spot_img
Homeహెల్త్‌Biting nails: గోర్లు కొరికే అలవాటు ఉందా? అయితే ఇది మీకోసమే

Biting nails: గోర్లు కొరికే అలవాటు ఉందా? అయితే ఇది మీకోసమే

Biting nails: గందరగోళం, ఆందోళన, భయం వల్ల కొందరు గోర్లు కొరుకుతుంటారు. ఇలాంటి అలవాట్లు ఉంటే చాలు కాస్త ఒత్తిడి వచ్చినా చేతి గోర్లు నోట్లో పెట్టుకుని నమలడం, కొరకడం చేస్తుంటారు. నోట్లోనే సగం గోర్లు కూడా ఉండిపోతాయి. అంతేకాదు గోర్లు విరగడంతోపాటు అనేక సమస్యలు వస్తాయి. కొందరు ఎవరైనా మాట్లాడుతున్నా సరే తెగ గోర్లు కొరికేస్తుంటారు. నవ్వుతూ కూడా కొరుకుతుంటారు. అదొక అలవాటుగా మారిపోతుంది చాలా మందికి. కానీ ఈ అలవాటు మంచిది కాదు అంటున్నారు ఆరోగ్య నిపుణులు. అయితే మీకు కూడా ఈ అలవాటు మానేసుకోండి. ఎందుకో ఓ సారి చూసేయండి.

ఆందోళన లేదా నెర్వస్‌నెస్‌ ఉన్నప్పుడు వాటిని తెలపలేక గోళ్లు కొరుకుతుంటారు. ఈ విధంగా గోళ్లు కొరుకుతూనే భావోద్వేగాలను అదుపులో ఉంచుకోవడానికి ప్రయత్నాలు చేస్తారు. అయితే, ఇది మంచి పద్ధతి కాదు. అందుకే పలు రకాల శారీరక సమస్యలు వస్తాయి. మీకు గనుక ఈ అలవాటు ఉంటే వీలైనంత త్వరగా మానుకోవాలి. గోరు కొరకడం వల్ల శరీరంపై చెడు ప్రభావాలు పడతాయి. గోరు కొరకడం వల్ల గోళ్ల నిర్మాణం దెబ్బతినే అవకాశం కూడా ఉంది. అంతేకాదు ఈ అలవాటు వల్ల దంతాలు కూడా దెబ్బతింటాయి.

దంతాలు మాత్రమే కాదు నోట్లో చిగుళ్లు దెబ్బతింటాయి. గోరు చుట్టూ ఉన్న చర్మం పొడిబారడంతోపాటు పొరలుగా మారి ఊడిపోతుంది. ఇలా అవడం ఆరోగ్యకరం కాదు, ఆరోగ్యానికి అసలు మంచిది కాదు. ఇక ఈ గోరు కొరకడం వల్ల జీర్ణవ్యవస్థపై ప్రభావం పడుతుంది. గోళ్లను నమలడం వల్ల అనేక రకాల బ్యాక్టీరియా శరీరంలోకి ప్రవేశిస్తుంది. దీని వల్ల కడుపు సమస్యలను వస్తాయి. గోళ్లలోని మురికి నోటిలో పేరుకుపోయి జలుబు, ఇతర అంటు వ్యాధులు వస్తాయి అంటున్నారు నిపుణులు. గోళ్లు కొరకడం వల్ల పెద్దపేగు క్యాన్సర్ వచ్చే సమస్య కూడా ఉందట. గోర్లు కొరికే అలవాటు ఉన్నవారికి పొట్ట, పేగుల్లో ఇన్ఫెక్షన్ కూడా వస్తుందట.

అయితే కొందరికి గోర్లు కొరికే అలవాటు వంశపారపర్యంగా వస్తుంది అనే చర్చ కూడా ఉంది. కానీ ఈ విషయంపై ఇప్పటికీ ఎలాంటి క్లారిటీ లేదు. దీనిపై కూడా పరిశోధనలు సాగుతున్నాయి. కొంతమంది నిపుణుల ప్రకారం పిల్లల తండ్రి, తల్లికి ఈ అలవాటు ఉంటే దాని ద్వారా పిల్లలకు కూడా గోర్లు కొరికే అలవాటు రావచ్చు అంటున్నారు నిపుణులు. అయితే దీనికి పర్టిక్యులర్‌గా ఓ టైమ్ అంటూ ఉండదు. ఏదైనా సందర్భంలో చేతి వేళ్ళు, గోర్లు నోటిలోకి వారికి తెలియకుండానే వెళ్తుంటాయి. నిజానికీ చాలా మందికి గోర్లు కొరుకుతున్నామని తెలియకుండానే కొరుకేస్తుంటారు కూడా. దీనిపై వారికి ఏమాత్రం అవగాహన ఉండకపోవడం వల్ల ఈ అలవాటు మరింత పెరుగుతుంది. మరొకరు చెప్పినప్పుడు మాత్రమే ఈ విషయం గమనిస్తుంటారు కూడా.

