హైదరాబాద్‌లోని దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జిపై కారు బోల్తా పడింది. మాదాపూర్ నుంచి బంజారాహిల్స్ వెళుతుండగా ఈ ప్రమాదం జరగడంతో కారులో ప్రయాణిస్త్ను వారికి స్వల్ప గాయాలయ్యాయి. ప్రయాణిస్తున్నవారు సురక్షితం కావడంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. అయితే కేబుల్ బ్రిడ్జిపై కొందరు ఇష్టారీతీగా వ్యవహరిస్తున్నారని ఆరోపిస్తున్నారు. సెల్ఫీల పేరిట ప్రమాదంగా ఫొటోలు దిగుతూ హల్‌చల్ చేస్తున్నారు. తాజాగా జరిగిన రోడ్డు ప్రమాదంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. కాగా తెలంగాణ రాష్ట్రంలోని మొట్టమొదటి కేబుల్ బ్రిడ్జి ఇది.