https://oktelugu.com/

ఆర్ఆర్ఆర్: చరణ్ వర్సెస్ ఎన్టీఆర్.. సరికొత్త ట్విస్ట్.!

దర్శక దిగ్గజం రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న చిత్రం ఆర్ఆర్ఆర్(రౌద్రం రణం రుధిరం). ‘బాహుబలి’ సిరీసుల తర్వాత రాజమౌళి తెరకెక్కిస్తున్న చిత్రం కావడంతో ‘ఆర్ఆర్ఆర్’పై సినీప్రియుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. డీవీవీ దానయ్య ‘ఆర్ఆర్ఆర్’ను భారీ బడ్జెట్లో నిర్మిస్తుండగా కీరవాణి అద్భుతమైన సంగీతాన్ని అందిస్తున్నాడు. మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్ ప్యాన్ ఇండియా మూవీగా రాబోతున్న ‘ఆర్ఆర్ఆర్’లో యంగ్ టైగర్ ఎన్టీఆర్ కొమురంభీంగా.. మెగా పవర్ స్టార్ రాంచరణ్ అల్లూరి సీతరామరాజుగా కన్పించబోతున్నారు. ఇప్పటికే చరణ్.. […]

Written By:
  • NARESH
  • , Updated On : November 5, 2020 / 04:27 PM IST
    Follow us on

    దర్శక దిగ్గజం రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న చిత్రం ఆర్ఆర్ఆర్(రౌద్రం రణం రుధిరం). ‘బాహుబలి’ సిరీసుల తర్వాత రాజమౌళి తెరకెక్కిస్తున్న చిత్రం కావడంతో ‘ఆర్ఆర్ఆర్’పై సినీప్రియుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. డీవీవీ దానయ్య ‘ఆర్ఆర్ఆర్’ను భారీ బడ్జెట్లో నిర్మిస్తుండగా కీరవాణి అద్భుతమైన సంగీతాన్ని అందిస్తున్నాడు.

    మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్

    ప్యాన్ ఇండియా మూవీగా రాబోతున్న ‘ఆర్ఆర్ఆర్’లో యంగ్ టైగర్ ఎన్టీఆర్ కొమురంభీంగా.. మెగా పవర్ స్టార్ రాంచరణ్ అల్లూరి సీతరామరాజుగా కన్పించబోతున్నారు. ఇప్పటికే చరణ్.. ఎన్టీఆర్ టీజర్లు విడుదలై సోషల్ మీడియాలో కొత్త రికార్డులను సృష్టిస్తున్నాయి. ‘ఆర్ఆర్ఆర్’ అనేక వివాదాలు.. ట్వీస్టులతో నిత్యం వార్తల్లో నిలుస్తోంది.

    Also Read: హీరోలు ఇగోకు పోకుండా ఉంటే మంచింది !

    దర్శకుడు రాజమౌళి ‘ఆర్ఆర్ఆర్’లో మరో అదిరిపోయే ట్వీస్టు ఇచ్చేందుకు రెడీ అవుతున్నాడు. వేర్వురు కాలాలకు చెందిన ఇద్దరు దేశభక్తులు కలుసుకుంటే ఎలా ఉంటుందనే ఫాంటసీ నుంచి ‘ఆర్ఆర్ఆర్’ను జక్కన్న రూపొందిస్తున్నాడు. ఈ మూవీలో జలియన్ వాలాబాగ్ ఎపిసోడ్ ఉంటుందనే ప్రచారం జరిగినా అది పుకారే అని తేలింది.

    Also Read: ‘ఆర్ఆర్ఆర్’ ఎఫెక్ట్.. రాంచరణ్ ముందస్తు ప్లాన్..!

    ఈక్రమంలోనే జక్కన్న మరో ట్వీస్టుతో అభిమానులను ఆకట్టుకునేందు రెడీ అవుతున్నాడు. అల్లూరి సీతరామరాజు.. కొమురంభీం మధ్య బిగ్ ఫైట్ ఆకట్టుకునేలా పెడుతున్నాడట. రాంచరణ్, ఎన్టీఆర్ మధ్య నడిచే యాక్షన్స్ సీన్స్ ప్రేక్షకులను మెస్మరైజ్ చేసేలా జక్కన్న తీర్చిదిద్దుతున్నట్లు తెలుస్తోంది. బ్రిటిష్ సైనికులకు వ్యతిరేకంగా ఈ పోరాట సన్నివేశాలు ఉంటాయట. ఈ యాక్షన్ ఎపిసోడ్ ‘ఆర్ఆర్ఆర్’లో హైలట్ నిలుస్తుందనే టాక్ విన్పిస్తోంది.