Homeఅంతర్జాతీయంGen Z challenges: పాపం జెన్‌ జెడ్‌.. నాలుగు అసాధారణ సవాళ్లు వాళ్లకే!

Gen Z challenges: పాపం జెన్‌ జెడ్‌.. నాలుగు అసాధారణ సవాళ్లు వాళ్లకే!

Gen Z challenges: జెన్‌ జెడ్‌.. జనరేషన్‌ జెడ్‌.. ఇటీవలికాలంలో ఎక్కువగా ప్రచారంలో ఉన్న పదం ఇదే. ప్రపంచ వ్యాప్తంగా ఎక్కడ ఏ ఉద్యమం జరిగినా దానివెనుక జెన్‌ జెడ్‌ ఉండడమే కారణం. అసలు జెన్‌ జెడ్‌ కారణంగానే ఉద్యమాలు ఎగిసిపడుతున్నాయి. ప్రభుత్వాలు కూలుతున్నాయి… పాలకులు మారుతున్నారు. శ్రీలంకలో పాలకులకు వ్యతిరేకంగా మొదలైన ఉద్యమంతో వెలుగులోకి వచ్చిన ఈ జెన్‌జెడ్‌.. గతేడాది నేపాల్‌ పాలకులను గద్దె దించే వరకూ సాగిన ఉద్యమం వరకూ అన్నింటిలోనూ జెన్‌ జెడ్‌ […]

Gen Z challenges: జెన్‌ జెడ్‌.. జనరేషన్‌ జెడ్‌.. ఇటీవలికాలంలో ఎక్కువగా ప్రచారంలో ఉన్న పదం ఇదే. ప్రపంచ వ్యాప్తంగా ఎక్కడ ఏ ఉద్యమం జరిగినా దానివెనుక జెన్‌ జెడ్‌ ఉండడమే కారణం. అసలు జెన్‌ జెడ్‌ కారణంగానే ఉద్యమాలు ఎగిసిపడుతున్నాయి. ప్రభుత్వాలు కూలుతున్నాయి… పాలకులు మారుతున్నారు. శ్రీలంకలో పాలకులకు వ్యతిరేకంగా మొదలైన ఉద్యమంతో వెలుగులోకి వచ్చిన ఈ జెన్‌జెడ్‌.. గతేడాది నేపాల్‌ పాలకులను గద్దె దించే వరకూ సాగిన ఉద్యమం వరకూ అన్నింటిలోనూ జెన్‌ జెడ్‌ కీలకపాత్ర పోషించింది. అయితే ఈ జెన్‌జెడ్‌ ప్రపంచంలో ఇప్పటి వరకు ఎవరికీ ఎదురుకాని సవాళ్లు ఎదరవుతున్నాయి. ఇప్పటికే నాలుగు కీలక సవాల్లు ఎదుర్కొన్నారు.

జెన్‌జెడ్‌ అంటే..
జెన్‌ జెడ్‌ అంటే 1997 నుంచి 2012 వరకు పుట్టిన యువతరం. ఇది మిలీనియల్స్‌ తర్వాత వచ్చిన తరం, డిజిటల్‌ టెక్నాలజీలో పెరిగిన మొదటి తరంగా పిలువబడుతుంది. స్మార్ట్‌ఫోన్‌లు, సోషల్‌ మీడియా కాలంలో జన్మించిన వీరు డిజిటల్‌ నేటివ్స్‌. కోవిడ్‌ లాక్‌డౌన్‌లు, క్లైమేట్‌ చేంజ్, ఆర్థిక అనిశ్చితి వంటి సంక్షోభాల్లో పెరిగారు. ఇది వారిని మానసిక ఆరోగ్యం, సస్టైనబిలిటీకి ఆకర్షితులను చేసింది. ఉద్యోగాల్లో ఏఐతో పోటీ, గిగ్‌ ఎకానమీ(ఫ్రీలాన్స్‌) ప్రాధాన్యం. సంబంధాల్లో స్వేచ్ఛ, విడాకుల రేటు ఎక్కువ వంటి ప్రధాన సవాళ్లు ఎదుర్కొంటోంది.

