Homeజాతీయ వార్తలుYoung Mother Of Five Kids Viral Story: వయసు 22 సంవత్సరాలు.. ఐదుగురు పిల్లల.తల్లి.....

Young Mother Of Five Kids Viral Story: వయసు 22 సంవత్సరాలు.. ఐదుగురు పిల్లల.తల్లి.. మరో బాబు కావాలట

Young Mother Of Five Kids Viral Story: ఎప్పుడు జరగాల్సిన ముచ్చట అప్పుడే పూర్తి కావాలి. కానీ ఆమెకు ఆ ముచ్చట ఎటు కానీ వయసులో జరిగిపోయింది.. చూస్తుండగానే ఆమె ఐదు సార్లు తల్లి అయిపోయింది. కానీ ఇప్పుడు ఒక చిక్కు వచ్చి పడింది. దీంతో ఆమె వ్యవహారం దేశ వ్యాప్తంగా సంచలనంగా మారింది. ఆమెకు 22 సంవత్సరాలు. ఉండేది రాజస్థాన్ రాష్ట్రంలో. ఆమెకు చిన్నతనంలోనే వివాహం జరిగింది. తొలి కాన్పులో ఆడపిల్ల జన్మించింది. రెండవ […]

Young Mother Of Five Kids Viral Story: ఎప్పుడు జరగాల్సిన ముచ్చట అప్పుడే పూర్తి కావాలి. కానీ ఆమెకు ఆ ముచ్చట ఎటు కానీ వయసులో జరిగిపోయింది.. చూస్తుండగానే ఆమె ఐదు సార్లు తల్లి అయిపోయింది. కానీ ఇప్పుడు ఒక చిక్కు వచ్చి పడింది. దీంతో ఆమె వ్యవహారం దేశ వ్యాప్తంగా సంచలనంగా మారింది.

ఆమెకు 22 సంవత్సరాలు. ఉండేది రాజస్థాన్ రాష్ట్రంలో. ఆమెకు చిన్నతనంలోనే వివాహం జరిగింది. తొలి కాన్పులో ఆడపిల్ల జన్మించింది. రెండవ కాన్పులో కూడా అమ్మాయి పుట్టింది. మూడు, నాలుగు కాన్పుల్లో కూడా ఆమెకు అమ్మాయిలు పుట్టారు.. అత్తింటి వారు వారసుడు కావాలని ఆమెకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయించలేదు.. దీంతో ఐదవ కాన్పులో ఆమెకు బాబు జన్మించాడు. అయితే ఇప్పుడు అత్తింటి వారు సరికొత్త డిమాండ్ తెరపైకి తీసుకొచ్చారు. ఒక బాబు మాత్రమే వారికి సరిపోడట. వాళ్లకు ఇప్పుడు మరొక బాబు కూడా కావాలట.

ఇదే విషయాన్ని ఆసుపత్రి సిబ్బందికి చెబితే వారు ఆ గ్రహం వ్యక్తం చేశారు. ఆమె భర్త తీరు పట్ల మండిపడ్డారు..”ఆమెను బాల్య వివాహం చేసుకున్నావు. ఇప్పటికే అయిదుగురికి జన్మనిచ్చింది. 22 సంవత్సరాల వయసులో ఆమె ఐదుగురు పిల్లల తల్లి అంటే మామూలు విషయం కాదు. మరో గర్భం దాల్చితే ఆమె ఆరోగ్యానికి ప్రమాదం. దయచేసి ఇంకో బాబు కోసం ఆమె ఇబ్బంది పెట్టకూడదు.. ఇంతటితోనే దీనిని ఆపేయండి. లేకపోతే ఆమె ఆరోగ్య పరంగా అనేక సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఆరవసారి గర్భం దాల్చే అవకాశాన్ని దాదాపు విరమించుకోండి” అని ఆస్పత్రి సిబ్బంది చెప్పారు.. అయితే ఆసుపత్రి సిబ్బంది చెప్పినప్పటికీ ఆ మహిళ భర్త తరపు కుటుంబం మరో వారసుడు కావాలని చెప్పడం ఇక్కడ విశేషం.

పరిపక్వత రాని వయసులో వివాహాలు చేస్తే ఆడవాళ్ళ అంతర్గత ఆరోగ్యం తీవ్రంగా ప్రభావితం అవుతుంది. అదే సమయంలో వారు పిల్లలకు జన్మనిస్తే మరింత ఇబ్బందికరమైన పరిస్థితిలను ఎదుర్కోవాల్సి వస్తుంది. అందువల్లే ఆడపిల్లలు 21 సంవత్సరం దాటిన తర్వాతే పెళ్లి చేయాలని వైద్యులు చెబుతున్నారు. చిన్నతనంలో పెళ్లి చేస్తే చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని వారు హెచ్చరిస్తున్నారు.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

Oktelugu Epaper