బాబుకు షాక్..జగన్ తో టచ్ లో 10మంది ఎమ్మెల్యేలు

టీడీపీ దుకాణం ఖాళీ కాబోతోంది. ఈ మాటలు అన్నది ఎవరో వైసీపీ నేతలు కాదు.. తెలుగుదేశం పార్టీలో తలపండిన సీనియర్ .. అవును. ఏపీ సీఎం జగన్ పనితీరుకు టీడీపీ ఎమ్మెల్యేలు ఆకర్షితులవుతున్నారని.. ఇప్పటికే 10-12మంది టీడీపీ ఎమ్మెల్యేలు వైసీపీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారని చీరాల ఎమ్మెల్యే కరణం బలరాం సంచలన వ్యాఖ్యలు చేశారు. 10మంది వస్తారా లేక 12మంది వస్తారా అన్న సంఖ్య ఇప్పుడే చెప్పలేమని ఆయన బాంబు పేల్చారు. ప్రకాశం జిల్లా నుంచి కూడా […]

Written By: NARESH, Updated On : June 8, 2020 4:29 pm
Follow us on


టీడీపీ దుకాణం ఖాళీ కాబోతోంది. ఈ మాటలు అన్నది ఎవరో వైసీపీ నేతలు కాదు.. తెలుగుదేశం పార్టీలో తలపండిన సీనియర్ .. అవును. ఏపీ సీఎం జగన్ పనితీరుకు టీడీపీ ఎమ్మెల్యేలు ఆకర్షితులవుతున్నారని.. ఇప్పటికే 10-12మంది టీడీపీ ఎమ్మెల్యేలు వైసీపీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారని చీరాల ఎమ్మెల్యే కరణం బలరాం సంచలన వ్యాఖ్యలు చేశారు. 10మంది వస్తారా లేక 12మంది వస్తారా అన్న సంఖ్య ఇప్పుడే చెప్పలేమని ఆయన బాంబు పేల్చారు.

ప్రకాశం జిల్లా నుంచి కూడా పలువురు టీడీపీ ఎమ్మెల్యేలు వైసీపీలోకి చేరుతున్నారన్న సమాచారం ఉందన్నారు కరణం బలరాం. దీనికి కొంత సమయం పడుతుందని వివరించారు. ప్రకాశం జిల్లాకు చెందిన టీడీపీ ఎమ్మెల్యేల ప్రధాన వ్యాపారంపై తాజాగా జగన్ టాస్క్ ఫోర్స్ దాడులతో అక్కడ టీడీపీ ఎమ్మెల్యేల్లో వణుకు మొదలైంది. ఈ క్రమంలోనే వారంతా పార్టీ మారాలని యోచిస్తున్నట్టు తెలుస్తోంది.

ప్రధానంగా టీడీపీ ఎమ్మెల్యేలు పార్టీ మారడానికి వారి ఆర్థిక అవసరాలే ప్రమాణికంగా ఉన్నాయనడంలో ఎలాంటి సందేహం లేదంటున్నారు రాజకీయ విశ్లేషకులు. గ్రానైట్ సహా పలు వ్యాపారాల్లో ఉన్న వారిపై జగన్ ప్రభుత్వం నజర్ పెట్టడంతో చేసేదేం లేక వైసీపీ ప్రభుత్వంలోకి చేరుతున్నారని అంటున్నారు.

ప్రధానంగా జగన్ అద్భుతమైన సంక్షేమ పాలనకు ఆకర్షితులవుతున్నారని.. ప్రతిపక్షంలో టీడీపీ ఎమ్మెల్యేలకు సపోర్టు లేక బెంబేలెత్తిపోవడంతోపాటు చంద్రబాబు నిర్లక్ష్యం వల్ల కూడా టీడీపీ ఎమ్మెల్యేలు పార్టీ మారుతున్నారని టీడీపీ సీనియర్ నేత కరణం ఆరోపించారు.

చంద్రబాబు పోకడకి.. జగన్ వ్యవహారశైలికి చాలా తేడా ఉందని.. నమ్ముకున్న వాళ్లకి సీఎం జగన్ న్యాయం చేస్తారని ప్రశంసించారు.వెలిగొండ ప్రాజెక్టు విషయంలో చంద్రబాబు నిర్లక్ష్యం చేశారని.. టీడీపీ ప్రభుత్వంపై ఎంత ఒత్తిడి తెచ్చినా పూర్తి చేయలేదని కరణం బలరాం తాజాగా ఆరోపించారు. టీడీపీ ఎమ్మెల్యేలు ఎక్కువగా వస్తే చంద్రబాబుకు ప్రతిపక్ష హోదా పోతుందనే మమ్మల్ని రమ్మనలేదని కరణం సంచలన వ్యాఖ్యలు చేశారు. వైఎస్ఆర్ తో కూడా తనకు సన్నిహిత సంబంధాలున్నాయని ఆయన గుర్తు చేశారు.