https://oktelugu.com/

అమరావతిపై విచారణ.. హైకోర్టులో కీలక వాదనలు

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ నుంచి తెలంగాణ విడిపోయి ఆరేళ్లు దాటింది. అవిభాజ్యం రాష్ట్రంగా వీడిపోయిన ఏపీలో ఇంతవరకు రాజధాని అంశం కొలిక్కి రావడంలేదు. రాష్ట్రం వేరుపడ్డాక మొదటి సారి సీఎం అయిన చంద్రబాబు అమరావతి వేదికగా రాజధానిని ప్రకటించేశారు. ఆయన పెద్దగా అభివృద్ధి చేసిన దాఖలాలు లేవు. తదుపరి అధికారంలోకి వచ్చిన జగన్‌.. చంద్రబాబు నిర్ణయాన్ని పక్కనపెట్టేశారు. ఏకంగా మూడు రాజధానుల అంశాన్ని తెరపైకి తెచ్చారు. ఎప్పుడైతే ఈ నిర్ణయం తీసుకున్నారో అప్పటి నుంచి ఆ కేసు హైకోర్టులో […]

Written By:
  • NARESH
  • , Updated On : October 12, 2020 3:51 pm
    Follow us on

    ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ నుంచి తెలంగాణ విడిపోయి ఆరేళ్లు దాటింది. అవిభాజ్యం రాష్ట్రంగా వీడిపోయిన ఏపీలో ఇంతవరకు రాజధాని అంశం కొలిక్కి రావడంలేదు. రాష్ట్రం వేరుపడ్డాక మొదటి సారి సీఎం అయిన చంద్రబాబు అమరావతి వేదికగా రాజధానిని ప్రకటించేశారు. ఆయన పెద్దగా అభివృద్ధి చేసిన దాఖలాలు లేవు. తదుపరి అధికారంలోకి వచ్చిన జగన్‌.. చంద్రబాబు నిర్ణయాన్ని పక్కనపెట్టేశారు. ఏకంగా మూడు రాజధానుల అంశాన్ని తెరపైకి తెచ్చారు. ఎప్పుడైతే ఈ నిర్ణయం తీసుకున్నారో అప్పటి నుంచి ఆ కేసు హైకోర్టులో నడుస్తూనే ఉంది. ఇంకా కొలిక్కి రావడం లేదు.

    Also Read: అమరావతి ఉద్యమం.. లోకేష్ రెచ్చిపోయాడుగా..!

    తాజాగా.. అమరావతిపై ఏపీ హైకోర్టులో విచారణ ముగిసింది. కానీ.. తదుపరి విచారణను ధర్మాసనం నవంబర్ 2కు వాయిదా వేసింది. మధ్యంతర ఉత్తర్వుల కోసం దాఖలు చేసిన అంతర్గత పిటిషన్‌పై సోమవారం విచారణ పూర్తయ్యింది. వైజాగ్‌లో నిర్మించే గెస్ట్ హౌస్‌ను రాజధానిలో భాగంగా కడుతున్నారా అని… విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, కాకినాడలో గెస్ట్‌హౌస్‌లకు సంబంధించిన పూర్తి వివరాలు అఫిడవిట్‌లో పొందుపర్చలేదని న్యాయవాది గుప్తా ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు.

    విశాఖపట్నంలో ఎంత విస్తీర్ణంలో, ఎన్ని గదులు నిర్మిస్తారన్నది స్పష్టం చేయలేదని తెలిపారు. ప్రభుత్వ నిర్మాణాలకు తమకెలాంటి అభ్యంతరం లేదని.. ప్రభుత్వం నిర్మించబోయే గెస్ట్‌హౌస్‌లు చాలా విశాలమైన ప్రాంతంలో ఉన్నాయని, దానివల్లే అనుమానాలు వస్తున్నాయని తెలిపారు. తాత్కాలికంగా సీఎం క్యాంప్ ఆఫీస్ ఎక్కడైనా ఏర్పాటు చేసుకోవటానికి తమకు ఎటువంటి అభ్యంతరం లేదని పిటిషనర్ తరపు న్యాయవాది గుప్తా కోర్టుకు తెలియజేశారు.

    Also Read: న్యాయవ్యవస్థతో జగన్ ఢీ.. మతలబేంటి? ఏం జరుగనుంది?

    ప్రభుత్వం తరఫున అడ్వొకేట్‌ జనరల్‌ స్పందిస్తూ.. రాజధానిలో భాగంగా వైజాగ్‌లో గెస్ట్ హౌస్ నిర్మాణం చేపట్టడం లేదని తెలిపారు. కాకినాడ, తిరుపతి, విశాఖపట్నంలో అద్దెలు ఎక్కువగా చెల్లించాల్సి వస్తోందన్న కారణంతోనే గెస్ట్ హౌస్ నిర్మాణాలను చేపట్టామని వివరించారు. జనాభా దామాషా ప్రాతిపదికన గెస్ట్‌హౌస్ నిర్మాణాలు చేపడుతున్నామని ధర్మాసనానికి ప్రభుత్వం తరఫున చెప్పారు. ఇరు వాదనలు విన్న హైకోర్టు తదుపరి విచారణను నవంబర్ 2కు వాయిదా వేసింది.