కోవిడ్‌ కారణంగా ఆన్‌లైన్‌ విప్లవం..
కోవిడ్‌ 19 కారణంగా విధించిన లాక్‌డౌన్‌లు జెన్‌ జెడ్‌ పాఠశాల జీవితాన్ని పూర్తిగా మలుపు తిప్పాయి. జూమ్‌ క్లాసులు, వర్చువల్‌ అసైన్‌మెంట్‌లు సాధారణమై, సామూహిక చర్చలు తగ్గాయి. ఇది మానసిక ఒంటరితనాన్ని పెంచి, డిజిటల్‌ లెర్నింగ్‌పై ఆధారపడేలా మార్చింది. వ్యక్తిగత అభ్యాస పద్ధతులు, షార్ట్‌ వీడియోలు (టిక్‌టాక్, యూట్యూబ్‌) వారి అభ్యాసాన్ని వేగవంతం చేశాయి, కానీ శారీరక ఆరోగ్య సమస్యలు (స్క్రీన్‌ టైం ఎక్కువ) తలెత్తాయి.

Also Read: మేఘాలయలో చొరబాటు.. స్థానికులపై అఘాయిత్యం.. ఏం జరిగిందంటే?

ఆర్థిక అనిశ్చితి..
ఇక పెద్ద అవుతున్న సమయంలో ఆర్థిక మాంద్యాలు, వాతావరణ మార్పులు, రాజకీయ ఘర్షణలు వారిని కలవరపరిచాయి. ఇది మానసిక ఆరోగ్యానికి (ఆంక్ష, డిప్రెషన్‌) ప్రాధాన్యత ఇచ్చేలా మార్చింది. సామాజిక న్యాయం, సస్టైనబిలిటీకి మద్దతు ఇచ్చి, ఫినాన్షియల్‌ ఇండిపెండెన్స్‌పై దృష్టి పెట్టారు. సోషల్‌ మీడియా ద్వారా గ్లోబల్‌ సమస్యలు తెలుసుకుని, యాక్టివిజం (క్లైమేట్‌ స్ట్రైక్‌లు)లో పాల్గొన్నారు.

కెరీర్‌లో ఏఐతో పోటీ..
ఇక చదువులు పూర్తిచేసి ఉద్యోగాల వేటలో పడ్డాక కృత్రిమ మేధస్సు(ఆర్టిఫీషియల్‌ ఇంటెలిజెన్స్‌)రొటీన్‌ జాబ్‌లను ఆక్రమిస్తోంది. జెన్‌ జెడ్‌ కోడింగ్, క్రియేటివ్‌ కంటెంట్, గ్రీన్‌ టెక్‌ వంటి ఏఐ–రెసిస్టెంట్‌ స్కిల్స్‌ నేర్చుకుంటోంది. గిగ్‌ ఎకానమీ (ఫ్రీలాన్స్‌), స్టార్టప్‌లలో అవకాశాలు వెతుకుతూ, వర్క్‌–లైఫ్‌ బ్యాలెన్స్‌కు ప్రాధాన్యత ఇస్తున్నారు. 70 శాతం మంది జెన్‌ జెడ్‌ ఉద్యోగ మార్పులు ఏఐ కారణంగా ఇబ్బంది పడుతున్నారు.

పెళ్లి దశలో.. విడాకుల యుగం
ఇక ఎలాగో ఒకలా ఉద్యోగం సంపాదించి వివాహం చేసుకుందామనుకునే దశలో వివాహాల్లో విడాకుల రేటు పీక్స్‌కు చేరింది. ఎందుకంటే జెన్‌ ో సంబంధాల్లో సమానత్వం, మెంటల్‌ కనెక్షన్, స్వేచ్ఛను కోరుకుంటున్నారు. సంప్రదాయ వివాహాలకు బదులు లివింగ్‌–టుగెదర్, చైల్డ్‌ఫ్రీ లైఫ్‌స్టైల్‌ ఎంచుకుంటూ, డేటింగ్‌ యాప్‌లతో ఎక్స్‌పెరిమెంట్‌ చేస్తున్నారు. 50% మంది వివాహాన్ని ఆలస్యం చేస్తున్నారు.

మొత్తంగా ఈ నాలుగు దశలు జెన్‌ జెడ్‌ని టెక్‌–సావీ, రెసిలియెంట్‌ తరంగా తీర్చిదిద్దాయి. వారు సాంకేతిక ప్రగతి, వ్యక్తిగత విలువలతో భవిష్యత్తును ఆకారం ఇస్తున్నారు. జీవన గమ్యాన్ని మాత్రం చేరుకోవడం లేదు.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.

Related News

Most Popular

Oktelugu Epaper