https://oktelugu.com/

అమరావతి భూకుంభకోణం: టీడీపీ నేతలకు ‘సుప్రీం’ నోటీసులు

అమరావతి భూకుంభకోణానికి ఏపీ హైకోర్టు స్టే ఇవ్వగా.. సుప్రీం కోర్టు మాత్రం టీడీపీ నేతలకు షాకిచ్చింది. వారిపై విచారణకు ఏపీ ప్రభుత్వం చేసిన వాదనతో ఏకీభవించింది. తాజాగా ఈ స్కాంలో వివరణ కోరుతూ టీడీపీ నేతలకు నోటీసులు జారీ చేసింది. మరిన్ని ఆంధ్ర రాజకీయ వార్తల కోసం ఏపీ పాలిటిక్స్ అమరావతి భూకుంభకోణంపై దాఖలైన పిటీషన్లను విచారిస్తున్న సుప్రీంకోర్టు గురువారం తెలుగుదేశం పార్టీ నేతలకు నోటీసులు జారీ చేయడం రాష్ట్ర రాజకీయాలను షేక్ చేసింది. వారితోపాటు భూకుంభకోణంపై […]

Written By:
  • NARESH
  • , Updated On : November 5, 2020 / 04:24 PM IST
    Follow us on

    అమరావతి భూకుంభకోణానికి ఏపీ హైకోర్టు స్టే ఇవ్వగా.. సుప్రీం కోర్టు మాత్రం టీడీపీ నేతలకు షాకిచ్చింది. వారిపై విచారణకు ఏపీ ప్రభుత్వం చేసిన వాదనతో ఏకీభవించింది. తాజాగా ఈ స్కాంలో వివరణ కోరుతూ టీడీపీ నేతలకు నోటీసులు జారీ చేసింది.

    మరిన్ని ఆంధ్ర రాజకీయ వార్తల కోసం ఏపీ పాలిటిక్స్

    అమరావతి భూకుంభకోణంపై దాఖలైన పిటీషన్లను విచారిస్తున్న సుప్రీంకోర్టు గురువారం తెలుగుదేశం పార్టీ నేతలకు నోటీసులు జారీ చేయడం రాష్ట్ర రాజకీయాలను షేక్ చేసింది. వారితోపాటు భూకుంభకోణంపై విచారణ జరుపుతున్న ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) కు కూడా నోటీసులు జారీ చేసింది.

    Also Read: టీడీపీపై ‘పచ్చ’పాతం చూపకపోతే సోము వీర్రాజు విలనేనా?

    అమరావతి భూకుంభకోణంపై దర్యాప్తును నిలిపివేస్తూ ఏపీ హైకోర్టు ఇచ్చిన స్టేను ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాల్ చేసిన సంగతి తెలిసిందే. గురువారం ఉదయం విచారణ ప్రారంభం కాగానే సుప్రీం ధర్మాసనం ముందు ఏపీ ప్రభుత్వం తరుఫున సుప్రీం సీనియర్ న్యాయవాది దుష్యంత్ దవే వాదనలు వినిపించారు. ఏపీ కేబినెట్ జూన్ లో అమరావతి కుంభకోణంపై సిట్ ఏర్పాటు చేస్తూ నిర్ణయించిందని.. ఈ విచారణ పారదర్శకంగా సాగుతున్న వేళ దర్యాప్తుపై స్టే ఇవ్వడం సరికాదని దుష్యంత్ సుప్రీం ధర్మసనానికి నివేదించారు. సిట్ దర్యాప్తులో జోక్యం చేసుకోవడం హైకోర్టుకు తగదని.. పారదర్శకంగా సాగుతున్న సిట్ దర్యాప్తును టీడీపీ నేతలు ఉద్దేశపూర్వకంగా అడ్డుకున్నారని దుష్యంత్ వాదించారు.

    Also Read: స్థానిక ఎన్నికలకు గుజరాత్ నై.. ఇక్కడ సై అంట.!

    గతంలో ఇలాంటి కేసుల్లో తీర్పులను ఉదహరించారు. అమరావతి భూకుంభకోణంపై స్టే ఇచ్చే అధికారం రాష్ట్ర హైకోర్టుకు లేదని దుష్యంత్ వాదించారు. ఏపీలో భారీ స్థాయిలో అక్రమాలు జరిగిన అంశాల్లో మాత్రమే విచారణ జరుపుతున్నామని.. హైకోర్టుకు అసాధారణ అధికారాలు లేవని.. సుప్రీం ఆదేశాలకు లోబడి ఉండాల్సిందేనని వెల్లడించారు. ఈ వాదనను బలపర్చే తీర్పులను ఉదహరించారు. దీంతో సుప్రీం కోర్టు దీనిపై కౌంటర్ దాఖలు చేయాలంటూ టీడీపీ నేతలకు, సిట్ కు నోటీసులు జారీ చేసింది. విచారణను నాలుగువారాల పాటు వాయిదా వేసింది.