Homeలైఫ్ స్టైల్Indian Lip Color Reasons: భారతీయుల పెదవులు అలా ఎందుకు ఉంటాయి.. ఇన్నాళ్లకు తెలిసింది

Indian Lip Color Reasons: భారతీయుల పెదవులు అలా ఎందుకు ఉంటాయి.. ఇన్నాళ్లకు తెలిసింది

Indian Lip Color Reasons: ఒక మనిషికి ముఖం అనేది అందాన్ని తీసుకొస్తే.. ఆ అందాన్ని పెదవులు మరింత పటిష్టం చేస్తాయి. ముఖ్యంగా ఆడవాళ్ల ముఖం పెదవుల ఆకృతితో మరింత అందంగా కనిపిస్తూ ఉంటుంది. ఆడవాళ్లు ముఖ సంరక్షణ తర్వాత.. అంతటి స్థాయిలో ప్రాధాన్యం ఇచ్చేది పెదవులకు. పెదవులు మృదువైన కణజాలాన్ని కలిగి ఉంటాయి. ఆహారాన్ని తినడానికి.. సంభాషణలు జరపడానికి ఉపకరిస్తాయి. సాధారణంగా భౌగోళిక వాతావరణం ఆధారంగా మనుషుల పెదవుల రంగు ఆధారపడి ఉంటుంది. విదేశాలలో మహిళలకు […]

Indian Lip Color Reasons: ఒక మనిషికి ముఖం అనేది అందాన్ని తీసుకొస్తే.. ఆ అందాన్ని పెదవులు మరింత పటిష్టం చేస్తాయి. ముఖ్యంగా ఆడవాళ్ల ముఖం పెదవుల ఆకృతితో మరింత అందంగా కనిపిస్తూ ఉంటుంది. ఆడవాళ్లు ముఖ సంరక్షణ తర్వాత.. అంతటి స్థాయిలో ప్రాధాన్యం ఇచ్చేది పెదవులకు.

పెదవులు మృదువైన కణజాలాన్ని కలిగి ఉంటాయి. ఆహారాన్ని తినడానికి.. సంభాషణలు జరపడానికి ఉపకరిస్తాయి. సాధారణంగా భౌగోళిక వాతావరణం ఆధారంగా మనుషుల పెదవుల రంగు ఆధారపడి ఉంటుంది. విదేశాలలో మహిళలకు పెదవులు పూర్తిగా గులాబీ రంగులో ఉంటాయి. కొందరి పురుషుల్లో కూడా అదే విధమైన రంగులు కలిగి ఉంటాయి. కానీ భారతీయుల పెదవులు అమెరికన్ ప్రజల మాదిరిగా ఉండవు. అమెరికన్ ప్రజలకు పింక్ లిప్స్ ఉంటాయి. దానికి ప్రధాన కారణం మెలనిన్.. మెలనిన్ అనేది అందాన్ని పరిపుష్టం చేసే ఒక హార్మోన్.. దీనివల్ల సూర్య రశ్మీ నుంచి రక్షణ లభిస్తుంది. ప్రమాదకరమైన కిరణాలు చర్మాన్ని తీవ్రంగా ఇబ్బంది పెడతాయి.. క్యాన్సర్ వంటి వ్యాధులు కూడా ఇటువంటి ప్రమాదకరమైన కిరణాలవల్లే వస్తాయి.

క్యాన్సర్ లాంటి ప్రమాదకరమైన వ్యాధులను మెలనిన్ అడ్డుకుంటుంది.. ముఖ్యంగా ఇందులో ఉండే హార్మోన్ పెదవులకు రక్షణ కల్పిస్తుంది. నిత్యం తాజాగా ఉంచుతుంది. కాకపోతే మెలనిన్ హార్మోన్ రాత్రిపూట పనిచేసే వారికి ఎక్కువగా ఉత్పత్తి కాదు. ముఖ్యంగా ఐటీ, దాని ఆధారిత పరిశ్రమలలో పనిచేసే వారికి మెలనిన్ ఉత్పత్తి అంతగా కాదు. దీనివల్ల వారిలో రకరకాల వ్యాధులు వస్తుంటాయి. విదేశాలలో ఉండే వారికి మెలనిన్ తక్కువ ఉత్పత్తి అవుతుంది. అందువల్లే వారిలో రక్తనాళాలు బయటకు వస్తాయి. వారి పెదవులు గులాబి రంగులో ఉండడానికి అదే కారణం. జన్యుపరమైన మార్పుల వల్ల ఇలాంటి తేడాలు కనిపిస్తుంటాయి..

“భారతీయులలో కూడా మెలనిన్ అంతగా ఉత్పత్తి కావడం లేదు. ఇటీవల కాలంలో రాత్రిపూట పని చేసే ఉద్యోగాలు పెరిగిపోతున్నాయి. సాధారణంగా బయోలాజికల్ క్లాక్ కు వ్యతిరేకంగా పనిచేస్తే దాని ప్రభావం తీవ్రంగా ఉంటుంది. హార్మోన్లు అంతగా ఉత్పత్తి కావు. దీనివల్ల రకరకాల ప్రభావాలను మనిషి ఎదుర్కోవాల్సి ఉంటుంది. అందువల్ల సాధ్యమైనంత వరకు ఉదయం పూట ఎండలో కాసేపు తిరగాలి. అప్పుడు శరీరానికి డి విటమిన్ లభిస్తుంది. దీంతోపాటు మెలనిన్ ఉత్పత్తి కూడా ప్రభావితం అవుతుంది. అప్పుడు శరీరం మరింత చురుకుగా ఉంటుందని” వైద్యులు చెబుతున్నారు.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

Oktelugu Epaper