https://oktelugu.com/

గ్రేటర్లో అంతుచిక్కని ఓటరు నాడి.. టెన్షన్లో నేతలు..!

జీహెచ్ఎంసీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైన నాటి నుంచి గ్రేటర్లో రాజకీయ సందడి మొదలైంది. అధికార.. ప్రతిపక్ష పార్టీలన్నీ పోటాపోటీగా ప్రచారం చేయడం హైదరాబాద్ నగరమంతా జాతరను తలపించింది. రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి నేతలు నగరంలో తిష్టవేసి మరీ కొద్దిరోజులు ప్రచారం చేసిన సంగతి తెల్సిందే..! Also Read: నారాయణ వర్సెస్‌ పువ్వాడ డిసెంబర్ 1న జీహెచ్ఎంసీ ఎన్నికలకు పోలింగ్ జరిగింది. మొత్తం 150స్థానాలకు గాను 149స్థానాల్లో పోలింగ్ పూర్తయింది. మిగిలిన ఒక్కస్థానం(ఓల్డ్ మలక్ పేట్)కు నేడు […]

Written By:
  • Neelambaram
  • , Updated On : December 3, 2020 / 04:08 PM IST
    Follow us on

    జీహెచ్ఎంసీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైన నాటి నుంచి గ్రేటర్లో రాజకీయ సందడి మొదలైంది. అధికార.. ప్రతిపక్ష పార్టీలన్నీ పోటాపోటీగా ప్రచారం చేయడం హైదరాబాద్ నగరమంతా జాతరను తలపించింది. రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి నేతలు నగరంలో తిష్టవేసి మరీ కొద్దిరోజులు ప్రచారం చేసిన సంగతి తెల్సిందే..!

    Also Read: నారాయణ వర్సెస్‌ పువ్వాడ

    డిసెంబర్ 1న జీహెచ్ఎంసీ ఎన్నికలకు పోలింగ్ జరిగింది. మొత్తం 150స్థానాలకు గాను 149స్థానాల్లో పోలింగ్ పూర్తయింది. మిగిలిన ఒక్కస్థానం(ఓల్డ్ మలక్ పేట్)కు నేడు రీ పోలింగ్ జరుగుతోంది. మధ్యాహ్నం 12గంటల వరకు 20శాతం ఓటింగ్ పూర్తయినట్లు తెలుస్తోంది. హైదరాబాద్లోని మిగతా డివిజన్ల మాదిరిగానే ఓల్డ్ మలక్ పేటలోనూ తక్కువ పోలింగ్ శాతమే నమోదయ్యే అవకాశాలు కన్పిస్తున్నాయి.

    అయితే మిగతా 149 డివిజన్లలో పోలైన ఓటింగ్ శాతం చూస్తే ఓటర్లు మాత్రం ఎవరివైపు మొగ్గుచూపారనేది మాత్రం తెలియదు లేదు. జీహెచ్ఎంసీలో కేవలం 45.71శాతం మాత్రమే ఓటింగ్ నమోదైంది. నగరవాసులు ఓటింగ్ పట్ల పెద్దగా ఆసక్తి చూపకలేదని తెలుస్తోంది.

    కేవలం నగర శివార్లలో ఓటింగ్ శాతం ఎక్కువగా నమోదైంది. ఇందులో పేద, మధ్యతరగతి, వృద్ధులు ఓటింగులో ఎక్కువగా పాల్గొనగా సాప్ట్ వేర్ ఉద్యోగులు.. ఉన్నతవర్గాలవారు.. బాగా చదువుకున్న వ్యక్తులు ఈ ఓటింగు దూరంగా ఉన్నట్లు సమాచారం అందుతోంది.

    నగరంలో ఎలాంటి ఎన్నికల జరిగిన కేవలం 50శాతంలోపు ఓటింగ్ ఉంటుంది. తాజాగా జరిగిన జీహెచ్ఎంసీ ఎన్నికల్లోనూ ఆమేరకే ఓటింగ్ శాతం నమోదైంది. ఎక్కడ కూడా భారీ క్యూలైన్లు కన్పించలేదు. ఓటర్లంతా అలా వెళ్లి ఇలా ఓటు వేసి వచ్చారంటే పోలింగ్ సరళి ఎలా జరిగిందో అర్థం చేసుకోవచ్చు.

    Also Read: కవితకు మంత్రి పదవి ఖాయమే.!

    సాయంత్రం 5గంటల వరకు కేవలం 36శాతం వరకు పోలింగ్ నమోదుకాగా చివరి గంటలో 9శాతం నమోదైనట్లు ఎన్నికల అధికారులు ప్రకటించారు. అయితే ఆఖరి గంటలో 9శాతం ఓటింగ్ నమోదవడంపై పలు పార్టీల నేతలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. గతంలో మాదిరిగానే ఓటింగ్ శాతం పోలవడంతో ప్రభుత్వ వ్యతిరేకత ఓటు పెద్దగా పడలేదని అధికార పార్టీ అంచనాలు వేసుకుంటుంది.

    అయితే గతంలో కంటే స్వల్పంగా ఓట్లశాతం పెరగడంతో ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు పడ్డాయని ప్రతిపక్షాలు భావిస్తున్నాయి. అయితే చివర్లో పోలైన 9శాతం ఓటింగ్ అభ్యర్థుల గెలుపోటములపై ప్రభావం చూపనుందని తెలుస్తోంది. ఏదిఏమైనా ఈసారి నగరవాసులు ఎవరికీ ఓటేశారనేది మాత్రం అంతుచిక్కడం లేదు. సాయంత్రం ఎగ్జిట్స్ పోల్స్ రానుండటంతో కొంతమేర క్లారిటీ వచ్చే అవకాశం కన్పిస్తోంది.

    మరిన్ని తెలంగాణ రాజకీయ వార్తల కోసం తెలంగాణ పాలిటిక్స్