Amrapali telangana collector
యువ ఐఏఎస్ ఆఫీసర్, కేంద్ర హోం శాఖ సహాయమంత్రి కిషన్ రెడ్డి వ్యక్తిగత కార్యదర్శి అమ్రపాలికి అరుదైన అవకాశం దక్కింది. ఏ బాధ్యతలు చేపట్టినా అక్కడ తనదైన ముద్ర వేసుకునే ఆమ్రపాలికి కేంద్రం కీలక అవకాశం కల్పించింది. పీఎంవోలో డిప్యూటీ సెక్రటరీగా నియమించింది. పీఎంవోలో తాజాగా నియమితులైన ముగ్గురు ఐఏఎస్‌ల జాబితాలో ఆమె స్థానంకు స్థానం లభించింది. రఘురాజ్ రాజేంద్రన్, ఆమ్రపాలి, మంగేష్ గిల్డియాల్ అనే ముగ్గురు ఐఏఎస్ అధికారుల నియామకాలను కేబినెట్ నియామక కమిటీ క్లియర్ చేసింది.
Also Read: చంద్రబాబుకు ఆప్తుడు బొల్లినేనిపై సీబీఐ కేసు
మధ్యప్రదేశ్ కేడర్‌కు చెందిన రఘురాజ్ రాజేంద్రన్‌ను డైరెక్టర్‌గా, ఆంధ్రప్రదేశ్ కేడర్‌లోని ఆమ్రపాలిని డిప్యూటీ సెక్రటరీగా, ఉత్తర ప్రదేశ్ కేడర్‌కు చెందిన మంగేష్ గిల్దియాల్‌ను అండర్ సెక్రటరీగా నియమించారు. కేబినెట్ నియామక కమిటీకి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అధ్యక్షత వహిస్తారు. హోంశాఖ మంత్రి అమిత్ షా దానికి గౌరవ సభ్యుడుగా వ్యవహరిస్తారు. ఆమ్రపాలి 2023 అక్టోబర్ 27 వరకు ప్రధాని కార్యాలయంలో విధులు నిర్వహించాల్సి ఉంటుంది. కాగా.. అతి చిన్న వయసులోనే ఈ పోస్టులో నియమితులైన అతికొద్ది మందిలో ఆమ్రపాలి నిలిచారు.
Also Read: పవన్ విశాఖలో అడుగుపెడితే ఏమవుతుంది?
ఆమ్రపాలి 1982, నవంబర్ 4న ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నంలో కాట వెంకట్ రెడ్డి, పద్మావతి దంపతులకు జన్మించింది. ఆమె తండ్రి రిటైర్డ్ ప్రొఫెసర్. 2010 బ్యాచ్ ఏపీ క్యాడర్ ఐఏఎస్ ఆఫీసర్ అయిన ఆమె 2011 బ్యాచ్ ఐపీఎస్ ఆఫీసర్ సమీర్ శర్మను వివాహం చేసుకుంది. ఆమె వికారాబాద్ సబ్ కలెక్టర్, రంగారెడ్డి జిల్లా జాయింట్ కలెక్టర్‌గా, వరంగల్ అర్బన్ జిల్లా కలెక్టర్‌గా, తెలంగాణ ఎన్నికలకు సంయుక్త సీఈవోగా పనిచేశారు. ప్రస్తుతం కేంద్ర హోంమంత్రి జి కిషన్ రెడ్డి వ్యక్తిగత కార్యదర్శిగా పనిచేస్తున్నారు.