రచారానికి దింపాలని యోచిస్తున్నారంట. హైదరాబాద్‌ పరిధిలో పవన్‌కు మంచి పట్టు ఉంది. పెద్ద ఎత్తున ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఇవన్నీ తమకు కలిసి వస్తాయని సంజయ్ నమ్ముతున్నారు. పవన్ కనుక ప్రచారానికి ఒప్పుకుంటే, ఆయన కోరితే జనసేనకు కూడా కొన్ని డివిజన్లను కేటాయించి పోటీకి దింపాలనే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.

    Also Read: హాస్టళ్లలో ఉండే విద్యార్థులకు జగన్ సర్కార్ శుభవార్త..?

    ఇప్పుడు పవన్ సినిమా షూటింగ్‌లలో బిజీగా ఉన్నా, కేంద్ర బీజేపీ పెద్దలు ఎవరైనా ఈ విషయంపై పవన్‌ను ఒప్పిస్తే, ఇక తిరుగు ఉండదు అనేది సంజయ్ ప్లాన్‌గా కనిపిస్తోంది. ఇందులో భాగంగానే త్వరలోనే పవన్ కళ్యాణ్‌ను కలవాలనే ప్రయత్నాల్లో సంజయ్ ఉన్నారట. పవన్ చాలా కాలంగా బీజేపీ అగ్ర నేతలను కలవాలని ప్రయత్నిస్తున్నారు. కేంద్ర బీజేపీ పెద్దల దర్శనమే పవన్‌కు లభించలేదు. ఇప్పుడు వారు పవన్‌ను ప్రచారానికి దిగాలని కోరితే పవన్ ఎలా స్పందిస్తారనేది ఆసక్తిగా మారింది. మరి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సంజయ్‌ చేస్తున్న ఈ ప్లాన్‌ ఎంత వరకు సక్సెస్‌ అవుతుందో చూడాలి.