Hawala Money Seized Hyderabad: హైదరాబాద్ నగరంలో హవాలా డబ్బు బయటపడుతోంది. గత వారం రోజుల వ్యవధిలో కోట్ల కొలది డబ్బు వెలుగు చూడటం సంచలనం సృష్టిస్తోంది. లెక్కల్లో లేని డబ్బు వెలుగు చూస్తోంది. కోట్లకొలది డబ్బు దొరకడంతో నేతల్లో కంగారు పుడుతోంది. ఇటీవల యూపీకి చెందిన ఓ ఇనుప సామను వ్యాపారి వద్ద రూ. 1.24 కోట్లు బయటపడటంతో హవాలా డబ్బుపై దృష్టి సారించారు. తాజాగా రూ. 10 వేల కోట్ల కుంభకోణాన్ని చేధించడం సంచలనం కలిగిస్తోంది. దీనికి కారణమైన పదిమందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

మునుగోడు ఉప ఎన్నిక నేపథ్యంలో హవాలా డబ్బు బయటకు వస్తోంది. ఇందులో భాగంగానే కొంతమందిని అనుమానితులను అరెస్టు చేస్తున్నారు. ఇందులో చైనీస్ వారు కూడా ఉండటం ఆందోళన కలిగిస్తోంది. అసలు ఈ కుంభకోణాల్లో చైనీయుల ప్రమేయం ఏంటనే ప్రశ్నలు కూడా వస్తున్నాయి. ఇద్దరు చైనీస్ ఫ్రాడ్ ఇన్వెస్ట్ మెంట్ పెట్టుబడుల కేసుల్లో వీరు ఉన్నట్లు చెబుతున్నారు. హవాలా డబ్బు ఎల్లలు దాటి వస్తోందనే ఆరోపణలు కూడా వస్తున్నాయి. ఈ క్రమంలో కుంభకోణాల పరంపరలో ఇంకా వెలుగు చూడని ఎన్నో విషయాలు దాగున్నాయనే వాదన వస్తోంది.
రాష్ట్రంలో హవాలా రూపంలో డబ్బు విచ్చలవిడిగా చలామణిలోకి తీసుకురావాలని చూస్తున్నారు. మునుగోడు ఉప ఎన్నికలో ఓటర్లను ప్రభావితం చేసేందుకు డబ్బు పంపిణీకి అన్ని పార్టీలు రెడీ అయినట్లు తెలుస్తోంది. నవంబర్ 3న మునుగోడు ఉప ఎన్నిక ఉన్న సందర్భంలో డబ్బులు పంచాలని రాజకీయ పార్టీలు భావిస్తున్నాయి. ఇందులో భాగంగానే హవాలా డబ్బును సరఫరా చేయాలని చూస్తున్నాయి. ఈ నేపథ్యంలో హైదరాబాద్ సిటీ పోలీసులు హవాలా డబ్బును పట్టుకునే క్రమంలో రూ. పదివేల కోట్లు బయట పడటం సంచలనం సృష్టిస్తోంది.

దేశంలో కూడా హవాలా డబ్బు పెద్ద మొత్తంలోనే చలామణి అవుతున్నట్లు చెబుతున్నారు. దీంతో ఉప ఎన్నికలు జరిగే సమయంలో హవాలా డబ్బు వెలుగులోకి రావడం మామూలే. కానీ ఇంత భారీ మొత్తంలో డబ్బు దొరకడం ఆందోళన కలిగిస్తోంది. లెక్కల్లో లేని డబ్బు బంజారాహిల్స్ లో నేడు పట్టుకోవడం తెలిసిందే. ఈ క్రమంలో హవాలా సొమ్ము భారీ మొత్తంలో సరఫరా చేసేందుకు రెడీ అవుతున్నట్లు చెబుతున్నారు. ఓటర్లను ప్రసన్నం చేసుకుని ఎలాగైనా గెలవాలనే ఉద్దేశంతో పార్టీలు సమాయత్తం అయినట్లు సమాచారం. గతంలో హుజురాబాద్ ఉప ఎన్నికలో దాదాపు రూ.600 కోట్లు ఖర్చు చేసినట్లు ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పుడు మునుగోడులో కూడా అదే విధంగా హవాలా సొమ్మును పంపిణీ చేసి ఓట్లు రాబట్టుకోవాలని చూస్తున్నట్లు చెబుతున్నారు.