ట్రంప్ వర్సెస్ టిక్ టాక్.. చివరికీ ఏమవుతుంది?

చైనాకు చెందిన టిక్ టాక్ కంపెనీ కొన్నినెలలుగా ఇబ్బందులు ఎదుర్కొంటోంది. భారత్-చైనా ఘర్షణ చివరికీ టిక్ టాక్ మెడకు చుట్టుకుంది. గాల్వానా లోయలో చైనా దురాక్రమణకు నిరసనగా భారత్ ధీటుగా స్పందించింది. దీనిలో భాగంగా భారత్ లో చైనాకు చెందిన పలు కాంట్రాక్టులు, 59యాప్స్ నిషేధించింది. దీనిలో ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందిన టిక్ టాక్ యాప్ కూడా ఉంది. Also Read: ఆక్స్ ఫర్డ్ వ్యాక్సిన్ క్లినికల్ ట్రయల్న్ మళ్లీ స్టార్ట్ కేంద్రం టిక్ టాక్ […]

Written By: NARESH, Updated On : September 13, 2020 5:13 pm

Trump tick talk

Follow us on

చైనాకు చెందిన టిక్ టాక్ కంపెనీ కొన్నినెలలుగా ఇబ్బందులు ఎదుర్కొంటోంది. భారత్-చైనా ఘర్షణ చివరికీ టిక్ టాక్ మెడకు చుట్టుకుంది. గాల్వానా లోయలో చైనా దురాక్రమణకు నిరసనగా భారత్ ధీటుగా స్పందించింది. దీనిలో భాగంగా భారత్ లో చైనాకు చెందిన పలు కాంట్రాక్టులు, 59యాప్స్ నిషేధించింది. దీనిలో ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందిన టిక్ టాక్ యాప్ కూడా ఉంది.

Also Read: ఆక్స్ ఫర్డ్ వ్యాక్సిన్ క్లినికల్ ట్రయల్న్ మళ్లీ స్టార్ట్

కేంద్రం టిక్ టాక్ యాప్ సహా చైనాకు చెందిన పలు యాప్స్ ను నిషేధించి ఆ దేశంపై ఒత్తిడి తీసుకొచ్చింది. చైనాను ఆర్థికంగా దెబ్బకొట్టే వ్యూహాంలోనే భాగంగా భారత్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే భారత్ చైనా వస్తువుల వాడాకాన్ని తగ్గించారు. టిక్ టాక్ యాప్ ను భారత్ నిషేధించడంతో చైనాకు పెద్దఎత్తున ఆర్థిక నష్టం వాటిల్లినట్లు తెలుస్తోంది.

భారత్ టిక్ టిక్ యాప్ నిషేధించిన తర్వాత పలు దేశాలు అదేబాటలో నడిచాయి. టిక్ టాక్ ను భారత్ నిషేధించడాన్ని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సైతం స్వాగతించారు. టిక్ టాక్ వల్ల అమెరికా పౌరుల భద్రతకు ప్రమాదం ఉంచి ఉందనే కారణంతో అమెరికాలో టిక్ టాక్ యాప్ ను నిషేధించేందుకు ట్రంప్ గడువు పెట్టారు. సెప్టెంబర్ 15లోపు టిక్ టాక్ ను అమెరికా కంపెనీకి విక్రయించాలని లేకుంటే నిషేధిస్తామంటూ ట్రంప్ గడువు విధించాడు.

Also Read: చెలిమి అంటూనే చైనా దొంగదెబ్బ తీస్తోందా?

ట్రంప్ ఇంతకముందే ఒకసారి టిక్ టాక్ కు ఇచ్చిన గడువు పొడగించారు. ఇక మరోసారి పొడగించేది లేదని స్పష్టం చేశారు. దీంతో టిక్ టాక్ నిర్వాహకులు అమెరికా కార్యకలాపాలు చేయడం కంటే మూసివేయడమే మంచిదని భావిస్తున్నారట. అమెరికా పెట్టిన షరతులు తలొగ్గితే తాము భయపడినట్లు అవుతుందని చైనా భావిస్తుందట. దీంతో టిక్ టాక్ యాజమాన్యానికి ట్రంప్ కండిషన్లకు ఒప్పుకోవద్దని సూచించిందని సమాచారం. దీనిపై టిక్ టాక్ యాజమాన్యం స్పందిస్తూ చైనా ప్రభుత్వం తమకు ఎలాంటి సలహాలు ఇవ్వలేదని చెబుతోంది. ఈ నేపథ్యంలో చైనా అమెరికా షరతులు తలొగ్గుతుందా? లేదా అనేది వేచి చూడ్సాందే..!