
కేరళ సీఎం పినరయి విజయన్ కూతురు వీణా తయికండియిల్ వివాహం నేడు సాదాసీదాగా జరిగింది. మాజీ ఐపీఎస్ ఆఫీసర్ పీఎం అబ్దుల్ ఖదీర్ కుమారుడు మహమ్మద్ రియాస్‌తో వీణా తయికండియల్ వివాహం తిరువనంతపురంలో జరిగింది. లాక్డౌన్ కారణంగా వధూవరులు స్పెషల్ మార్యేజ్ యాక్ట్ కింద రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. కేరళ సీఎం అధికార నివాసంలో కొద్దిమంది అతిథుల మధ్య వివాహా వేడుక సాదాసీదాగా జరిగింది.
వీణా తయికండియిల్-రియాస్ లకు ఇద్దరికీ కూడా ఇది రెండో పెళ్లికావడం గమనార్హం. వీరిద్దరికి దాదాపుగా 43ఏళ్లు ఉంటాయి. వీణా బెంగుళూర్‌లోని ఓ సాఫ్ట్‌వేర్ కంపెనీని నడిపిస్తున్నారు. ఆమె ప్రస్తుతం ఎక్సాలాజిక్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్‌లో హెడ్‌గా ఉన్నారు. ఇక రియాస్ చిన్ననాటి నుంచి రాజకీయాల్లో ఉన్నాడు. ప్రస్తుతం డీవైఎఫ్ఐ అధ్యక్షుడిగా కొనసాగుతున్నాడు. కిందటి లోక్‌సభ ఎన్నికల్లో కోజికోడ్ నుంచి పోటీచేసి సల్ప తేడాతో ఓటమిపాలయ్యాడు.
రియాస్ తొలిసారి 2002లో పెళ్లి చేసుకోగా 2015లో డైవర్స్ తీసుకున్నాడు. రియాస్‌కు ఇద్దరు సంతానం ఉన్నారు. అదేవిధంగా సీఎం విజయన్ కూతురు వీణకు కూడా సంతానం ఉంది. ఆమె కూడా 2015లో విడాకులు తీసుకుంది. కాగా నేడు వారిద్దరి కొంతమంది అతిథుల మధ్య వీరిద్దరు ఒక్కటయ్యారు. నూతన దంపతులకు పలువురు సెలబెట్రీలు సోషల్ మీడియాలో పెద్దఎత్తున శుభాకాంక్షలు తెలుపుతున్నారు.