https://oktelugu.com/

తిరుమలలో ట్రయల్ రన్ ప్రారంభం..!

కేంద్రం రాష్ట్ర ప్రభుత్వం లాక్డౌన్ సడలింపుల్లో భాగంగా నేటి నుంచి దేవాలయాలు, ప్రార్థనా మందిరాలను అనుమతినిచ్చిన సంగతి తెల్సిందే. దీంతో తెలుగు రాష్ట్రాల్లోని తిరుపతి, యాదాద్రి, వేములవాడ, భద్రాచలం తదితర పలు పుణ్యక్షేత్రాలు నేడు తెరుచుకున్నాయి. ఇందులో భాగంగా సోమవారం తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) ఆధ్వర్యంలో తగిన ఏర్పాట్లు చేశారు. నేడు, రేపు తిరుపతిలో టీటీడీ ఉద్యోగులు, కుటుంబ సభ్యులకు ట్రయల్ రన్ నిర్వహిస్తున్నారు. నేడు ప్రారంభమైన ట్రయల్ దర్శనాలను టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి పరిశీలించి […]

Written By: , Updated On : June 8, 2020 / 04:13 PM IST
Follow us on

కేంద్రం రాష్ట్ర ప్రభుత్వం లాక్డౌన్ సడలింపుల్లో భాగంగా నేటి నుంచి దేవాలయాలు, ప్రార్థనా మందిరాలను అనుమతినిచ్చిన సంగతి తెల్సిందే. దీంతో తెలుగు రాష్ట్రాల్లోని తిరుపతి, యాదాద్రి, వేములవాడ, భద్రాచలం తదితర పలు పుణ్యక్షేత్రాలు నేడు తెరుచుకున్నాయి. ఇందులో భాగంగా సోమవారం తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) ఆధ్వర్యంలో తగిన ఏర్పాట్లు చేశారు. నేడు, రేపు తిరుపతిలో టీటీడీ ఉద్యోగులు, కుటుంబ సభ్యులకు ట్రయల్ రన్ నిర్వహిస్తున్నారు. నేడు ప్రారంభమైన ట్రయల్ దర్శనాలను టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. ట్రయల్ దర్శనంలో భక్తుల సంఖ్యను పెంచే వెసులుబాటు గుర్తించినట్లు ఆయన తెలిపారు. త్వరలోనే భక్తుల సంఖ్య పెంచనున్నామని త్వరలోనే అధికారిక ప్రకటన ఉంటుందని తెలిపారు.

ట్రయల్ దర్శనాలు సక్సస్..
సోమ, మంగళవారాల్లో టీటీడీ ఉద్యోగులతో ట్రయల్ దర్శనాలు నిర్వహిస్తున్నారు. భౌతికదూరం పాటిస్తూ మాస్కులతో అన్ని జాగ్రత్తలు పాటిస్తున్నారు. భక్తులను థర్మల్ స్క్రీనింగ్ తర్వాతే వారిని కొండపైకి అనుమతిస్తున్నారు. దాదాపు మూడు నెలల తర్వాత స్వామివారిని దర్శించుకోవడంతో టీటీడీ ఉద్యోగులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈనెల 10న స్థానిక భక్తులకు అవకాశం కల్పించనున్నారు. 11నుంచి సాధారణ భక్తులను అనుమతించనున్నారు. గంటకు 500 చొప్పున రోజుకు 5నుంచి 6వేల మంది భక్తులకు అవకాశం కల్పించనున్నారు. ఆన్ లైన్లో 3వేల మందికి, నేరుగా మరో 3వేల మందికి సర్వదర్శనం టికెట్లు జారీ చేయనున్నారు

శ్రీవారి దర్శన వేళలు..
ఉదయం 6.30నుంచి సాయంత్రం 7.30 వరకు మాత్రమే భక్తులకు శ్రీవారి దర్శనానికి అనుమతి ఉంటుంది. రాత్రి సమయంలో కర్ఫ్యూ యాథావిధిగా కొనసాగనుంది. దీంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు టీటీడీ పేర్కొంది. కాలినడకన వెళ్లే భక్తులకు అలిపిరి మార్గంలో ఉదయం 5 నుంచి సాయంత్రం నాలుగు వరకే అనుమతి ఉంటుంది. శ్రీవారి మెట్టు మార్గంలో భక్తులకు అనుమతి లేదన్నారు. ఇక ఘాట్‌ రోడ్డులో ఉదయం 5నుంచి రాత్రి 8గంటల వరకు మాత్రమే అనుమతి ఉంటుందని పేర్కొన్నారు.

అలిపిరి వద్ద థర్మల్ స్క్రీనింగ్..
దర్శనాలకు వచ్చే భక్తులకు అలిపిరి చెక్‌పోస్ట్ దగ్గర టీటీడీ సిబ్బందికి థర్మల్ స్క్రీనింగ్ చేయనున్నారు. ర్యాండమ్ శాంపిల్స్ ను సేకరించనున్నారు. వాహనాలను కూడా పూర్తిగా శానిటైజ్ చేయనున్నారు. సరిబేసి సంఖ్యలో ఆన్‌లైన్లో గదులు బుక్ చేసుకునే అవకాశం ఉందని.. గదికి ఇద్దరి చొప్పున మాత్రమే అనుమతి ఉంటుందని టీటీడీ స్పష్టం చేసింది. అదేవిధంగా కల్యాణ కట్ట, శ్రీవారి హుండీ, లడ్డూ కౌంటర్ల వద్ద ప్రత్యేకమైన ఏర్పాట్లు చేస్తున్నారు. శ్రీవారి దర్శనం తర్వాత శఠగోపం, తీర్థం లాంటివి ప్రస్తుతానికి ఉండవని.. పుష్కరణిలోకి భక్తులకు అనుమతి ఉండదని టీటీడీ అధికారులు స్పష్టం చేస్తున్నారు. తొలి మూడురోజుల అనంతరం ప్రతి రోజు 15వేల నుంచి 20వేలకు పెంచే అవకాశం ఉందని టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి భక్తులకు శుభవార్త తెలిపారు.