మరి దీని నుంచి ఎలా బయటపడాలి అనుకుంటున్నారా? అయితే మీ గోర్లని ఎప్పటికప్పుడు చిన్నగా కత్తిరించుకోండి. నెయిల్ పాలిష్ ను కూడా రెగ్యులర్‌గా వేయండి. వీలైతే కొన్ని రోజులు గ్లౌజెస్ వేసుకొని ఉండండి. గోర్లు కొరకడం వల్ల వచ్చే సమస్యల గురించి తెలుసుకుంటే మానసికంగా గోర్లు కొరకకుండా మిమ్మల్ని మీరు కంట్రోల్ చేసుకునే అవకాశం ఉంటుంది. గోర్లు కొరికే సమయంలో మీరు వేరే పనిపై దృష్టిపెట్టండి. ఇలాంటి అలవాట్ల వల్ల మెల్లిమెల్లిగా గోర్లు కొరికే అలవాటుని దూరం చేసుకోండి.

Disclaimer : ఈ సమాచారం కేవలం అవగాహన, ప్రాథమిక సమాచారం కోసం మాత్రమే. దీన్ని oktelugu.com నిర్ధారించదు. ఈ సూచనలు పాటించే ముందు వైద్య నిపుణుల సలహాలు తీసుకోగలరు..

Swathi Chilukuri
Swathi Chilukurihttp://oktelugu
Swathi Chilukuri is a Journalist Contributes Film & Lifestyle News. She has rich experience in picking up the latest trends in Life style category and has good analytical power in explaining the topics on latest issues.

Related News

Most Popular

google pixel 11 : గూగుల్ లవర్స్ కు గుడ్ న్యూస్.. ఏకంగా 4 ఫోన్లు.. ఇక రెడీ...

google pixel 11 : స్మార్ట్ ఫోన్ కొనాలని చూసేవారికి గూగుల్ కంపెనీ లేటేస్ట్ గా సూపర్ న్యూస్ తెచ్చింది. ఈ కంపెనీకి చెందిన ప్లాగ్ ఫిష్ విభాగంలో కొత్త ఫోన్ ను...
Bajaj Pulsar

bajaj pulsar : సీజన్ రాకముందే ఈ పల్సర్ బైక్ లతో పండుగ చేసుకోండి.. !

bajaj pulsar : మరో నెలలో పండుగల సీజన్ ప్రారంభం కాబోతుంది. దీంతో చాలా మంది కొత్త వాహనాలు కొనాలని అనుకుంటారు. అయితే టూవీలర్స్ వినియోగదారులకు ఏ బైక్ కొనాలి? అన్న సందేహంలో...
hyperactive children

parenting tips : పిల్లలు.. డబ్బు.. ఈ విషయాల్లో జాగ్రత్త..

parenting tips : స్మార్ట్ మొబైల్ అందుబాటులోకి వచ్చిన తర్వాత పిల్లల్లో సృజనాత్మకత పెరిగిపోతుంది. ఇలాంటి సమయంలో వారు కొత్త కొత్త వస్తువుల గురించి తెలుసుకుంటున్నారు. అయితే ప్రపంచంలో ఉన్న వస్తువులను పిల్లలు...
SIR Voter List

special intensive revision : రేపే లాస్ట్.. నిర్లక్ష్యం చేస్తే లైఫ్ లాంగ్ సఫర్ అవుతారు..

special intensive revision : ఓటర్ల జాబితా సక్రమంగా చేసేందుకు నిర్వహించే స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) కార్యక్రమం ఆంధ్రప్రదేశ్లో చివరి దశకు వచ్చింది. గత కొన్ని రోజులుగా నిర్వహిస్తున్న ఈ ప్రక్రియ...
Demolished The Nagalamma Temple

temple pradakshina : దేవాలయాల్లో ప్రదక్షిణలు ఎందుకు.. ఎన్నిసార్లు ప్రదక్షిణలు చేయాలి..

temple pradakshina : చాలామంది దేవాలయాల్లోకి వెళ్లిన తర్వాత కొందరు గుడి చుట్టూ ప్రదక్షిణలు చేస్తారు. వీరిలో మూడు, 5, 9 సార్లు ప్రదక్షిణలు చేసేవారు ఉంటారు. హిందూ సాంప్రదాయం ప్రకారం ప్రతి...
Oktelugu Epaper