మజ్జిగకు బదులుగా జీలకర్ర, రాక్ సాల్ట్ కలిపిన మజ్జిగను తాగండి. ఈ సూపర్ డ్రింక్ తాగితే మలబద్దక సమస్య నుంచి రిలీఫ్ పొందవచ్చు. ఆహారంలో మన చేసే తప్పులు కారణంగా మలబద్ధకం సమస్య తలెత్తుతుంది అంటున్నారు నిపుణులు. జంక్ ఫుడ్ , ప్రాసెస్డ్ ఫుడ్ వంటి ప్యాక్ చేసిన ఆహారాన్ని ఎక్కువగా తీసుకునే వారికి ఈ సమస్య మరింత ఎక్కువ బాధ పెడుతుంది. పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలు వంటి ఫైబర్ అధికంగా ఉండే ఆహారాన్ని తగినంతగా తీసుకోవాలి. కొన్ని మందుల దుష్ప్రభావాలు, తగినంత ద్రవాలు తీసుకోకపోవడం, మలవిసర్జన పోస్ట్ పోన్ చేయడం, ఆందోళన లేదా నిరాశ వంటివి కూడా మిమ్మల్ని ప్రభావితం చేస్తుంటాయి.
మజ్జిగలో జీలకర్ర, రాక్ సాల్ట్, కొత్తిమీర కలిపి తగడం వల్వ మంచి జరుగుతుంది. దీని వల్ల జీర్ణవ్యవస్థ మెరుగుపడుతుంది. ఫైబర్ అధికంగా ఉండే ఆహారాలు మన ప్రేగులను ఆరోగ్యంగా ఉంచుతాయి. ఈ సమస్యను అధిగమించడానికి, ఆహారంలో కూరగాయలు, పండ్లు, తృణధాన్యాల్ని చేర్చుకోండి.
మజ్జిగలో ప్రోబయోటిక్స్ ఉంటాయి. ఇవి కడుపులో బ్యాక్టీరియా సమతుల్యతను కాపాడుతాయి. మజ్జిగ కడుపుని చల్లబరుస్తుంది. పేగుల్ని ఆరోగ్యంగా ఉంచడంలో సహాయం చేస్తుంది. జీలకర్రలోని యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు గ్యాస్, ఎసిడిటీ నుంచి ఉపశమనం కలిగిస్తుంటాయి. ఇది జీర్ణ ఎంజైమ్లను క్రమబద్దీకరిస్తుంది.
జీలకర్రలో పోషకాలు మెండుగా ఉంటాయి. అంతేకాకుండా యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉంటాయి. ఇవి శరీరాన్ని ఫ్రీ రాడికల్స్ నుంచి రక్షిస్తాయి. గుండెని ఆరోగ్యంగా ఉంచుంది. జీవక్రియను వేగవంతం చేస్తుంది. మెటబాలిజం పెంపొందిస్తుంది. జీర్ణ సమస్యల్ని తొలగించడానికి జీలకర్ర బాగా సహాయపడుతుంది. కడుపు ఉబ్బరం, గ్యాస్ వంటి సమస్యల్ని తగ్గిస్తుంది. ఎసిడిటీతో బాధపడుతున్నట్లుయితే.. జీలకర్రను తీసుకోవడం మంచిదంటున్నారు ఆయుర్వేద నిపుణులు. ఛాతి మంట, ఎసిడీటీ, యాసిడ్ రిఫ్లెక్స్ వంటి సమస్యల్ని జీలకర్ర తగ్గిస్తుంది. జీలకర్రను తీసుకుంటే ఇందులోని పొటాషియం, ఐరన్ ఇమ్యూనిటీ పవర్ని పెంచుతుంది.
మజ్జిగ మలబద్ధకం పనిపడుతుంది. ఇందుకోసం గ్లాసు మజ్జిగలో జీలకర్ర, కొత్తిమీర కలిపి తీసుకోవాలి. రోజూ తాగడం వల్ల గ్యాస్, అజీర్ణం, ఇతర కడుపు సమస్యల నుంచి ఉపశమనం పొందవచ్చు అంటున్నారు నిపుణులు. అయితే, మజ్జిగ పల్చగా ఉండాలి. మజ్జిగను ఉదయం లేదా మధ్యాహ్నం ఆహారం తర్వాత తీసుకుంటే మంచి ఫలితాలుంటాయి. జీలకర్రను పొడి చేసుకుని మజ్జిగలో కలిపి తాగొచ్చు. రుచికి సరిపడా రాక్ సాల్ట్ కూడా కలుపుకోవచ్చు.
Swathi Chilukuri is a Journalist Contributes Film & Lifestyle News. She has rich experience in picking up the latest trends in Life style category and has good analytical power in explaining the topics on latest issues.
Read MoreWeb Title: If you drink these two together in the kitchen with buttermilk you will get constipated hush patak
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com