Homeజాతీయ వార్తలుED IT Raids And SIT: ఎడా పెడా కేసులు.. దర్యాప్తు సంస్థలు దారితప్పుతున్నాయా?

ED IT Raids And SIT: ఎడా పెడా కేసులు.. దర్యాప్తు సంస్థలు దారితప్పుతున్నాయా?

ED IT Raids And SIT: తెలంగాణలో ఆధిపత్య రాజకీయ, ప్రతీకార చర్యలు చూస్తుంటే ఈ పరిణామాలు ఎక్కడి వరకు వెళ్తాయో.. ఎవరి కొంప ముగునుగుతుందో అన్న ఆందోళన అటు టీఆర్‌ఎస్‌.. ఇటు బీజే పీ నేతల్లో వ్యక్తమవుతోంది. మంత్రి గంగుల కమలాకర్‌పై ఈడీ దాడులు, క్యాసినో కేసులో మంత్రి తలసాని సోదరులు, మంత్రి పీఏ హరీశ్‌ విచారణ, తాజాగా మంత్రి మల్లారెడ్డిపై ఐటీ దాడులు, మరోవైపు లిక్కర్‌ స్కాం దర్యాప్తు, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీఎల్‌. సంతోష్‌కు సిట్‌ నోటీసులు, బీజేపీ నాయకులకు నోటీసులు, మునుగోడు బీజేపీ అభ్యర్థి రాజగోపాల్‌రెడ్డిపై వాణిజ్య పన్నుల శాఖ దాడులు.. కేసులతో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి.

ED IT Raids And SIT
ED IT Raids And SIT

దర్యాప్తు సంస్థల దుర్వినియోగం..
కేంద్ర, రాష్ట్ర దర్యాప్తు సంస్థలు నమోదు చేస్తున్న కేసుల్లో నేరం ఉందో లేదో ఎవరికీ తెలియదు. దోషులు ఎవరు.. నిర్దోషులు ఎవరు అనేది దర్యాప్తు సంస్థలే నిర్ణయించాలి. కానీ తెలంగాణలో అధికార టీఆర్‌ఎస్, కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ దర్యాప్తు సంస్థలతో ప్రతీకార దాడులు జరుగుతున్నాయన్నది మాత్రం వాస్తవం. ఎన్ని కేసులు నమోదైనా కొన్నేళ్ల తర్వాత అవన్నీ వీగిపోతాయి. గతంలో యూపీఏ ప్రభుత్వ హయాంలో కూడా అనేక కేసులు నమోదయ్యాయి. కానీ అవన్నీ ఇప్పుడు మనుగడలో లేవు. తాజాగా బీజేపీ దర్యాప్తు సంస్థల దాడులు పెంచింది. దీంతో తామేమీ తక్కువ అన్నట్లు టీఆర్‌ఎస్‌ సర్కార్‌ తన దర్యాప్తు సంస్థలతో జాతీయ నేతలపైనే గురిపెట్టింది. ఈ పరిణామాలు చూస్తుంటే దర్యాప్తు సంస్థలను రాజకీయ కక్షసాధింపు కోసం దుర్వినియోగం చేస్తున్నారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

ED IT Raids And SIT
ED IT Raids And SIT

బ్లాక్‌మెయిల్‌ కోసం..
తాజాగా పరిణామాలను చూస్తుంటే… కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆధిపత్యం కోసం దర్యాప్తు సంస్థలతో బ్లాక్‌మెయిల్‌కు పాల్పడుతున్నాయన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇది అత్యంత ప్రమాదకరమని తెలుస్తోంది. ఇలాంటి చర్యలతో దర్యాప్తు సంస్థలు కూడా క్రెడిబులిటీ కోల్పోయే ప్రమాదం ఉందన్న అభిప్రాయం వ్యక్తవుతోంది. ప్రజల విశ్వాసం కోల్పోతో దర్యావ తీవ్ర పరిణామాలు ఎదుర్కొవాల్సి వస్తుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈ పరిణామాలు ఎప్పటికీ మంచిది కాదని పేర్కొంటున్నారు. దర్యాప్తు సంస్థలే దారి తప్పితే.. రాబోయే రోజుల్లో పూర్తిగా కక్షసాధింపు కోసమే వాడుకునే ప్రమాదం ఉంటుందని అంటున్నారు.

Sekhar
Sekhar
Sekhar is an Manager, He is Working from Past 6 Years in this Organization, He Covers News on Telugu Cinema Updates and Looks after the overall Content Management.

Related News

Most Popular

AI Impact On Education

AI Impact On Education: ఏఐతో మూలాలే మటాష్.. పరిస్థితి ఎంతకు దిగజారిందంటే..

AI Impact On Education: ఏఐ తో ఇప్పటివరకు కేవలం ఐటీ ఉద్యోగాలు మాత్రమే పోయాయని అనుకున్నాం. ఎంట్రీ లెవెల్.. మిడ్ లెవెల్ ఉద్యోగాలు మాత్రమే మటాష్ అయిపోయాయని మీడియా వార్తల్లో...
Rahul Gandhi Injury

Rahul Gandhi Injury: రాహుల్ రక్తం కళ్ళ చూశారు.. మోడీకి ఇది మైనస్సే

Rahul Gandhi Injury: మల్లికార్జున కార్గే నిన్న తన పుట్టినరోజు జరుపుకున్నారు.. ఆయనకు శుభాకాంక్షలు తెలియజేయడానికి కాంగ్రెస్ పార్టీ నాయకులు వెళ్లారు.. పోలీసులు కూడా వారి కేవలం శుభాకాంక్షలు తెలియజేయడానికి మాత్రమే వెళ్తున్నారని...
Ishan Kishan

Ishan Kishan: ఐపీఎల్ లో పరుగుల వరద పారించాడు.. జాతీయ జట్టులో తేలిపోతున్నాడు.. ఇలా అయితే కష్టమే..

Ishan Kishan: అప్పట్లో దూకుడుగా బ్యాటింగ్ చేసేవాడు. వన్డేలో అతడికి డబుల్ సెంచరీ కూడా ఉంది. ఈ స్థాయిలో ఆడిన అతడు స్థిరత్వాన్ని కొనసాగించలేకపోయాడు. దీనికి తోడు క్రమశిక్షణలోపించడంతో జట్టులో స్థానం...
Vijayendra Prasad

Vijayendra Prasad: రాజమౌళి కి నచ్చినట్టుగా కథ రాయడం చాలా కష్టం అంటున్న విజయేంద్రప్రసాద్… ఆయన అడిగేవి ఇవే…

Vijayendra Prasad: తెలుగు సినిమా ఇండస్ట్రీలో దర్శకుడిగా తన కెరియర్ ను మొదలుపెట్టిన రాజమౌళి ఆ తర్వాత పాన్ ఇండియా పరిధిని టచ్ చేస్తూ ప్రేక్షకులోకాన్ని అలరిస్తున్నాడు. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రేక్షకులందరిని...
Mahesh Babu

Mahesh Babu: మహేష్ బాబు కి నచ్చినట్టుగా సినిమాను తీయలేకపోయిన దర్శకులు వీళ్లే…

Mahesh Babu: సూపర్ స్టార్ కృష్ణ నట వారసుడిగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన మహేష్ బాబు చాలా తక్కువ సమయంలోనే స్టార్ హీరోగా మారిపోయాడు. తనదైన రీతిలో సత్తా చాటుకుంటూ యావత్...
Oktelugu Epaper